Nindu Manasulu Serial Today Episode ప్రేరణని ప్రేమిస్తున్న విషయం సిద్ధూ ఇందిరకు చెప్పి మీరు ఓకే అంటే ప్రేరణకి ప్రపోజ్ చేస్తానని అంటాడు. ఇందిర ఏడుస్తూ కన్న వాడే వదిలించుకుంటే దిక్కు తోచని స్థితిలో పడ్డ మాకు నువ్వు అండగా ఉండటం పెద్ద త్యాగం. అది కొన్ని రోజులకు పాపం కూడా అవుతుంది అని అంటుంది. దానికి సిద్ధూ ఇందిరతో ప్రేరణ తండ్రి ఎవరూ అన్నది నాకు సంబంధం లేదు.. నేను ప్రేరణని మాత్రమే ప్రేమించా.. తను డాటర్ ఆఫ్,, కేర్ ఆఫ్ చూసి ప్రేమించలేదు.. తన వ్యక్తిత్వం నచ్చి ప్రేమించా అని అంటాడు. మీ భయం మా అమ్మ గురించే అయితే మా అమ్మని నేను చూసుకుంటా.. ముందు మీరు మనస్ఫూర్తిగా చెప్పండి నేను ప్రేరణని కరెక్టో కాదో చెప్పండి.. అని అడుగుతాడు.

ఇందిర ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. ఆంటీ మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా భయం.. మీ భయం మాకు అడ్డు కాకూడదు.. ధైర్యం కావాలి.. అనవసరంగా కన్నీళ్లు వృథా చేసుకోకుండి.. నేను తప్పుగా మాట్లాడుంటాను క్షమించండి.. ప్రేరణ మాత్రం నేను ప్రాణంకంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు.. మీరు ఓకే చెప్పిన వరకు ప్రేరణకు నా ప్రేమ విషయం చెప్పను.. ఇది ఈ సిద్ధూ మీకు ఇచ్చిన మాట అని అంటాడు. నువ్వే నన్ను క్షమించాలి బాబు.. నువ్వు చాలా మొండివాడివి.. ప్రేరణ కోసం మీ అమ్మని వదులుకుంటావ్.. ప్రేరణ కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావ్.. నీకు ఏమైనా అయింటే మీ అమ్మ మమల్ని క్షమించేదా.. అని అంటాడు. అలా రాసుంది కాబట్టి అలా జరిగింది కానీ ఈ చేయి మాత్రం ఎప్పటికీ ప్రేరణని వదలదు అని అంటాడు. అయింతే వదలకు బాబు.. నీ మనసులో ఉన్నది ప్రేరణకి చెప్పు.. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా.. నా కూతురి జీవితంలో సిద్ధూకి మించిన వాడు రాడు ఉండడు.. ఇది సత్య.. ఈ చేయి ప్రేరణని వదలొద్దు బాబు అని అంటుంది. మాటిస్తున్నాను ఆంటీ వదలను అని అంటాడు. నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా వెళ్లి నీ మనసులో మాట చెప్పు అంటుంది. సిద్ధూ సంతోషంగా వెళ్తాడు.

సిద్ధూ ప్రేరణ దగ్గరకు వెళ్లి బయటకు వెళ్దాం పద అంటాడు. కాఫీ కావాలని ప్రేరణ అంటే కేఫ్‌లో తాగుదాం అంటాడు. మీరు ఏం మాట్లాడుకున్నారు అంటే ఓ విషయంలో పర్మిషన్ తీసుకున్నానని అంటాడు. ఏం మాట్లాడారు అని ప్రేరణ అడిగితే నీ గురించే అని ఇందిర అంటుంది. నా గురించి నా పర్మిషన్ లేకుండా ఏం మాట్లాడారు అని ప్రేరణ అడుగుతుంది. మొహాలు చూసుకుంటే నాకు ఏం తెలుస్తుంది నోరు విప్పిండి అని అంటుంది. మీ అమ్మగారికే చెప్పాలని మాట ఇచ్చుకున్నా.. అయినా ఈ డిస్కషన్ ఎందుకు పద బయటకు వెళ్దాం అంటాడు సిద్ధూ. ప్రేరణ తల్లితో నీ ముందే నన్ను బయటకు తీసుకెళ్తా అంటే ఏం మాట్లాడవు ఏంటి.. చెప్పమ్మా అంటుంది. సిద్ధూతో వెళ్లు అని ఇందిర అంటుంది. ప్రేరణ షాక్ అయిపోతుంది. సిద్ధూ ప్రేరణని తీసుకొని బయటకు వెళ్తాడు.

