Suresh Raina Retirement Secret Revealed: భారత క్రికెట్‌లో ఎంఎస్, ధోనీ, సురేశ్ రైనా బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా టీమ్‌తో పాటు Chennai Super Kingsలో దాదాపు దశాబ్దానికి పైగా కలిసి ప్రయాణించిన ఈ ఇద్దరు 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకే రోజు గుడ్‌బై చెప్పి, అభిమానుల‌కు షాకిచ్చారు. ధోనీ సాయంత్రం 7:29 గంటలకు సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. కొద్దిసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే తాను కూడా అదే రోజు రిటైర్ అవుతానని ధోనీకి చెప్పినప్పుడు అతడు ఆశ్చర్యపోయాడని రైనా ఇప్పుడు వెల్లడించాడు.

Read Also: Jasprit Bumrah Fitness: బుమ్రాకు బ్యాక‌ప్ పేసర్ ను రెడీ చేస్తున్న బీసీసీఐ.. ఆ యువ బౌల‌ర్ పై ఫోకస్ పెట్టిన టీమ్ మేనేజ్మెంట్

కుటుంబం కోసం నిర్ణ‌యం..

మాజీ ఇండియా బ్యాటర్ ఆకాశ్ చోప్రాతో మాట్లాడిన రైనా తన నిర్ణయం వెనుక కుటుంబం కూడా ఒక ముఖ్యమైన కారణమని వెల్ల‌డించాడు. క్రికెట్ కోసం ఆటగాడిగా ఎంతో త్యాగం చేయాల్సి వస్తుందని, దేశం కోసం ఆడటంతో పాటు తల్లిదండ్రులు కూడా ఎన్నో త్యాగాలు చేస్తారని గుర్తుచేశాడు. అయితే ఆ సమయంలో తన వయసు 32 లేదా 33 ఏళ్లుగా ఉన్నా, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉందని భావించినట్లు రైనా తెలిపాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లి తన నిర్ణయం కూడా పూర్తయిందని చెప్పగా, అస్స‌లు నువ్వేం చేశావంటూ ధోనీ ఆశ్చర్యపోయాడని గుర్తుచేశాడు. ఆ సమయంలో ఇద్దరూ CSK బయోబబుల్‌లో ఉన్నారు. కరోనా కారణంగా 2020 IPL సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు UAEలో నిర్వహించడంతో, అక్కడి నుంచి టోర్నమెంట్ కోసం UAEకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also: Dhoni Role Revealed: ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనని తేల్చేసిన స్టార్ ప్లేయ‌ర్.. దూబేకు బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం త‌ప్పిద‌మే.. సీఎస్కే మాజీ ప్లేయ‌ర్..

తన కోసం ధోనీ త్యాగం..

ధోనీతో తన బంధం గురించి కూడా రైనా ఆసక్తికర విషయాలు చెప్పాడు. తనకు బ్యాటింగ్ ఆర్డర్‌లో పై స్థానంలో అవకాశం రావడానికి ధోనీ తన స్థానాన్ని త్యాగం చేశాడని తెలిపాడు.సౌర‌వ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ధోనీ పై స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అయితే రైనా, యువ‌రాజ్ సింగ్ ల‌కు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు ధోనీ తన స్థానాన్ని మార్చుకున్నాడని రైనా చెప్పాడు. తనపై ధోనీ చూపించిన నమ్మకం తనను మరింత కష్టపడేలా చేసిందని రైనా తెలిపాడు. ఫీల్డింగ్ అయినా బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా పూర్తి డెడికేష‌న్ తో టీమ్ కోసం ఆడాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తన కోసం ఎవరైనా ఇంత త్యాగం చేస్తే తిరిగి ఏదైనా ఇవ్వాలనే భావన ఉండాలని చెప్పాడు. డబ్బు అందరికీ ఉండొచ్చని, కానీ ఇత‌రుల కోసం త్యాగాలు చేసేంత పెద్ద మనసు అంద‌రికీ ఉండ‌బోద‌ని పేర్కొన్నాడు. ధోనీతో తన స్నేహం అలా ఏర్పడిందని, ఆ బంధం ఎప్పటికీ కొనసాగుతుందని రైనా చెప్పాడు.