Niharika Konidela Reaction About Akira Nandan Entry : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ హీరో ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి 'OG' సినిమాలోనే పవన్ చిన్నప్పటి రోల్ అకీరా చేసుంటే బాగుండేదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. తాజా ఇంటర్వ్యూలో అకీరా ఎంట్రీపై మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్ట్ అయ్యారు.

అకీరా... మై స్మాల్ బిగ్ బేబీ

అకీరా తన స్మాల్ బిగ్ బేబీ అంటూ నవ్వులు పూయించారు నిహారిక. 'అకీరా హార్ట్ ఆఫ్ గోల్డ్. బాబాయ్ పవన్ కల్యాణ్‌లాగే ఎక్కువ మాట్లాడడు. అకీరా లవ్ మాత్రం చాలా ఎక్కువ. హీరో అవుతానో లేదో అని డైరెక్ట్‌గా నాకైతే మాత్రం చెప్పలేదు. నాకు చెప్తే నేను అడుగుతా. మీడియా ఎక్స్‌పోజర్ వల్ల ఎక్కువగా ప్రచారం సాగుతోంది.' అని చెప్పారు.

ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్ల వద్ద ఒమేగా స్టార్ అంటూ అకీరా ప్లకార్డులు పెట్టడంపైనా నిహారిక రియాక్ట్ అయ్యారు. 'మా టైంలో మీడియా, సోషల్ మీడియా ఎక్స్‌పోజర్ అంతగా లేకపోవడం వల్ల మా చైల్డ్ హుడ్ చైల్డ్ హుడ్‌లాగే నడిచింది. సెలబ్రిటీల పిల్లల ఫోటోలు బయటకు రాకూడదని, వారిని అంతగా ఎక్స్‌పోజర్ చేయకూడదని అనుకున్నా కొందరు ప్రైవసీకి భంగం కలిగిస్తూనే ఉంటారు. అది అభిమానం అనిపించుకోదు. అది అబ్యూజ్ చేయడమే.' అంటూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు.

Also Read : సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?