Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(మే 27న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బాబాయ్ మీ కోసమే వచ్చా..

సిద్ధూ, విజయానంద్ తినేసి వెళ్లిపోయిన తర్వాత ప్రేరణ దగ్గరకు ప్యూన్ వస్తాడు. అతను వెళ్లిపోతుంటే ప్రేరణ చూసి బాబాయ్ మీరు ఇక్కడే తినండి అని చెప్పి ఆయనకు భోజనం పెడుతుంది. ఆయన ద్వారా ఆఫీస్‌లో విషయాలు తెలుసుకోవాలని అనుకుంటుంది. అతను సంతోషంగా ఇక్కడ అందరూ నాకు మిగిలిపోయినవి ఇస్తుంటారు. మీలా ఎవరూ లేరమ్మా అని సంతోషంగా కూర్చొని తింటారు. ప్రేరణ అతని బాక్స్ తీసుకొని తింటుంది.

ALSO READ: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతి కుట్రకు ధీరజ్ అప్పుల్లో మునిగిపోతాడా! రామరాజు ఇంట్లో ఆకలి కేకలు!

ఇక్కడ పని చేయడం ఈజీ కాదమ్మా..

ప్రేరణ ప్యూన్‌తో మాట్లాడుతూ ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంది. ఇక్కడ పని చేయడం ఈజీ కాదమ్మా ఇక్కడ ఉన్న వారంతా విజయానంద్ తొత్తులే ఒక్కరి తప్ప అని ఒక పెద్దాయన్ను చూపిస్తాడు. అతనే సిన్సియన్‌గా పని చేస్తారు అని చెప్తాడు.. ఆ పెద్దాయనకు విజయానంద్‌ గారు పని చెప్పరు.. ఆఫీస్‌లో ఆయనో ఫైర్ బ్రాండ్ అని చెప్తాడు. ఆఫీస్‌లో ఏం అవసరం వచ్చినా నన్ను అడుగమ్మా అని అంటారు.

నా కొడుకు సిద్ధూ..

విజయానంద్ బోర్డు మీటింగ్ పెట్టి మీకో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలని మీటింగ్ పెట్టా అది ఎవరో కాదు నా కొడుకు సిద్ధూ.. మంజుల మేడం గారి అబ్బాయి.. అని చెప్తాడు. ఇక నుంచి తను మనతో పాటు కంపెనీ వర్క్ చేస్తాడని తను మీతో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు అని అంటాడు. సిద్ధూ బోర్డు మెంబర్స్‌తో మన మంజుల ఫైనాన్స్ కంపెనీకి మంచి పేరు ఉంది.. కానీ రీసెంట్‌గా మన కంపెనీలో ఫ్రాడ్ జరిగింది.. ఇన్ని ఏళ్లుగా ఏ తప్పు జరగని మన కంపెనీలో ఇప్పుడు ఎందుకు ఇలా అయింది.. దానికి కారణం ఎవరు అని సిద్ధూ అడుగుతాడు.

విజయానంద్ ట్రైనింగే అంతా..

బోర్డు మెంబర్స్‌కి విజయానంద్ ముందే ట్రైనింగ్ ఇవ్వడంతో అందరూ అతను చెప్పినట్లే మాట్లాడుతారు. ఫ్రాడ్ చేసిన అందర్ని తీసేశాం కదా అని అంటారు. విజయానంద్ గారు ఉండగా కంపెనీకీ ఏం ప్రాబ్లమ్ ఉండదు.. కొత్త వాళ్లు వస్తే ప్రాబ్లమ్ అని అంటారు. దానికి విజయానంద్ మా సిద్ధూ ఇప్పుడు వచ్చాడు కదా అందరూ తనని ఎంకరేజ్ చేయమని అంటాడు. మీ అందరి మాటలు విన్నాక నాకు అర్థమైంది అతన్ని తీసేశారు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నారు కదా.. మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఎవరు ఫ్రాడ్ అన్నారో వాడు నా ముందుకు రావాలి.. వాడితో నేను మాట్లాడాలి.. నేను మా అమ్మకి సమాధానం చెప్పాలి కదా.. మీరు ఏమైనా చేయండి ఇది నాకు జరిగి తీరాలి అని సిద్ధూ అంటాడు.

ALSO READ: అత్తగారింట్లో చక్రికి అడుగడుగునా అవమానాలే...మామ ప్రతాప్‌ ఎత్తులకు అల్లుడు ఎలాంటి ఎత్తులు వేశాడు..?

మీకు ఏ అధికారం ఉంది..

