Nindu Manasulu Serial Today Episode ప్రేరణని ఇంకెప్పుడూ ఏ గొడవల్లో తలదూర్చొద్దని మాటివ్వమని ఇందిర అడుగుతుంది. ఇంతలో సిద్ధూ ఇందిర చేతిలో చేయి వేసి తను కాదు ఆంటీ నేను మీకు మాటిస్తున్నా.. నేను ఉండగా ప్రేరణకు ఏమీ కానివ్వను.. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి మరీ తనని నేను కాపాడుతా.. ఎవరు వచ్చినా ఏం చేసినా నన్ను దాటుకొని తన దగ్గరకు వెళ్లాలి.. ఇక నుంచి ప్రేరణ రక్షణ నా బాధ్యత.. మీకు మాటిస్తున్నా ఇక నుంచి మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తాడు.

ప్రేరణను టెన్షన్ పడొద్దు అని కేఫ్‌ని ఎవరు నాశనం చేశారో వాళ్ల చేతే బాగు చేయిస్తా అని కుమార్‌ని తీసుకొని బయటకు వెళ్తాడు. మినిస్టర్ దగ్గరకు గణ వెళ్లి మినిస్టర్‌ని పక్కకి పిలిచి కేఫ్ ద్వంసమైన వీడియో చూపిస్తాడు. గణ తన మనుషులతో కేఫ్ మొత్తం నాశనం చేశానని చెప్తాడు. మినిస్టర్ చాలా హ్యాపీగా ఫీలవుతారు. ప్రేరణ, సిద్ధూలకు ఏ ఆధారం లేక రోడ్డున పడ్డారు.. ఇప్పుడు వాళ్లతో మనం ఓ ఆట ఆడుకోవచ్చని అంటాడు. మినిస్టర్ గణని పొగిడేస్తాడు. మరి నా ఉద్యోగం అని గణ అంటే రేపే నీ ఉద్యోగం నీకు వస్తుంది అని మినిస్టర్ అంటారు. ఇంతలో విజయానంద్ అక్కడికి వస్తాడు.

మినిస్టర్ కోపంగా నువ్వు నీ కొడుకు చేసింది చాలదా మళ్లీ ఎందుకు వచ్చావ్ అంటాడు. గణ అయితే సార్ ఈయన్ను నమ్మకండి సార్.. నమ్మకద్రోహానికి మారు పేరు ఈయన అంటాడు. సిద్ధూ ప్రేరణలు అంతా చేశారు.. నన్ను వదిలేయండి.. మీరు అంతా మర్చిపోండి.. మళ్లీ మనం బిజినెస్ చేద్దాం అంటాడు. మినిస్టర్ విజయానంద్‌తో నేను నిన్ను క్షమించినా నీ కొడుకుని అస్సలు ఊరుకోను వదలను అంటాడు. మీరు అంత పని చేయకండి సార్.. నా అనుభవంతో చెప్తున్నా వాడి జోలికి వెళ్లొద్దు అంటాడు. నేను వాడిని వదలను అంతకు అంతా పగ తీర్చుకుంటా అని అంటాడు.

సిద్ధూ ఎంట్రీ ఇస్తాడు. సిద్ధూ ఎందుకు వచ్చాడా అని మినిస్టర్ అనుకుంటాడు. కేఫ్ పోయిందని మీ కాళ్లు పట్టడానికి వచ్చాడు సార్ అని గణ అంటాడు. ఇక విజయానంద్ అయితే మనసులో వీళ్లతో చేతులు కలిపాను అని సిద్ధూ పొరపాటు పడతాడేమో మ్యానేజ్ చేయాలి అనుకుంటాడు. విజయానంద్‌ సిద్ధూతో నీ కోసం మాట్లాడటానికే వచ్చా.. నువ్వు ఒక్క సారీ చెప్పేయ్ అని అంటాడు. తెలిసి నేను ఏ తప్పు చేయలేదు నేను ఎందుకు సారీ చెప్పాలి.. కానీ జరిగిన విషయాల వల్ల ప్రేరణ ఇబ్బంది పడుతుంది అందుకే సారీ చెప్పాలి అని వచ్చా అని అంటాడు. మినిస్టర్ ఏం చేయలేదు అని విజయానంద్ అంటే అని నువ్వు అనుకుంటున్నావ్.. కానీ ఈయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో తనని బాధ పెడుతున్నారు అంటాడు. నాకు ఇంకేం పని లేదా అని మినిస్టర్ అంటే మరి కేఫ్ ఎందుకు నాశనం చేశారు అని అడుగుతాడు.

