Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు( ఆగస్టు 22న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గణనే మొత్తం చేశాడు..

ఎమ్మెల్యే శంకర్ కొడుకుని బయటకు తీసుకురావడంతో సిద్ధూ, ప్రేరణలు చూసి నీ పలుకుబడితో తీసుకొచ్చావ్..కానీ వాడిని జీవితాంతం జైలు పాలు చేస్తా అని సిద్ధూ అంటే శంకర్ పెద్దగా నవ్వి.. నేను నా పలుకుబడినే వాడలేదురా.. నీ ఇంట్లో నీ కళ్ల ముందే ఉంటూ నీ మీద పగతో ఉన్న గణ గాడు నా కొడుకుని విడిపించాడు వాడే మీకు సాయం చేశాడు అని చెప్పడంతో సిద్ధూ, ప్రేరణ షాక్ అయిపోతారు. మళ్లీ మా వైపు వస్తే మీకు జీవితాలే ఉండవు.. ఆ గణ గాడిని ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎమ్మెల్యే వెళ్లిపోతాడు.

గణని లాగిపెట్టి కొట్టిన ప్రేరణ..

గణ సంగతి తేల్చుదాం అని సిద్ధూ ప్రేరణ కోపంగా ఇంటికి వెళ్తారు. అందరూ కిందే ఉండటంతో ప్రేరణ గణ దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలా చేశావ్‌రా.. అని లాగి పెట్టి కొడుతుంది. నా భర్తనే కొడతావా వదినా అని సాహితి అంటే నేను కొట్టాను వేరే వాళ్లు అయితే మెడ పట్టుకొని గెంటేస్తారు అని అంటుంది. అసలేం అయింది అని మంజు అడిగితే మేం సాక్ష్యాలతో సిద్ధూని పొడిచిన వ్యక్తిని అదే ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయిస్తే వీడు వదిలేశాడు అని అంటుంది. నువ్వు మారావా అనుకున్నాం రా జీవితంలో నువ్వు మారవు.. ఎంతకి అమ్ముడైపోయావు అని ప్రేరణ నిలదీస్తుంది.

మీ వల్లే ఇదంతా..

మీరు ముందు వెనక ఆలోచించకుండా ఇదంతా జరిగింది అని గణ అంటాడు. బ్రేస్‌లెట్‌ ఒక్కదానితో వాళ్లని అరెస్ట్ చేయలేం.. ఎమ్మెల్యే స్టేషన్‌కి వచ్చి అతన్ని ట్రాప్ చేయడానికే వేరే వాళ్లతో ఫోన్ చేయించారని కంప్లైంట్ ఇచ్చాడు.. నీ మీద మర్డర్ యత్రం చేశాను అని ఎవడో వచ్చి లొంగిపోయాడు అని ఓ రౌడీ ఫొటో చూపిస్తాడు. రేయ్ అసలు వాడిని నేను చూడనే లేదురా మొదటి సారి చూస్తున్నా వాడు నన్ను ఎందుకు చంపాలి అనుకుంటాడురా.. నీ నాటకాలు ఆపురా అని సిద్ధూ అరుస్తాడు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అర్థం కావడం లేదు అని మంజుల అంటుంది. సిద్ధూ ఆవేశం వల్లే ఇదంతా అవుతుందని గణ అంటాడు. నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసురా.. అందుకే సాక్ష్యాలు నా దగ్గరే ఉంచుకున్నారా అని సిద్దూ అంటాడు.

నీ భర్తని అంటే ఊరుకుంటావా..

సాహితి సిద్ధూ, ప్రేరణల మీద అరుస్తుంది. నా భర్తని తప్పు పడితే ఊరుకోను ఇంటి నుంచి వెళ్లిపోతా అని గోల చేస్తుంది. అన్నీ తెలిసి అలా అంటావేంటి అని ప్రేరణ అంటే నేను నీ భర్తని అంటే ఊరుకుంటావా అని సాహితి అంటుంది. మొత్తానికి గణ కోసం సాహితి, ప్రేరణ కొట్టుకుంటారు. ఇక సాహితి బాధ పడుతూ ఉంటే గణ చూసి తెగ ఫీలైపోతుంది రెచ్చగొట్టాలి అనుకొని కావాలనే సాహితితో వాళ్లు ఆలోచన లేకుండా అన్నీ చేసి ఇంత వరకు తెచ్చుకున్నారు అని అంటాడు. ప్రేరణకు వెళ్లి సారీ చెప్పమని అంటాడు. నేను చచ్చినా చెప్పను అని సాహితి అంటుంది.

సాహితి ముఖం చూసి ఊరుకుంటున్నా..

ప్రేరణ కోపంతో వాడిని ఎందుకు వదిలేశావ్ అంటే సాహితి ముఖం చూసి వదిలేశా అని సిద్ధూ అంటాడు. వాడికి శిక్ష పడకపోతే వాడిని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటా అని సిద్ధూ అంటాడు. ఆవేశం వద్దు సిద్ధూ అని ప్రేరణ అంటుంది. మనం తప్పు చేయకపోతే ఆలోచించాల్సిన అవసరం లేదు అని సిద్ధూ అంటాడు. పది మందికి మంచి అయితే ఏం ఆలోచించకూడదు అని సిద్ధూఅంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.