New Movies OTT: ఈ రోజు ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు... సింగం ఎగైన్ to మెకానిక్ రాకీ - ఆ రెండూ మిస్ కావద్దు
11 months ago 7
ARTICLE AD
ఈరోజు ఓటీటీల్లో ఏయే సినిమాలు.. ఏయే ప్లాట్​ఫార్మ్​లలో వస్తున్నాయంటే..
ఓటీటీలో విశ్వక్ సేన్ కొత్త సినిమా
హీరో విశ్వక్ సేన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, సునీల్, హైపర్ ఆది ప్రధాన పాత్రలు పోషించారు. బీటెక్  డ్రాపౌట్ మెకానిక్ రాకీ(విశ్వక్ సేన్) జీవితంలోకి అతని మాజీ లవర్ ప్రియ మరో సారి ఎంట్రీ ఇస్తుంది. వారిద్దరి మధ్య లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ప్రియ రాకతో రాకీ లైఫ్ మరింత స్పీడ్ అందుకుంటుంది. అతనికి ఊహించని మలుపులూ ఎదురవుతాయి. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీకి రవితేజ ముళ్ల పూడి దర్శకుడు. సెకాండాఫ్ లో ఉన్న స్టఫ్, ఫస్టాఫ్ లో లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు.  గత నవంబర్ 22 న విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసింది.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్... బోగన్ విల్లా
‘పుష్ప 2’ తో పాన్ ఇండియా లెవెల్ లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పేరు రీసౌండ్ అవుతోంది. ఆయన నటించిన తాజాగా మలయాళ సినిమా ఓటీటీలోకి విడుదల అయింది. ‘భీష్మ పర్వమ్’ ఫేమ్ అమల్ నీరద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బోగన్ విల్లా’ ఇటీవలే థియేటర్లలో విడుదలై యావరేజ్  గా నిలిచింది. ‘బోగన్ విల్లా’ సినిమాలో ఫహాద్ ఓ మర్డర్ మిస్టరీలను ఛేదించే పోలీస్ గా నటించారు. ‘నాయట్టు’ ఫేమ్ కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రల్లో నటించిన డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ: సోనీ లివ్
హరికథ చూసేయండి
ఓటీటీ : డిస్నీ హాట్ స్టార్
మన కథ... మలయాళంలో
మన సినిమా మలయాళంలో రీమేక్ కావడంతో చాలా అరుదు. దర్శకుడు వెంకటేశ్ మహా కొత్త వాళ్లతో తీసిన ఓ చిన్న సినిమా ‘కేరాఫ్ కంచర్ల పాలెం’. నాలుగేళ్ల క్రితం విడుదలై, పెద్ద విజయం సాధించింది. తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ అయింది కూడా. సామాన్య ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు పొందిన ఈ సినిమా తాజాగా మలయాళంలో రీమేక్ అయింది. ‘కథ ఇన్నువరె’ గా తెరకెక్కిన ఈ సినిమా లో ‘అయ్యప్పన్ కోషియమ్’ ఫేమ్ బిజూ మీనన్, నిఖిలా విమల్ ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు మోహన్ దర్శకుడు. డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ: మనోరమ మ్యాక్స్
సింగమ్ ఎగైన్
అజయ్ దేవగన్ హిట్ సిరీస్ లోని తాజా సినిమా ‘సింగమ్ ఎగైన్’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. సూర్య హీరోగా తెరకెక్కిన ‘సింగం’ సిరీస్ ను అజయ్ దేవగన్ తో 2010లో తెరకెక్కించారు రోహిత్ శెట్టి. సినిమా సూపర్ హిట్ కావడంతో పూర్తిగా వేరే కథతో ‘సింగమ్  రిటర్న్స్’ అనే సీక్వెల్ తీశారు. బాక్సాఫీస్ వద్ద ఆడలేదు ఈ సినిమా. ఈ సిరీస్ లో మూడో సినిమానే ‘సింగమ్ ఎగైన్’. హీరోయిన్ గా కరీనా కపూర్ నటించారు. అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్,  జాకీ ష్రాఫ్ లు తళుక్కున మెరిసినా ఈ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం డిసెంబర్ 13 నుంచి  రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
Also Read : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
Read Entire Article