విజయానంద్ కొడుకుతో నిన్ను, ప్రేరణను ఏం చేయను అని మీడియాతో చెప్పారు కదా మరి ఎందుకు ఏం చేస్తారు అని అడుగుతాడు. ఆ విషయం ఆయన్ని అడగండి.. నేను కూడా దానికి సమాధానం తెలుసుకోవడానికి వచ్చా అని అంటాడు. మినిస్టర్ తనకు ఏం తెలీదు అంటాడు. సిద్ధూ ఇంత కచ్చితంగా చెప్తున్నాడు అంటే ఈయన చేసే ఉంటాడు.. ఇక నేను సైలెంగ్‌గా ఉండాలి అని విజయానంద్ అనుకుంటాడు. గణ సిద్ధూతో ఆయన ఏం చేయలేదు వెళ్లుఅని అంటే ఇలా మధ్యలో దూరి ఉద్యోగం పోగొట్టుకున్నావ్.. ఇంకా మధ్యలో దూరితే ఏం అయిపోతావే నాకే తెలీదు అంటాడు సిద్ధూ. కూతురి ప్రేమని అర్థం చేసుకోకుండా తప్పు చేశారు.. పెళ్లి ఆపాలని చూశారు.. అదీ కుదరక అల్లుడిని చంపేయాలని చూశారు.. అదీ తప్పే కదా సార్.. అయినా సరే నేను మీకు సారీ చెప్తా.. ఎందుకు అంటే నా అనుకునేవాళ్లకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను.. జరిగిన దాంట్లో నా తప్పు ఉందని మీకు అనిపిస్తే నన్ను ఏమైనా చేసుకోండి.. ప్రేరణ జోలికి మాత్రం వెళ్లొద్దు.. అయినా మీరు కాదు కూడదు అంటే నా విశ్వరూపం చూస్తారు.. నా గురించి మీకు అర్థం కాకపోయినా మీ పక్కవాళ్లకి అడగండి చెప్తారు.. నేను కామన్ మెన్‌ని సార్.. నేను నా లక్ష్యం కోసం కష్టపడుతున్నా.. మీరు అలా కాదు.. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు.. పొరపాటున ఏమైనా మొత్తం జీరోకి వెళ్లిపోతారు.. మళ్లీఈ స్థాయికి రావడం చాలా కష్టం.. మీ వల్ల ప్రేరణకి కానీ వాళ్ల అమ్మకి ఏమైనా అయితే నేను ఏం చేస్తానో నాకు తెలీదు.. ఒక్క వారం మీ మీద ఫోకస్ పెడితే ఏమైపోతారో మీకే తెలీదు.. దయచేసి వాళ్ల జోలికి రాకండి.. నేను గట్టిగా తలచుకుంటే మీరు అనే వాళ్లే ఉండరు.. అని సిద్ధూ సారీ చెప్తూనే స్వీట్‌గా వార్నింగ్ ఇస్తాడు.

గణ సిద్ధూతో నీకు ఎంత పొగరురా.. మినిస్టర్‌ ఇంటికి వచ్చి మినిస్టర్‌కి వార్నింగ్ ఇస్తావా.. ఆయన తలచుకుంటే ఏం అవుతుందో తెలుసా అంటాడు. అవునా అని సిద్ధూ కుమార్‌ని పిలుస్తాడు. కుమార్ తనని ఫుల్లుగా కొట్టినట్లు నటిస్తూ వస్తాడు. ఎవరురా ఇలా చావగొట్టారు అని సిద్ధూ అంటే మా మినిస్టర్ మామే అని అంటాడు. నాకేం తెలీదయ్యా అమ్మ తోడు అని మినిస్టర్ వణికిపోతాడు. గణని కోపంగా చూస్తాడు. నేను ఎందుకు చేయిస్తా సార్ నన్ను చూడకండి అని అంటాడు. ఏమయ్యా కుమార్ ఎందుకు ఇలా చెప్తావ్ నేను ఏం చేయలేదు.. నా కూతురి మీద ప్రమాణం అంటాడు. దానికి సిద్ధూ మీరు చెప్పింది ఎవరూ వినరు సార్ మీ కూతురు, కుమార్ చెప్పిందేవింటారు అని అంటాడు. ఇద్దరినీ మీడియా ముందుకు తీసుకెళ్తే ఏం అవుతుంది అని సిద్ధూ అంటాడు. ఏం చేసుకుంటావో చేసుకో అని గణ అంటే మినిస్టర్ గణని తిట్టి సిద్ధూని బతిమాలుతాడు. కుమార్ మీద ఈగ వాలకుండా చేస్తా.. నీ మనసు గాయపరచను.. కేఫ్ ఎవరు పోగొట్టినా రెడీ చేయిస్తా అంటాడు. అల్లుడు హాస్పిటల్‌కి వెళ్దాం పద అంటే వద్దలే మామయ్య ఇంటికి వెళ్లి మీ అమ్మాయి చేతి కాఫీ తాగితే సెట్ అయిపోతుంది అని అంటాడు. అంటే ఇదంతా నటనా అని అవును అని ఇప్పుడు నటనే కానీ ఇంకోసారి ఏమైనా చేస్తే కత్తితో నన్ను నేను పొడుచుకొని మా మామయ్య మీద తోసేస్తా అంటాడు. అస్సలు మాట తప్పను మీరు ప్రశాంతంగా వెళ్లండి అని అంటాడు. అంతా నీ వల్లే అని గణని మినిస్టర్ తిడతాడు. ఏం చేస్తావో నాకు తెలీదు రేపే కేఫ్ బాగు అయిపోవాలి.. కొత్తగా రెడీ అయిపోవాలి లేదంటే నీ ఫొటోకి నేనే దండ వేస్తా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.