Happy New Year 2026 Wishes in Telugu: పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే క్షణం సంతోషంగా ఉంటే ఏడాదంతా ఆనందం వెల్లివిరుస్తుందని భావిస్తారు. అందుకే న్యూ ఇయర్ కి వెల్కమ్ చెబుతూ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే హ్యాపీ న్యూ ఇయర్ విశెష్ ని ట్రెండీగా కాకుండా ట్రెడిషనల్ గా ఇలా శ్లోకాలతో చెప్పేయండి. కొత్త సంవత్సరం ప్రారంభం ఓ శ్లోకంతో మొదలుపెడితే ఏడాదంతా మరింత సంతోషంగా ఉంటారు. విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం ఇవన్నీ కలిసొచ్చేలా మీ బంధుమిత్రులపై భగవంతుడి కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకోండి.

ఇక్కడ చాలా శ్లోకాలున్నాయి..వీటిలో మీకు నచ్చిన శ్లోకంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
ఈ ఏడాది మీరు ప్రారంభించే కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తికావాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఓం గం గణపతియే నమ:
వ్యాపారం, ఉద్యోగం..మీరు ఏ రంగంలో ఉన్నా మరింత అభివృద్ధి చెందాలి
మీకు మీ కుటుంబ సభ్యలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
గాయత్రీ దేవి అనుగ్రహం మీపై ఉండాలి - మీరు మరింత వృద్ధి చెందాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఓం ప్రణోదేవీ సరస్వతీ వాజేభి ర్వాజినీవతీ ధీనామ విత్య్రవతు
సరస్వతీ దేవి కరుణాకటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
హ్యాపీ న్యూ ఇయర్ 2026

ఓంఐంవాగ్దేవాయై విద్మహే కమరాజ్యాయధీమహే తన్నో దేవి ప్రచోదయాత్
చదువులతల్లి అనుగ్రహం మీపై ఉండాలని ప్రార్థిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

శ్రీం హ్రీం సర్వస్వత్యాయ స్వాహ
ఐం హ్రీం, ఐంగ్ హ్రీం సరస్వత్యాయ నమ:
గతంలో ఉన్న అడ్డంకులను అధిగమించి నూతన సంవత్సరం వెలగాలి
హ్యాపీ న్యూ ఇయర్ 2026

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం
శ్రీ రామదూతం శరణం ప్రపద్యే
హనుమాన్ అనుగ్రహం మీపై ఉండాలని ప్రార్థిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
రామయ్య అనుగ్రహం మీపై ఉండాలని ప్రార్థిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం
జగద్గురువైన కృష్ణపరమాత్ముడు సదా మీ వెంట ఉండి నడిపించాలి
కొత్త ఏడాది మీ జీవితంలో వెలుగులు నిండాలి
హ్యాపీ న్యూ ఇయర్ 2026

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనమ్
కలిబాధల నుంచి మీకు విముక్తి లభించాలి
హ్యాపీ న్యూ ఇయర్

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
ఎలాంటి ఆపద ఎదురైనా ఇట్టే తొలగిపోవాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
నవగ్రహాల దుష్ట దృష్టి మీపై ఉండకూడదని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025

నూతన సంవత్సరం ఆనందంగా ఉండాలి
కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి
ఆరోగ్యంగా ఉండాలి
విద్యార్థులు చదువులో వృద్ధి చెందాలి
ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ రావాలి
వ్యాపారాలు వృద్ధి చెందాలి
వివాదాల నుంచి ఉపశమనం లభించాలి
శత్రువులంతా స్నేహితులుగా మారాలని భగవంతుడిని ప్రార్థిస్తూ..
ABP దేశం ఫాలోవర్స్ అందరకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు