Musi Floods: మూసీ వరదలో నలుగురి ప్రాణాలు కాపాడిన హైడ్రా సిబ్బంది.. కొనసాగుతున్న సహాయకచర్యలు

2 months ago 3
ARTICLE AD

మూసీ నది వరద ముంచెత్తిన ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చాదర్ ఘాట్, మూసారంబాగ్, ఎంజీ బీ ఎస్, నార్సింగి ప్రాంతాల్లో వరద ఉధృతిని తనిఖీ చేసారు. చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాలలో సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. అక్కడ వరదలో చిక్కుకుని భవనాలపై ఉన్నవాళ్ళకి డ్రోన్స్ ద్వారా ఆహారం అందించడలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. గోడలు పూర్తిగా నీటమునిగి, కూలే ప్రమాదం ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరించారు. అధికారులు ఎంత హెచ్చరించినా కొంతమంది అక్కడి నుంచి ఖాళీ చేసే పరిస్థితి కనిపించలేదు.

అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్

ఎంజీబీ ఎస్ వద్ద మూసి నది రిటైనింగ్ వాల్ పడిపోవడంతో వరద లోపలకి ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించారు. దసరా సెలవులలో ప్రయాణికులకు ఎలాంటి యిబ్బంది లేకుండా హైడ్రా DRF సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. గత అర్ధరాత్రి mgbs ప్రాంగణంలోకి వరద వచ్చినప్పుడు చేపట్టిన సహాయక చర్యలను కమిషనర్ అభినందించారు. వందలాది మంది ప్రయాణికులను సురక్షితంగా హైడ్రా DRF, పోలీస్, RTC, GHMC సిబ్బంది బయటకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. మూసీ వరదల దృష్ట్యా పరీవాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు. NDRF, SDRF, GHMC, పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. నార్సింగి ప్రాంతంలో ఓఆర్ ఆర్ మీదగా గండిపేట నుండి వస్తున్న వరద ఉధృతిని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించారు. అక్కడ సర్వీస్ రోడ్ల మీదుగా వరద తీవ్రతను పరిశీలించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న సర్వీస్ రోడ్లమీదుగా ఎవరూ ప్రయాణాలు చేయకుండా చూడాలని ఆదేశించారు.

నలుగురిని కాపాడిన హైడ్రా DRF బృందాలు

నార్సింగి - మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో వరదలో చిక్కుకున్న నలుగురిని హైడ్రా DRF బృందాలు కాపాడాయి. ఉస్మాన్ సాగర్ (గండిపేట) గేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన వరదతో సర్వీసు రోడ్డు మీద నుండి వరద ఉప్పొంగుతోంది. ఆ మార్గంలో వెళ్లరాదని బారికేడ్లు పెట్టినా పట్టించుకోకుండా ఆటో ట్రాలీ లో రోడ్ దాటేందుకు ప్రయత్నించాడు డ్రైవర్. అప్పుడు ఆటో ట్రాలీలో డ్రైవర్ తో పాటు నలుగురు ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వరద ఎక్కువ ఉండడంతో ఆటో ట్రాలీ ఆగిపోయింది. అక్కడ ఉన్న పోలీసులు, హైడ్రా DRF సిబ్బంది గమనించి వాళ్ళని సురక్షితంగా కాపాడారు. వాళ్లను ఒడ్డుకు చేర్చారు. ఆటో ట్రాలీకి తాడు కట్టి DRF వెహికల్తో బయటకు లాగారు.

ఎంజీబీఎస్ లో ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన సిబ్బందిని అభినందించారు హైడ్రా రంగనాధ్.మూసీ నది ప్రవాహం పెరిగి గత అర్ధరాత్రి ఎంజీబీఎస్ busస్టేషన్లోకి వరద నీరు భారీగా చేరింది. వెంటనే స్పందించిన హైడ్రా DRF సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా తాళ్ళ సాయంతో బయటకు తీసుకెళ్లారు.

Read Entire Article