Nindu Manasulu Serial Today Episode విజయానంద్ సిద్ధూతో రోడ్డు మీద ఎవర్ని పెళ్లి చేసుకున్నా నేను ఒప్పుకునే వాడిని కానీ ఇలాంటి నీతి తప్పిన ఆడదానికి పుట్టిన ఈ ప్రేరణని పెళ్లి చేసుకోవడాన్ని నీ తండ్రిగా నేను ఒప్పుకోను అని విజయానంద్ అంటాడు. దానికి ప్రేరణ ఏయ్ ఛీ నువ్వు తండ్రివేంట్రా సిద్ధూ తండ్రిని చంపిన హంతకుడివి నువ్వు అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు.

మంజుల కంగారుగా ఏమన్నావ్.. సిద్ధూ తండ్రిని చంపిన హంతకుడా.. అని అడుగుతుంది. విజయానంద్ మనసులో నేనే సిద్ధూ తండ్రిని చంపానని ప్రేరణకు తెలుసు.. అంటే సిద్ధూ నన్ను హంతకుడు అని అనుమానిస్తున్నాడు.. వీడు నిజం తెలుసుకునేలోపు నేను ఆట మొదలు పెట్టాలి.. తల్లీ కొడుకులు నిజం తెలుసుకునేలోపు ఇద్దరి మధ్య అగాధం సృష్టించాలి అని అనుకొని అంటారు మంజు.. ఎన్ని అయినా అంటారు వాళ్లు.. నీ మెడలో తాళి ఊడకుండా ఉండటానికి హంతకుడు ఏంటి ఎన్ని నిందలు అయినా నా మీద వేస్తారు.. బాగుందమ్మా చాలా చాలా బాగుంది.. ఏం సిద్ధూ ఇంతా నువ్వే చెప్పావా.. అయినా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా.. నువ్వు అనుమానించడమే కాకుండా ఇక్కడ అందరూ అనుమానించేలా చేస్తున్నావా.. అందర్ని నమ్మిస్తున్నావ్.. అంటే నీ దృష్టిలో నేను నీ తండ్రిని చంపిన దుర్మార్గుడినా.. చెప్పు సిద్ధూ నేను హంతకుడిలా కనిపిస్తున్నానా.. ఇంత మౌనంగా ఉన్నాడు అంటే వాడు ఒప్పుకున్నట్లే మంజు.. ఈ తండ్రిని ఆ కొడుకు అందరి దృష్టిలో హంతకుడిని చేశాడు.. బతికున్న శవాన్ని చేశాడు.. నాకు ఇప్పుడు చనిపోవాలని ఉంది.. కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటే వాడు నన్ను ఇప్పుడు హంతకుడు అన్నాడు మంజు అంటూ విజయానంద్ గుండె పోటు వచ్చినట్లు ఏడుస్తూ కుప్పకూలిపోయినట్లు నటిస్తాడు.

సిద్ధూ షాక్‌లో అలా ఉండిపోతాడు.. ప్రేరణని కోపంగా చూస్తాడు.. నా వల్ల కాదు మంజు నన్ను హంతకుడిని చేసేశాడు అని విజయానంద్ గుండె పట్టుకొని ఏడుస్తాడు. మంజుల ఏడుస్తూ సిద్ధూని దగ్గరకు వచ్చి రేయ్ తండ్రి లేని నిన్ను తన భుజాల మీద ఎత్తుకొని పెంచారు.. నాకు తోడుగా ఉండి.. ఏ కష్టం రాకుండా చూసుకున్నారు.. మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే కాకుండా అర్హత స్థాయి లేని దానితో మన ఇంటి పెద్దని ఇంత మాట అనిపిస్తావా.. ఇంత దిగజారుతావని కలలో కూడా అనుకోలేదు.. నువ్వు నా కడుపున పుట్టినందుకు.,. ఛీ నాకే అసహ్యంగా ఉంది.. ఏం చేయాలి అనుకుంటున్నావురా.. ఇలా అబద్ధాలు చెప్పి మా ఇద్దరినీ విడదీయాలి అనా నీ ఆలోచన చెప్పు.. ఇలా కొద్ది కొద్దిగా బాధ పెట్టే కంటే ఒకేసారి చంపేయ్.. లేదంటే ఇంత విషం ఇచ్చి నా ప్రాణాలు తీసేయ్ అని ఏడుస్తుంది. ఇంకా ప్రాబ్లమ్ అయితే మేం ఇద్దరం చనిపోయాం అని చెప్పు.. ఇక జన్మలో నీ ముఖం నాకు చూపించకు.. ఇన్నాళ్లు సిద్ధూని కన్న ప్రేమతో చూసుకున్నాను.. కానీ వాడు ఆ ప్రేమని పేగు బంధాన్ని తెంచేసుకున్నాడు.. పదండి వెళ్దాం అని అంటుంది. అమ్మా అని సిద్ధూ అంటే ఈ క్షణంతో నువ్వు నన్ను అమ్మ అనిపిలిచే అర్హత కోల్పోయావ్ అని భర్తని తీసుకొని వెళ్లిపోతుంది. సిద్ధూ ఏడుస్తూ ప్రేరణని చూస్తాడు. ప్రేరణ కూడా ఏడుస్తుంది.

