Nindu Manasulu Serial Today October 7th: నిండు మనసులు: తండ్రి చేసిన పనికి బ్యాగ్ సర్దేసిన ప్రేరణ! గణ ప్రేరణకు పంపిన ఫొటో ఎవరిది?
3 weeks ago 2
ARTICLE AD
నేను రాజీకి రెడీగా లేను..
రాజశేఖరంతో పాటు ఇంట్లో వాళ్లు ఎంత చెప్పినా ప్రేరణ సిద్ధూతో కలిసి ఉండటానికి ఒప్పుకోదు.. ఎవరు ఎలాంటి వాళ్లో తెలిసి కూడా సిద్ధూ నిజాన్ని ఒప్పుకోకపోవడం నాకు నచ్చలేదు.. అందుకే నేను ఈ రాజీకి సిద్ధంగా లేను.. అని అంటుంది. ఇంత జరిగాక కూడా వాళ్లు కలిసిపోవడానికి ఓ ప్రయత్నం చేశారు.. సిద్ధూ కూడా ఓ అవకాశం ఇచ్చాడు.. అతను లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు అని అంటాడు. మనకి బాగా కావాల్సిన వాళ్లు మనకి నమ్మక ద్రోహం చేస్తే చాలా బాధ కలుగుతుంది.. ఇంకా కోల్పోవడానికి ఏం లేదు నాన్న అని అంటుంది. ఈ రోజు నీ మాటలతో సిద్ధూ నీకు దూరం అయిపోయేలా ఉన్నాడు అని ఇందిర అంటే సిద్ధూ నా జీవితంలో ఎక్కడ ఉన్నాడు నాకు దూరం అయిపోయి చాలా కాలం అయిపోయింది. నేను తనకి దూరం అయిపోయి చాలా కాలం అయింది అని ప్రేరణ అంటుంది. ఇక ఈ విషయం అందరూ మర్చిపోండి అని అంటుంది.
సిద్ధూని కలిసిన రాజశేఖరం..
ప్రేరణ, సిద్ధూలను ఎలా అయినా కలపాలి అని రాజశేఖరం అనుకుంటాడు. ఉదయం ఎవరూ చూడకుండా సిద్ధూకి ఫోన్ చేస్తాడు. మిమల్ని కలవాలి మాట్లాడాలి అంటే అవసరం లేదు నీ ముఖం కూడా చూడటం నాకు ఇష్టం లేదు అని సిద్ధూ అంటాడు. బాబు ఈ ఒక్క సారికి మాట్లాడాలి అన్నింటికీ పరిష్కారం చేస్తా. నా వల్ల అయిన సమస్య నా వల్లే పోవాలి  అని సిద్ధూని చాలా బతిమాలుతాడు. దాంతో సిద్ధూ సరే అంటాడు. ఇద్దరూ ఓ చోట కలుస్తారు. నువ్వు ప్రేరణ కలిసిపోవాలి మీరు కలిసిపోవాలి అంటే ఏం చేయాలి అని రాజశేఖరం అంటే గుడిలో చెప్పా కదా అదే చేయ్ అని సిద్ధూ అంటాడు. దానికి నా కూతురు ఒప్పుకోవడం లేదు బాబు అని రాజశేఖరం అంటాడు.
అయినా ఈ పెద్ద మనిషికి బుద్ధి రాలేదు..
రాజశేఖరం, సిద్ధూ మాట్లాడటం గణ చూసి గొడవ అయిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషికి బుద్ధి రాలేదా.. సిద్ధూ బావతో మాట్లాడుతున్నాడు. ఈయన సంగతి తేల్చేస్తా అని వెళ్లబోతు అయినా ఈ విషయం ప్రేరణకు చెప్పాలి అని ఫొటో పెట్టి లొకేషన్ పెడతాడు. ప్రేరణ వెంటనే అది చూసి బయల్దేరుతుంది. ఇక రాజశేఖరం సిద్ధూని బతిమాలుతూ మీరు చెప్పినట్లు చేస్తా అని అంటాడు.
నీ కూతురు చేతకానిదా నాన్న..
ఇంతలో ప్రేరణ అక్కడికి వచ్చి ఏంటి నాన్న నీ కూతురిని చేతకాని దానిలా పెంచావా.. చేయని తప్పు ఒప్పుకుంటానని నిన్ను చంపాలని చూసిన ఈ సిద్ధూకి బతిమాలుతున్నావా.. ఎందుకు ఇలా చేశావ్ నాన్న.. ఇంతకు ముందే చెప్పా ఇలాంటి పనులు చేస్తే ఇంట్లో ఉండను అని తెలిసి కూడా ఇంత  చేస్తావా అని అంటుంది. ప్రేరణ సిద్ధూతో గొడవ పడి ఇంటికి తండ్రిని తీసుకెళ్తుంది.
ఇంటి నుంచి వెళ్లిపోతున్న ప్రేరణ..
ఇంటికి వెళ్లిన ప్రేరణ బట్టలు సర్దుకొని బయటకు వచ్చేస్తుంది. అందరూ ఆపాలని చూస్తారు. నేను ఇక్కడ ఉండకూడదు అని నాన్నే నిర్ణయించారు. అందుకే నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని ప్రేరణ అంటుంది. ఏమైంది చెప్పు అక్క అని ఐశ్వర్య అడిగితే నాన్న సిద్ధూని కలిశారు అని జరిగింది చెప్తుంది. అక్కా నాన్న చేసింది తప్పే కాదు.. నువ్వు ఇలా ప్రతీ సారి ఇంటి నుంచి వెళ్లిపోతా అని బెదిరిస్తావేంటి అని అడుగుతుంది ఐశ్వర్య. ఇందిర ఐషూని ఆపుతుంది. కూతురి జీవితం బాగుండాలి అని అల్లుడి కాలు కడిగి నెత్తిమీద నీరు వేసుకుంటే లేని అహం ఇప్పుడు కూతురి కాపురం నిలబెట్టడానికి అల్లుడిని బతిమాలడం తప్పేంటమ్మా.. నా కూతురి జీవితం నా వల్లే ఇలా అయిపోయింది అన్న బాధ నన్ను కలిచి వేస్తుందని రాజశేఖరం అంటాడు. మీ నాన్న నాకు చెప్పారు నేను కాదు అనలేదు అని ఇందిర అంటే నాతండ్రిని తప్పు పట్టిన వాడితో నన్ను కలపాలి అనుకుంటున్నారా అని ప్రేరణ అంటుంది. నీకు తల్లిదండ్రులుగా మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మా మాట విను. మా బాదే నీకు సంతోషం ఇస్తుంది అంటే నీ ఇష్టం అని ఇందిర అంటుంది.
మా నాన్నని ఎందుకు కలిశావ్..
గణ సిద్ధూ దగ్గరకు వెళ్లి మా నాన్నని ఎందుకు కలిశావ్..అని అడుగుతాడు. నీకు ఎందుకురా అని సిద్దూ అంటాడు. దాంతో ఇద్దరూ గొడవ పడతారు. మంజుల సిద్ధూతో ఎందుకు కలిశావ్ అంటే వాడే కలుస్తా అన్నాడు అని చెప్తాడు. ఎందుకు కలిశాడు అంటే రాయబారాలు నడుపుతున్నాడు అని చెప్తాడు. రేయ్ ఏ మనిషిరా మీ నాన్న..మీరంతా ఒక్కటే అని అంటాడు సిద్ధూ. ఇలా మాట్లాడే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావ్ అని గణ అంటాడు. నా దృష్టిలోనే ఆ ప్రేరణ లేదు అని అంటాడు సిద్ధూ. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Read Entire Article