Nindu Manasulu Serial Today Episode ఐశ్వర్య ప్రేరణ బట్టలు అన్నీ మూట కట్టి మా అక్కకి ఇవ్వడానికి వెళ్తున్న నాతో పాటు మీరు రండి అని రంజిత్ని పిలుస్తుంది. తన బట్టలు తీసుకురమ్మని నీకు మీ అక్క చెప్పిందా.. బట్టలు ఇవ్వడం కంటే మీ అక్క ఎలా ఉందో తెలుసుకోవాలనే ఇంట్రస్టే నీకు ఎక్కువ ఉంది.. నిజంగా తనకు వీటి అవసరం ఉంటే ఇన్ని రోజులు ఊరుకునేది కాదు.. తను అక్కడికి మనల్ని పిలవలేదు అంటేనే తను ఏ పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి అని అంటాడు.

ఇందిర వచ్చి కరెక్ట్‌గా చెప్పావు బాబు.. చిన్నప్పుటి నుంచి ఇద్దరూ కలిసి మెలిసి ఉండటంతో ఇప్పుడు అది లేక ఇది ఉండలేకపోతుంది.. పైకి నవ్వుతున్నా మనసులో దీనికి చాలా బాధ ఉంది. ప్రేరణకి ఇప్పుడు పెళ్లి అయింది.. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లలేం.. తను మన కూతురు అయినా సరే అంత చనువు ఉండదు దాని బతుకు అది బతుకుతుంది అని ఇందిర అంటుంది. రంజిత్, ఇందిర ఇద్దరూ ఐశ్వర్యకు కంగారు పడొద్దని.. అక్కడికి వెళ్లే ప్రయత్నం మానుకోమని చెప్తారు. అక్కని చూడాలి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి ఓనర్‌ గారు అని ఐశ్వర్య అంటుంది. ఇక తనకే ఒక ఐడియా వచ్చిందని తనతో రమ్మని రంజిత్‌కి చెప్తుంది. రంజిత్‌ని ఐశ్వర్య కేఫ్‌కి తీసుకెళ్తుంది. కుమార్‌తో మా అక్కని చూడాలి అందుకు నువ్వు సపోర్ట్ చేయాలి అంటుంది. ఏం చేయాలి అని కుమార్ అంటే కేఫ్‌లో పెద్ద గొడవ అవుతుందని నేను మా అక్కకి చెప్తా నువ్వు మీ ఫ్రెండ్‌కి చెప్పాలి అంటుంది.

కుమార్ భయపడుతూనే సరే అంటాడు. ఐశ్వర్య వెంటనే ప్రేరణకి కాల్ చేసి మన కేఫ్‌లో పెద్ద గొడవ అవుతుంది వెంటనే రా అక్క అని చెప్తుంది. ప్రేరణ చాలా కంగారు పడుతుంది. త్వరగా వచ్చేస్తా అని చెప్తుంది. ప్రేరణ సిద్ధూతో మనం వెంటనే కేఫ్‌కి వెళ్లాలి అక్కడ గొడవ అవుతుందని అంటుంది. మళ్లీ ఇదో నాటకమా అని సిద్ధూ అంటాడు. నిజం సిద్ధూ ఐశ్వర్య కాల్ చేసింది అని ప్రేరణ చెప్తే నీ మాటల మీద నమ్మకం లేదు అని సిద్ధూ అంటాడు. ఇంతలో కుమార్ కాల్ చేసి సిద్ధూకి ఐశ్వర్య చెప్పినట్లు కంగారు పడుతూ అబద్ధం చెప్తాడు. దాంతో సిద్ధూ కంగారుగా ఇప్పుడే వస్తున్నాఅని బయల్దేరుతాడు. ప్రేరణ కూడా వస్తాను అంటే సిద్ధూ వద్దు అనేస్తాడు. బండి తాళాలు మర్చిపోయా అని సిద్ధూ లోపలికి వెళ్లబోతే ప్రేరణ తాళాలు పట్టుకొని బండి మీద కూర్చొంటుంది. నువ్వేంటి నా బండి ఎక్కావని సిద్ధూ అడిగితే వెళ్దాం రా అని పిలుస్తుంది. నీతో రావడం నాకు ఇష్టం లేదు అని సిద్ధూ అంటే కేఫ్ మీద నీకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉంది..వస్తావా రారా అని అడుగుతుంది.

ఇంతలో సాహితి బయటకు వస్తుంది. నన్ను అడగకుండా నా డ్రస్ ఎందుకు వేసుకున్నావ్ అని అడుగుతుంది. నువ్వు అడిగితే ఇవ్వువు అని తీసుకున్నా అని అంటుంది. నన్ను అడగకుండా నా డ్రస్ తీసుకున్నావ్ అంటే నా రూంలో నుంచి దొంగతనం చేశావు కదా అని అంటుంది. ప్రేరణ వచ్చి ఎంత మాట అన్నావ్ సాహితి.. అయినా దీన్ని దొంగతనం అనరు సాహితి అపహరించడం అంటారు అని అంటుంది. అయినా నీకు ఇప్పుడు నీతో మాట్లాడే టైం లేదు సాహితి నేను వెళ్తా అంటుంది. సిద్ధూ నేను వస్తా అని అంటాడు. ప్రేరణ సిద్ధూ మీద చేయి వేస్తే సిద్ధూ కోపంగా చూస్తాడు. దుమ్ము దుమ్ము అని ప్రేరణ అంటుంది. కేఫ్ దగ్గర రంజిత్, ఐశ్వర్య, కుమార్ వెయిట్ చేస్తారు. కుమార్ సిద్ధూ తిడతాడు అని చాలా కంగారు పడతాడు. ఏం కాదు అని ఐశ్వర్య అంటే మీరు మీరు బాగానే ఉంటారు మధ్యలో నా పని అయిపోతుందని కుమార్ అంటాడు. రంజిత్ గారు మీరే నన్ను కాపాడాలి అంటాడు.

సిద్ధూ ప్రేరణలు బైక్ మీద వెళ్తుంటే ప్రేరణ సిద్ధూ దగ్గరకు వెళ్తూ ఉంటే సిద్ధూ దూరం దూరం జరుగుతాడు. ప్రేరణ కావాలనే బాబు టచ్చింగ్స్ రొమాన్స్ ఇవన్నీ మనతో కుదరవు అని నాకు నిద్ర వస్తుంది కాసేపు నీ మీద పడుకుంటా అని భుజం మీద వాలిపోతుంది. భుజం నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుంటుంది. చేయి తీయకపోతే బైక్ వదిలేస్తా అని సిద్ధూ అంటాడు. ఇలా పట్టుకుంటే చూసే వాళ్లు ఏం అనుకుంటారు.. అని సిద్ధూ అంటే మనం భార్యాభర్తలం కదా ఏం కాదు అని ప్రేరణ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.