Nindu Manasulu Serial Today Episode ప్రేరణ గణ మీద అనుమానంతో ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధూ ప్రేరణ దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతాడు. ప్రేరణ సిద్ధూని కూర్చొమని చెప్తుంది. సాహితి కిడ్నాప్‌ విషయంలో మనం ఎంత టెన్షన్ పడ్డామో మనకు తెలుసు మరి.. మనం వెళ్లిన 5 నిమిషాల్లో ఆ గణ అక్కడికి ఎలా వచ్చాడో అని నా డౌట్ అని అంటుంది.

సిద్ధూ ప్రేరణతో నేను అడిగా కదా కానీ తను ట్రాకర్ పెట్టా అని చెప్పాడు కదా అని అంటాడు. దానికి ప్రేరణ నాకు ఆ గణ మీదే అనుమానంగా ఉంది సిద్ధూ.. ఒక పోలీస్ ఏ కేసులోనూ చూపించని ఇంట్రస్ట్ చూపించడం.. మనల్ని భయపెట్టడం. ఏం ట్యాలెంట్ లేని ఆర్టిస్ట్‌ని తీసుకురావడం.. నీకు ఏం డౌట్ రావడం లేదా అని అంటుంది. అంటే సాహితిని గణనే కిడ్నాప్ చేశాడు అంటావా అని అడుగుతాడు. అలా అని చెప్పలేను కానీ డౌట్ ఉంది అని అంటుంది. అలా జరగదులే ప్రేరణ ఒకప్పుడు ఎస్ఐగా ఉండేవాడు సీఐ అయ్యాడు కదా అందుకే ఆ పెద్ద మనిషి వల్లే తనకు సీఐ పోస్ట్ వచ్చిందని అంత భయపడుంటాడు అని సిద్ధూ అంటాడు. గణ మైండ్‌లో ఇంకేదో ఉంది అది ఏంటో తెలుసుకోవాలి అని ప్రేరణ అంటుంది.

గణ కట్టు విప్పుతూ ఉంటే సుధాకర్ ఏంటి సార్ నొప్పి తగ్గిపోయిందా అంటే ఇలాంటి నొప్పులు ఎన్ని చూశాం ఎప్పుడో తగ్గిపోయింది అని అంటాడు. అయితే అప్పుడే సాహితి ఫ్రూట్స్ తీసుకొని రావడం చూసి వెంటనే చేయి నొప్పి అన్నట్లు నటిస్తాడు. ఇందిర కూడా అనుమానంగా చూస్తుంది. గణ సుధాకర్‌తో కట్టు కట్టించుకుంటాడు. ఇందాకే నొప్పి లేదు అన్నాడు ఇంతలో ఏమాయ రోగం వచ్చింది అని సుధా అనుకుంటాడు.

సాహితిని అప్పుడే చూసినట్లు హడావుడిగా వెళ్తాడు. సాహితిని తీసుకొచ్చి కూర్చొపెడతాడు. ఇందిర చూసి సాహితి తనని గుర్తు పట్టేస్తుందని దాక్కుంటుంది. మీరు మాయింటికి ఏంటి సాహితి గారు అని గణ అంటాడు. సుధాకర్ మనసులో ఈ నొప్పి ఈవిడ కోసం వచ్చిందా అని అనుకుంటాడు. ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఇందిర అనుకుంటుంది. సాహితిని ఈశ్వరికి గణ పరిచయం చేస్తుంది. సాహితి కోసం మంచి కాఫీ తీసుకురమ్మని తల్లితో గణ చెప్తాడు. ఈశ్వరి గంగ అని ఇందిరకు కాఫీ తీసుకురమ్మని చెప్తుంది.

గణ తల్లితో ఏంటమ్మా ఎవరో పరాయి వాళ్లు వచ్చినట్లు కాఫీ పనిమనిషికి చెప్తున్నావ్.. నువ్వే నీ చేతిలో ఓ మంచి కాఫీ తీసుకురా అని అంటాడు. ఈశ్వరి వెళ్తుంది. సుధాకర్ మనసులో వాడు నీకు పులిహోర కలుపుతున్నాడే తల్లీ నీకు తెలీదు అని అనుకుంటాడు. ఇక గణ సుధాతో నొప్పి అని చెప్పమని సైగ చేస్తాడు. గణ సాహితిని బుట్టలో వేయడానికి మాట్లాడుతూ ఉంటాడు. సాహితి గణకి థ్యాంక్స్ చెప్తుంది. నిన్ను కాపాడటం నాకు చాలా సంతోషంగా ఉందని గణ చెప్పి సాహితి కాఫీ కప్పు తీసుకోవడం ఓవర్ చేయడం ఈశ్వరి కోపంగా చూస్తుంది.

ప్రేరణ స్టడీ కేఫ్‌కి మినిస్టర్ వస్తాడు. కుమార్ చూసి ఏంటి నా మంత్రి మామ కేఫ్‌కి వస్తున్నాడు అని కంగారు పడతాడు. సిద్ధూ వాళ్ల దగ్గరకు వెళ్లి మా మామకి నా గురించి తెలిసిపోయిందిరా.. నన్ను చంపేస్తాడు అని కంగారు పడతాడు. మినిస్టర్ రాగానే ప్రేరణ ఆయనతో మీరు మాకేఫ్‌కి రావడం ఏంటిసార్ కాఫీ తీసుకుంటారా అని అంటే కొంచెం సమాచారం కావాలి అని ఇద్దరినీ కూర్చొపెడతాడు.

కుమార్ చాలా టెన్షన్ పడతాడు. ప్రేరణ నీకు మా అమ్మాయి ఎప్పటి నుంచి తెలుసు నీకు అన్ని విషయాలు చెప్తుందా.. నీకు మా అమ్మాయి గురించి అన్నీతెలుసా అని అడుగుతారు. నా కూతురిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అమ్మా.. సరిగా తినడంలేదు.. టైంకి పడుకోవడం లేదు అని అంటే డాక్టర్‌కి చూపించండి అని కుమార్ అంటాడు. దాంతో మినిస్టర్ కుమార్‌ని పక్కకి వెళ్లమని అంటాడు.

మినిస్టర్ ప్రేరణ వాళ్లతో కొద్ది రోజులుగా ఎవరో మా అమ్మాయి వెంట పడుతున్నాడు అని చెప్తారు. మా అమ్మాయి కూడా వాడిని ఇష్టం పడుతుందేమో నాకు తెలీడం లేదమ్మా అని అంటాడు. నువ్వు నిజం చెప్తావు అని నా నమ్మకం అమ్మా అని మినిస్టర్ అడిగితే ప్రేరణ నిజం చెప్పాలి అనుకుంటే సిద్ధూ ఆపేస్తాడు. మినిస్టర్‌కి కాఫీ తీసుకురమ్మని అంటాడు. మినిస్టర్ ప్రేరణతో మా అమ్మాయి ఎవరినైనా ఇష్టపడుతుందా.. తన మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగితే నేను చెప్పేది ప్రశాంతంగా వినండి సార్.. అని నిజం చెప్పబోతే సిద్ధూ కలగజేసుకొని తనకి కూడా ఈమధ్య ఏం చెప్పడం లేదని అంటాడు. మీకు ఎందుకు ఆ అనుమానం వచ్చింది సార్ అని సిద్ధూ సీసీ టీవీ ఫుటేజ్‌ మినిస్టర్ చూపిస్తాడు. ఎవరో మంకీ క్యాప్ పెట్టుకొని వచ్చాడు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.