Nana Patekar Passes Away : ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత - గుండెపోటుతో 75 ఏళ్ల వయసులో మృతి!

3 weeks ago 2
ARTICLE AD
<p>Nana Patekar Cardiac Arrest: &nbsp; భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటన, సంభాషణల శైలితో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ సీనియర్ నటుడు &nbsp;నానా పటేకర్ &nbsp;ఇకలేరు. 75 ఏళ్ల వయసున్న ఆయన గోవాలోని తన నివాసంలో గురువారం వేకువజామున &nbsp;గుండెపోటుకు గురై కన్నుమూశారు. నానా పటేకర్ అకస్మాత్తుగా అచేతనంగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించే యత్నం చేశారు. &nbsp;</p> <p>మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సాల్కర్ అందించిన వివరాల ప్రకారం.. వేకువజామున 5:20 గంటల ప్రాంతంలో ఆయన &nbsp;గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రి వైద్య బృందం సుమారు 45 నిమిషాల పాటు నిరంతరాయంగా సీపీఆర్ &nbsp; అందించి ఆయనను కాపాడేందుకు ఆఖరి వరకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అనంతరం ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేస్ నమోదు చేశామని, నియమావళి ప్రకారం పోస్టుమార్టం నిర్వహించనున్నామని డాక్టర్ శేఖర్ సాల్కర్ వెల్లడించారు.</p> <p>1978లో వచ్చిన గమన్ సినిమాతో బాలీవుడ్&zwnj;లో అడుగుపెట్టిన నానా పటేకర్, నాలుగు దశాబ్దాలకు పైగా హిందీ, మరాఠీ చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు. &nbsp;పరిందా , &nbsp;క్రాంతివీర్ , &nbsp;అబ్ తక్ ఛప్పన్ , &nbsp;గాంధీజీ తో అప్నా బంధు హై , &nbsp;వెల్&zwnj;కమ్ &nbsp;వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ చిరస్మరణీయం. మూడసార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులతో పాటు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక &nbsp;పద్మశ్రీ &nbsp;పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.<br />&nbsp;&nbsp;</p>
Read Entire Article