గణ ఆవేశంగా ప్రేరణ వాళ్ల గురించి తలచుకొని రగిలిపోతూ ఉంటే.. ఈశ్వరి కొడుకుతో ప్రేరణని సిద్ధూ పెళ్లి చేసుకున్నా మంజుల కోడలిగా అంగీకరించదు.. ఒకవేళ ఏమైనా అంగీకరించేలా ఉన్నా విజయానంద్ మంజుల మనసు మార్చేస్తాడు. ప్రేరణ బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయింది.. కూతురి బతుకు ఇలా అయిపోయింది అని ఇందిర ఏడ్చి ఏడ్చి చచ్చిపోతుంది అని ఈశ్వరి అంటుంది. అమ్మా ఇదంతా జరుగుతుందా అని గణ అంటే కచ్చితంగా ఇదే జరుగుతుందని ఈశ్వరి అంటుంది. కొడుకు ఇష్టాన్ని కాదు అనేంత మూర్ఖురాలు కాదు ఆ మంజుల.. నేను ఎన్ని రకాలుగా చెప్పాలి అనుకున్నా నమ్మడం లేదు అని చెప్తాడు. విజయానంద్ ఉండగా ఆ తల్లీకొడుకుల్ని ఎప్పటికీ ఒక్కటి చేయనివ్వడు.. అని అంటుంది.

సిద్ధూ బాధగా ఉంటే ప్రేరణ అక్కడికి వెళ్లి సిద్ధూ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏం మాట్లాడాలి దేని గురించి మాట్లాడాలి.. నీతో మాట్లాడాలి అంటే నాకు చాలా భయంగా ఉంది.. ఏం మాట్లాడితే ఏం బయట పెడతావో ఆ మాటల్ని ఎలా వాడుకుంటావో.. ఆ మాటల్ని ఎవరి మీద ఎలా వాడుతావో అని భయంగా ఉంది.. ఒక మనిషి మీద సర్వహక్కులు ఎప్పుడు వస్తాయో తెలుసా.. ఆ మనిషిని నమ్మినప్పుడు.. నమ్మకం అనే మాట లేనప్పుడు కన్నీళ్లు కూడా కళ్లను నమ్మవు.. ఈ రోజు నా మీద నీకు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది అని అంటాడు. సారీ సిద్ధూ కావాలని మాట్లాడలేదు.. నన్ను క్షమించు అని ప్రేరణ అంటే.. గుండెకు అయిన గాయాన్ని గుండె చప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుందని సిద్ధూ అంటాడు. ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నా మనసుని తూట్లుగా పొడిచాయ్.. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్న బాధ కంటే.. నీ మాటలకు మా అమ్మ మనసు విరిగిపోయింది.. నేను నిన్ను నమ్మి ఓ విషయాన్ని నీకు చెప్పాను.. నా మనసుని అర్థం చేసుకున్న మనసు నువ్వే అని నేను నమ్మి.. నా జీవితంలో అతి పెద్ద రహస్యం నీకు చెప్పుకున్నా.. అది తిరిగి నా జీవితంలో ప్రయోగిస్తావు అనుకోలేదు.. మా అమ్మని బాధ పెడతావు అనుకోలేదు.. మీ అమ్మ బాధ పడుతుంది అని అన్నాను అన్నావ్.. మరి ఇప్పుడు మా అమ్మ బాధ పడింది కదా.. ఏడ్చింది కదా.. నా కళ్లలో కన్నీరు తిరిగాయ్ చూశావు కదా.. చిన్నప్పుడు నుంచి తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో తెలుసా.. ఏ అమ్మకి దూరం అయ్యానో ఆ అమ్మకి దగ్గర చేశావ్ కాదు అనను.. దానికి రుణపడి ఉంటాను.. కానీ ఈ రోజు అదే అమ్మ నన్ను అసహ్యించుకునేలా చేశావ్.. నీకు ఇంకా కోపం పోకపోతే వెళ్లి ఊరందరికీ చాటింపు వేసి చెప్పు.. సిద్ధూ వాళ్ల ఫ్యామిలీ ఇలాంటిది.. సిద్ధూ ఇలాంటి వాడు.. వాళ్ల అమ్మ ఇలాంటిది అని చెప్పు.. ఎన్ని బంధాలు తెగిపోయినా బతకగలం కానీ తల్లితో బంధం కోల్పోతే బతకలేం.. బతికున్న ఆ బంధం తెంచాలని చూడకు.. ఆ విజయానంద్ నా మీద చావు దెబ్బ కొట్టినా కోలుకోగలిగాను.. కానీ నువ్వు చేసిన గాయం ఎప్పటికీ మానదు.. అని వెళ్లిపోతుంటే ప్రేరణ ఆపుతుంది.