ప్రేరణ బయటకు ఎందుకు తీసుకొచ్చావ్ అంటే సిద్ధూ ఒక విషయం చెప్పాలి అంటే చెప్పు అని ప్రేరణ అంటే గులాబి పువ్వు ఇస్తాడు. ప్రేరణ షాక్ అయిపోతుంది. ఇది ఎక్కడిది అని అంటే నేనే నీ కోసం తెచ్చా అంటాడు. నేను పెట్టుకోను కదా అంటుంది ప్రేరణ. ఇక సిద్దూ నీకు ఎవరు ఇష్టం అని అడిగితే అమ్మ, చెల్లి అంటుంది. వాళ్లు కాదు తర్వాతా అంటే సినిమా వాళ్లు అని కొందరి పేర్లు చెప్తుంది. వాళ్లు కాకుండా ఎవరు అని అడుగుతాడు. తన పేరు చెప్తుందేమో అని ఎవరు ఎవరు అని అడుగుతాడు. ఇంతలో కుమార్ కాల్ చేసి కేఫ్‌కి రమ్మని సిద్ధూకి చెప్తాడు. సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ వెళ్తారు. మంజుల, విజయానంద్ ఇద్దరూ కేఫ్‌ దగ్గర ఉంటారు. ఇక ప్రేరణ తండ్రి కూడా క్యాప్ పెట్టుకొని దూరంగా వాళ్ల సంభాషణ వింటాడు. అప్పుడే సిద్ధూ మంజుల కొడుకు అని రాజశేఖరానికి తెలుస్తుంది. మంజుల సిద్ధూతో నా కొడుకు మంచి దారిలో వెళ్తాడు అనుకుంటే తప్పుడు కేసులో ఇరుక్కున్నాడు అని కంప్లైంట్ పేపర్ చూపిస్తుంది. అందులో ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ భార్యభర్తలు అని రాసి ఉండటం గురించి ప్రశ్నిస్తారు. ఇలాంటి కేసులో నువ్వు ఇరుక్కోవడం ఏంటి ఛీచీ అని అంటుంది. మమల్ని ఈ కేసులో ఇరికించారు అమ్మా అని సిద్ధూ చెప్తాడు. ప్రేరణ కూడా తప్పు చేయలేదు తలదించుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. అయితే మరి నువ్వు తన భార్య అని చెప్పడం ఎందుకు అని విజయానంద్ అడుగుతాడు.

రాజశేఖరం మొత్తం విని విజయానంద్ అని పళ్లు కొరుకుతాడు. ప్రేరణ తండ్రి రాజశేఖరానికి విజయానంద్, మంజులలు ముందే తెలుసు అని అర్థమవుతుంది. సిద్ధూ, ప్రేరణలు జరిగింది అంతా చెప్తారు. అంతా కావాలనే చేసినట్లు ఉందని విజయానంద్ అంటాడు. రాజశేఖరం కోపంగా చూస్తాడు. ఇక మంజుల ప్రేరణతో నా కొడుకుతో తిరగొద్దు అని చెప్తే వినడం లేదు.. ఆ రోజు సిద్ధూ అక్కడికి రాకుండా ఉంటే ఆ పరిస్థితి వచ్చేదే కాదు అని అంటుంది. ప్రేరణ వల్లే మన సిద్ధూపై తప్పుడు నింద పడింది.. అంతటికీ ప్రేరణే కారణం అని విజయానంద్ అంటాడు.

ఇక మంజుల ప్రేరణతో నువ్వు నాకు ఓ సాయం చేయాలి.. నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి అని అడుగుతుంది. నాకు ప్రాణం ఇచ్చిన సిద్ధూ కోసం ఏమైనా చేస్తా అని ప్రేరణ అంటే నా కొడుకుని మర్చిపో అని మంజుల అంటుంది. ప్రేరణ సిద్ధూ షాక్ అయిపోతారు.సిద్ధూ ప్రేరణని ప్రేమిస్తున్న విషయం చెప్పబోతే మంజుల ఆపేస్తుంది. కొంగు చాచి అడుగుతున్నా నా కొడుకుని మర్చిపో వాడికి దూరంగా ఉండు అని అడుగుతుంది. ప్రేరణ ఏం సమాధానం చెప్పకపోవడంతో మంజుల కారు దగ్గరకు వెళ్లి గన్ తీసుకొని వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.