ఇన్ని ఆర్డర్‌ వేయడానికి మీకు ఏ అధికారం ఉంది.. ఏ హక్కు ఉందని ఇన్ని అడుగుతున్నారు అని బోర్డు మెంబర్స్ సిద్ధూని అడుగుతారు. దానికి సిద్ధూ ఈ కంపెనీకీ ఛైర్మన్ అయిన మంజుల గారు నన్ను ఓ బోర్డు డైరెక్టర్ అనుకుంటున్నారు అని సిద్ధూ అంటాడు. ఆర్డర్ లెటర్ కూడా సిద్ధూ చూపించడంతో విజయానంద్ బిత్తరపోతాడు.

చాలా పెద్ద కథ నడిపించేశారురా..

మంజుల సంతకం చేసిన ఆర్డర్ కాగితం చూసిన విజయానంద్ చూసి విశ్వాసాన్ని పిలిచి రేయ్ చాలా పెద్ద కథ నడిపించేశారురా అని అంటాడు. దానికి విశ్వాసం సార్ చెప్పాను కదా గుత్తి వంకాయతో ఏదో మతలబు చేస్తున్నారు అని అంటాడు. సిద్ధూ నువ్వు సూపర్ ఛైర్మన్ గారి సంతకాన్ని కాదనే దమ్ము ధైర్యం వీళ్లకే కాదు మామయ్యకి కూడా లేదు అని ప్రేరణ అంటుంది. రేపు ఆయన్ను పిలిపించండి మాట్లాడాలి.. మీటింగ్ ఈజ్ ఓవర్ అని సిద్ధూ, ప్రేరణ వెళ్లిపోతారు. ఇక ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ప్రేరణ సిద్ధూతో ఇక్కడ నిజాయితీ పరుడు ఒకరు ఉన్నారని చెప్పి తీసుకెళ్తుంది. అతనితో మాట్లాడాలని ఇద్దరూ అనుకుంటే ఆయన టైం అయిపోయింది అని మాట్లాడరు.

మన పరిస్థితి ఏంటి..

గణ తండ్రితో ఇప్పుడు మనం మన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం నాన్న.. ఏంటి నాన్న నువ్వు మొదటి నుంచి మాకు అన్యాయం చేస్తున్నావ్.. రెండు కుటుంబాలు పెట్టి మమల్ని మోసం చేశావ్.. నీకు నా కంటే వాళ్లే ఎక్కువ అని తెలుసు అంటాడు. అలా ఏం లేదురా నాకు వాళ్లు ఎంతో నువ్వు అంతే అని రాజశేఖరం అంటాడు. కేసు విషయంలో వాళ్లు వెనక్కి తగ్గడం లేదు అని గణ అంటే రేయ్ గణ నేను తప్పు చేశానురా కానీ వాళ్లు అస్సలు తగ్గడం లేదురా నువ్వు ఈ కేసు సాల్వ్ చేసి సమస్య పరిష్కరించుకోరా అని అంటాడు. అసలు కేసు పెట్టిన వాళ్లే పోతే ఇక ఏ సమస్య ఉండదు కదా అని గణ అంటాడు.

భర్తకి దిష్టి తీసిన ప్రేరణ..

ప్రేరణ సిద్ధూ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాహితి వచ్చి భోజనం తీసుకెళ్లావ్ కదా.. మా అన్నయ్యని చూడాలని వెళ్లావ్ కదా అని అంటుంది. ఇంతలో సిద్ధూ, విజయానంద్ వస్తారు. ప్రేరణ సిద్ధూకి దిష్టి తీస్తా అంటుంది. ఎందుకు అని సిద్ధూ అంటే ఆఫీస్‌లో దుష్టశక్తులు ఉంటాయని ప్రేరణ అని దిష్టి తీస్తుంది. సిద్ధూ ఆఫీస్ విషయాలు మాట్లాడితే అక్కడేం జరుగుతుందో మంజుకి తెలిసిపోతుందని అనుకున్న విజయానంద్ టాపిక్ మార్చేస్తాడు. సిద్ధూ ఏంటో అర్థమైపోయింది.. మన వారసత్వం సిద్ధూ తీసుకుంటాడని అంటాడు. ఇంతలో ప్రేరణకి ఫోన్ వస్తుంది. నాకు తెలిసిన వాళ్లు వచ్చారు వెళ్తాను అని ప్రేరణ సిద్ధూకి చెప్పి వెళ్తుంది. ప్రేరణ టెన్షన్ చూసిన విజయానంద్ ఏదో దాస్తుందని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

బోర్డు మీటింగ్లో సిద్ధూ విజయానంద్‌కి షాక్ ఇవ్వడం.. ఫ్రాడ్ చేసిన వ్యక్తిని తన ముందు పెట్టాలని ఆర్డర్ వేయడం.. ప్రేరణ ఫోన్ రావడంతో టెన్షన్‌గా బయటకు వెళ్లడం తదితర ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.