ప్రేరణ ఈ జన్మలో నీ రుణం మర్చిపోలేనంత బాధకి గురి చేశావ్.. మీ అమ్మ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు అని దండం పెట్టి వెళ్లిపోతాడు. ప్రేరణ చాలా బాధ పడుతుంది. విజయానంద్ జరిగింది తలచుకొని తాగుతూ ఎంత తాగినా ఎక్కడం లేదు ఏంట్రా అని విశ్వాసం మీద అరుస్తాడు. అందరికీ నా మీద అనుమానం వస్తుందేంట్రా.. ఈ ప్రేరణకి నా మీద అనుమానం వచ్చింది.. చంపేస్తారా.. అని అంటాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి.. అని అనుకుంటాడు. ప్రేరణ తల్లి దగ్గర సిద్ధూ మాటలు తలచుకొని ఏడుస్తుంది. తల్లికి సిద్ధూ అన్న మాటలు చెప్పి.. ఆ విజయానంద్ నీ గురించి అన్ని అంటే ఎలా ఊరుకుంటారు.. సిద్ధూ వాళ్ల అమ్మ బాధ పడింది.. సిద్ధూ నన్ను తప్పు పడుతున్నాడు అని అంటుంది. అలా అని నిన్ను ప్రేమించిన వాళ్లని బాధ పెట్టడం ఎంత వరకు కరెక్టే.. అసలు సిద్ధూ బాబు గురించి నీకేం తెలుసు.. తనతో ఇన్ని రోజులు స్నేహం చేశావ్.. నువ్వు తనని అర్థం చేసుకున్నది ఇదేనా.. నువ్వు అనుకున్నట్లు తను నిన్ను కాపాడటానికి మాత్రమే పెళ్లి చేసుకోలేదు. నిన్ను ప్రేమించాడు కాబట్టే పెళ్లి చేసుకున్నాడు.. తను నిన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించాడు.. ఇదంతా నాకు ఎలా తెలుసు అని ఆలోచిస్తున్నావా.. ఆ అబ్బాయికి నీ మీద ప్రేమ పుట్టిన మరుక్షణమే నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకున్నాడు.. ఈ కాలంలో అలాంటి అబ్బాయి ఎక్కడ అయినా దొరుకుతాడా.. సిద్ధూ తను ప్రేమించిన ప్రేరణని గుండెల్లో పెట్టుకున్నాడు.. అని అంటుంది. సిద్ధూ ప్రేమించాడా అని ప్రేరణ అడిగితే ప్రాణంగా అని ఇందిర చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.