Nagabandham Teaser Review In Telugu: మహాశివరాత్రి సందర్భంగా 'నాగబంధం' టీజర్ విడుదల చేశారు అభిషేక్ నామా (Abhishek Nama). ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రమిది. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా టీజర్ రిలీజ్ చేశారు. ఫెంటాస్టిక్ విజువల్స్, క్యూరియాసిటీ పెంచే కథ, అందుకు తగ్గ నేపథ్య సంగీతం... శివరాత్రికి పర్ఫెక్ట్ టీజర్ అని చెప్పాలి.

శివునిగా విరాట్ కర్ణ... లుక్ హైలైట్!
Virat Karrna plays lord Shiva in Nagabandham: 'నాగబంధం' టీజర్ ప్రారంభం అయినప్పటి నుంచి చివరి వరకు... విజువల్స్ సర్‌ప్రైజ్ చేస్తాయి. అంతకు మించి హైలైట్ అంటే... శివునిగా విరాట్ కర్ణ లుక్!

'నాగబంధం'లో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన లుక్ విడుదల చేశారు. అయితే... టీజర్‌లో పరమశివునిగా విరాట్ కర్ణను చూపించారు. నీలకంఠుడిగా అతను బావున్నాడు. ఈతరం యువ కథానాయకులలో కన్విక్షన్‌తో శివుని రోల్ చేయడం, కాన్ఫిడెన్స్ చూపించడం విరాట్ కర్ణకు చెల్లింది. నటుడిగా 100 పర్సెంట్ ఇచ్చారని చెప్పాలి.

అనంత పద్మనాభ స్వామిని చూశారా?
శివునిగా విరాట్ కర్ణ లుక్ తర్వాత 'నాగబంధం' టీజర్‌లో మరో హైలైట్ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఆ విజువల్స్. ఆలయం సెట్ బాగా వేశారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. టీజర్ అంతటా విజువల్ ఎఫెక్ట్స్ మీద పెట్టిన శ్రద్ధ కనిపిస్తోంది.

ఆలయాలను ధ్వంసం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన సైనిక బలగాలను చూపించడం గానీ, భక్తి శ్రద్ధలతో నిర్వహించే పూజలు చూపించడం గానీ... ప్రతి ఫ్రేమ్‌లో అభిషేక్ నామా ఫెంటాస్టిక్ అవుట్ పుట్ ఇచ్చారు. సర్‌ప్రైజ్ చేశారు.

Also Read: Varanasi Movie: 'వారణాసి'లో హిందూ దేవుళ్ళు, పురాణాల పాత్ర ఎంత... క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

డివోషనల్ సినిమాలపై దర్శక నిర్మాతలు, హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ, 'నాగబంధం' టీజర్ చూశాక... ఈ మధ్య కాలంలో ఇంత హెవీ వీఎఫ్ఎక్స్ ఉన్న పూర్తిస్థాయి డివోషనల్ సినిమా రాలేదని అనిపిస్తుంది. జగపతి బాబు, గరుడ రామ్, మురళీ శర్మ, రిషబ్ స్వాహ్నితో పాటు హీరోయిన్ నభా నటేష్... ప్రతి ఒక్కరి లుక్ కొత్తగా ఉంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. సినిమా మీద అంచనాలు పెంచడంలో టీజర్ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.

Also Read: Politicians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?