Viral Video | నెల్లూరు జిల్లా అనంతసాగరంలో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటిని, ఇళ్ల వద్ద ఉన్న వాహనాలను పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అయితే పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ బుడ్డోడు తన తండ్రి చేసిన నిర్వాకాన్ని అందరి ముందు బయటపెట్టి ఔరా అనిపించాడు. నాన్న వేసిన ప్లాన్‌ను కొడుకు అమాయకత్వంతో పట్టించిన తీరు, అతడి నిజాయితీ పోలీసులను ఆకట్టుకుంది.

సురేష్ అనే వ్యక్తి తన బైక్‌కు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడం వల్లేమో కానీ, పోలీసులకు దొరక్కుండా తన వాహనాన్ని ఇంటికి దూరంగా ఉన్న మరొక వీధిలోకి తీసుకెళ్లి పార్క్ చేసి వచ్చాడు. పోలీసులు వాహనాలను తనిఖీ చేయడాన్ని గమనిస్తున్న సురేష్ ఆరేళ్ల కుమారుడు మహేంద్ర, తన తండ్రి పోలీసులను చూసి బైక్ దాచిపెట్టిన విషయాన్ని గుర్తించాడు. దీంతో ఆ బాలుడు వెంటనే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసుల వద్దకు వెళ్లాడు. మిమ్మల్ని చూసి తన తండ్రి బైక్‌ను దాచిపెట్టాడని పోలీసులకు చెప్పడమే కాకుండా, వారిని వెంటబెట్టుకుని వెళ్లి తన తండ్రి దాచిన బైక్‌ను చూపించాడు.

ెల్లూరు జిల్లా ఆనంతసాగరంలో పోలీసులు నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రతి ఇంటిని, వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో సురేష్ అనే వ్యక్తి తన బైక్‌ను ఇంటికి దూరంగా మరో వీధిలో దాచాడు. అయితే బైక్ ఎందుకు దాచాడన్నది స్పష్టంగా తెలియలేదు. #Nellore #Ananthasagaram pic.twitter.com/uoKQ4CsSsj

— A1tv Telugu (@A1tvTelugu) August 21, 2026

అసలేం జరిగిందని బాలుడ్ని అడగగా.. మీరు వస్తున్నారని మా నాన్న బైక్‌ను వేరే చోట దాచిపెట్టాడు అని చెప్పిన మహేంద్ర, అక్కడికి రావాలని అమాయకంగా చెప్పడం అక్కడ ఉన్న పోలీసులతో పాటు గ్రామస్థులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. బాలుడు పోలీసులను తీసుకెళ్తుంటే అతడి వివరాలను గ్రామస్తులు తెలిపారు. ఏం జరుగుతుందో అని వెళ్లి బాలుడు మహేంద్ర తన తండ్రి బైక్ నిర్వాకాన్ని పట్టించడాన్ని చూసి షాకయ్యారు.