మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu Konidela) ఒకానొక సమయంలో బుల్లితెరపై సంచలనంగా నిలిచారు. నాగబాబు కనిపిస్తే చాలు నవ్వులే అన్నట్టుగా మారింది. నాగబాబు చేసిన సీరియల్స్ అన్నీ ఒకెత్తు అయితే... జబర్దస్త్ షో మరో ఎత్తు. దాదాపు పదేళ్లు జడ్జ్‌గా నాగబాబు దుమ్ము లేపేశారు. నాగబాబు, రోజా కలిసి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలని సక్సెస్ ఫుల్‌గా నడిపారు. పార్టీలు వేరే అయినా కొన్ని ఏళ్లు ఈ ఇద్దరూ కలిసి షోను ముందుకు నడిపించారు. ఆ తర్వాత విభేదాల కారణంగా వేరే పడ్డారు. ఆ మధ్య నాగబాబు ఈటీవీ నుంచి వెళ్తూ మల్లెమాల, జబర్దస్త్ నిర్వహణ మీద చేసిన విమర్శలు అందరికీ తెలిసినవే.

ఈటీవీ నుంచి జీ తెలుగుకు వెళ్లి...
ఈటీవీ నుంచి వేరు పడి జీ తెలుగులో కొత్త షోకి నాగబాబు జడ్జ్‌గా వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఆ షో బాగానే నడిచింది. కానీ కొన్ని వివాదాస్పదమైన స్కిట్లు, ఇమిటేషన్స్‌తో ఆ షో బ్యాన్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత నాగబాబు ఎక్కువగా బుల్లితెరపై కనిపించలేదు. తన రాజకీయ కార్యకలాపాలతో బిజీగా మారిపోయారు. ఇప్పుడు జనసేనలో ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు... మళ్లీ బుల్లితెరకు వచ్చేశారు. జబర్దస్త్ షోలోకి న్యాయ నిర్ణేతగా నాగబాబు వచ్చి నవ్వులు పంచనున్నారు.

Also Read: Ananya Nagalla: విష్ణుప్రియ రూటులో అనన్య నాగళ్ళ... సబ్‌స్క్రిప్షన్ గేట్లు ఓపెన్ చేసిందోచ్

'జబర్దస్త్' రీ ఎంట్రీ ఇస్తున్న నాగబాబు!
ఈటీవీ తెలుగు అఫీషియల్ ఇన్ స్టాలో ఓ పోస్ట్ వేశారు. ''జబర్దస్త్'కి కమ్ బ్యాక్ ఇస్తున్న ఓజీ జడ్జ్ కొణిదెల నాగబాబు... ఇంక ఎంటర్టైన్మెంట్‌లో మనల్ని ఎవడ్రా ఆపేది'' అంటూ పోస్ట్ వేశారు. మరి నాగబాబు ఎంట్రీతో మళ్లీ ఈ షోకు పునర్వైభవం వస్తుందా? లేదా? అన్నది చూడాలి. అసలే గత కొన్ని నెలలుగా ఈ షోల టీఆర్పీ రేట్లు పడిపోయాయి. ఒకప్పటిలా టీం లీడర్లు లేరు... ఒకప్పటి స్కిట్లు కనిపించడం లేదు.. దాదాపు చాలా మంది యూట్యూబ్‌లో పాత స్కిట్లనే చూస్తున్నారు కానీ కొత్తగా వస్తున్న ఎపిసోడ్స్, స్కిట్లను మాత్రం చూడటం లేదు. ఇక నాగబాబు ఎంట్రీతో మళ్లీ షో ఊపందుకునేలా ఉందని అంతా అనుకుంటున్నారు.

Also Read: Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కు ఫస్ట్ ఫ్లాప్... 'లైక్'తో దొరికేశాడు - తప్పంతా నయన్ భర్తదేనా?

View this post on Instagram

A post shared by ETV Telugu (@etvtelugu2708)

నాగబాబు ఈటీవీలోకి వచ్చాడు. రోజా ఏమో జీ తెలుగులో షోని చేస్తుంది. ఒకప్పుడు రోజా ఈటీవీలో ఉంటే.. నాగబాబు ఏమో జీ తెలుగులో షో చేశాడు. ఇక ఇప్పుడు మళ్లీ పరిస్థితి రివర్స్ అయింది. నాగబాబు జబర్దస్త్ షోకి వచ్చాడు. రోజా వేరే చానెల్‌లో కొత్త షోని హోస్ట్ చేస్తున్నారు. మున్ముందు ఈ ఇద్దరూ కలిసి మళ్లీ ఒకే షోకి జడ్జ్‌గా చేస్తారా? అన్నది చూడాలి.

Also Read: వేరే దేశంలో అయితేనా? శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు, రామాయణం కాంట్రవర్సీపై నాగబాబు రియాక్షన్