Mother in law should die soon Bizarre wish found on Rs 20 note at Kalaburagi temple: దేవుడి దగ్గరకు వెళ్లి చాలా మంది చాలా కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలేమిటో అంతా మనుసులోనే ఉంటాయి. కానీ తమ మనసులోనే అనుకుంటే ఆ దేవుడికి ఎలా తెలుస్తాయని ఆయనకు అంత తీరిక ఉండదని కొంత మంది పేపర్లు రాసి హుండీల్లో వేస్తూంటారు. మరీ వైల్డ్ కోరికలు అయితే ఇలా కూడా ఎక్స్ ప్రెస్ చేయరు.కానీ కర్ణాటకలోని కలబురిగి ప్రాంతంలో ఓ భక్తుడో.. భక్తురాలో కానీ నోటు మీద తమ కోరిక రాసి హండీలో వేశారు. అత్తగారు త్వరగా చచ్చిపోవాలని దేవుడ్ని కోరుకున్నారు. అదే విషయాన్ని నోటు మీద రాశారు. ఆలయ అధికారులు ఆ నోటును ఫోటో తీయడంతో వైరల్ గా మారింది.

కలబురిగి సమీపంలోని ఆఫ్జర్ పూర్ తాలూకాలో గట్టారంగి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మంచి ఫేమస్ అయిన భాగ్యవంతి దేవి ఆలయం ఉంది. ఆ గ్రామం నుంచే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూంటారు. ఇటీవల ఆ హుండీ తెరిచిన అధికారులు డబ్బులు లెక్క వేస్తున్న సమయంలో ఇరవై రూపాయల నోటు విచిత్రంగా కనిపించింది. ఆ నోటు ఏమిటా అని తీసి చూశారు. దాని వెనుక .. దేవుడా.. నా అత్త త్వరగా చనిపోవాలని రాసి ఉంది.

Also Read: బాలుడ్ని రేప్ చేసిందని కేరళలో 19 ఏళ్ల యువతి అరెస్టు - అతడికి 16 ఏళ్లు - న్యాయమేనా ?

దేవుడ్ని అందరూ మంచి చేయమని కోరుకుంటారు. చాలా కొద్ది మంది ఇతరుల్ని నాశనం చేయాలని కోరుకుంటారేమో. అయితే ఇలా తమ అత్తను త్వరగా తీసుకెళ్లిపోవాలని కోరేవారు మాత్రం అరుదుగా ఉంటారు. మనసులో అనుకుంటారేమో కానీ దేవుడ్ని ప్రార్థించే ధైర్యం చేయరు. అలా ప్రార్థన చేయడమే కాదు ఇరవై రూపాయ నోటు మీద రాసి దేవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియచేయాలన్నట్లుగా రాసి హుండీలో పడేశారు. ఈ నోటు వేసింది మగ వ్యక్తా.. ఆడ వ్యక్తా అన్నది కూడా క్లారిటీ లేదు. సహజంగా అటు మగ వ్యక్తులు..ఇటు ఆడవాళ్లు కూడా అత్తల్ని ద్వేషిస్తూనే ఉంటారని అంటున్నారు. అయితే ఓ మహిళే ఇలా టార్చర్ భరించ లేక దేవుడ్ని వేడుకుని హుండీల్లో పేరు రాసి వేసి ఉంటుందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.

Also Read : Adult content creator : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం బెటర్ - Phd వదిలేసి ఈ అందగత్తె చేస్తున్నది అదే !

ఆలయ అధికారులు ఈ ఇరవై రూపాయల నోటు ఫోటో తీశారు. కాసేపటికే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కువగా మంది పాపం ఆ అల్లుడు లేకపోతే కోడలు ఆ అత్త నుంచి ఎంత టార్చర్ అనుభవిస్తున్నారోనని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది దేవుడ్ని ప్రాణాలు తీయమని కోరుకోవడం విచిత్రంగా ఉందని అంటున్నారు. మంచి కోరికలు తీరుస్తాడు కాబట్టే దేవుడని అంటారని.. ఇలాంటి కోరికలు కూడా ఎలా తీరుస్తాడని అంటున్నారు. మొత్తంగా ఈ నోటు ఎవరు రాశారో కానీ.. వారి కోరిక తీరాలా వద్దా అన్నదానిపై అనేక చర్చలు మాత్రం ప్రారంభమయ్యాయి.