యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya Akkineni) 24వ సినిమా 'వృష కర్మ' గ్లింప్స్ ఇటీవల విడుదల అయ్యింది. అది హాలీవుడ్ స్థాయిలో ఉంది అంటూ ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత చైతన్య ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారు? అనేది క్వశ్చన్. ఎందుకంటే... 'వృష కర్మ' తర్వాత సినిమా నాగ చైతన్యకు 25వ సినిమా అవుతుంది. మొన్నటి వరకు ఓ దర్శకుడి పేరు వార్తల్లో వినిపించగా... ఇప్పుడు మరొకరి పేరు వచ్చింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో!?
సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ములతో అక్కినేని నాగ చైతన్య ఓ సినిమా చేశారు. అది 'లవ్ స్టోరీ'. అందులో సాయి పల్లవి ఉన్నప్పటికీ... నటుడిగా నాగ చైతన్య మంచి మార్కులు స్కోర్ చేశారు. ఇప్పుడు మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేసేందుకు నాగ చైతన్య రెడీ అవుతున్నారని తెలిసింది.

Also Read: Collar Ey Etthara Lyrics: కాలర్ ఏ ఎత్తారా సాంగ్ లిరిక్స్... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా - ట్రెండింగ్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పాట

'వృష కర్మ' చైతన్యకు 24వ సినిమా అయితే... శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని తాజా సినిమా 25వది అవుతుంది. మొన్నటి వరకు 'బెదురు లంక 2012' ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు నాగ చైతన్య ఓకే చెప్పారని వినిపించింది. అది చైతన్య 25వ సినిమా అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు శేఖర్ కమ్ములతో 25వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. క్లాక్స్ సినిమా ఆ వెనక్కి వెళ్లొచ్చు.

Also Read: Harsh Roshan: ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

నాగార్జున, నాగ చైతన్య... సంక్రాంతికి!
'వృష కర్మ', శేఖర్ కమ్ముల సినిమాలు కాకుండా తండ్రి అక్కినేని నాగార్జునతో కలిసి మరో సినిమా చేసేందుకు నాగ చైతన్య రెడీ అవుతున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో 'బంగార్రాజు' సీక్వెల్ చేయనున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. సోగ్గాళ్లు సంక్రాంతికి వస్తారంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ఆ సినిమాను అనౌన్స్ చేసింది కూడా!

Also Read: Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?