Morning Top News:

మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్

జర్నలిస్టులపై దాడి కేసులో మంచు మోహన్ బాబుకు చిక్కులు తప్పేలా లేవు. సాధారణ కేసుగా నమోదు చేసిన పోలీసులు హత్యకేసుగా మార్చి ఎఫ్‌ఐర్‌ రిజిస్టర్ చేశారు. లోగోతో మోహన్ బాబు దాడి చేయడం వల్ల రిపోర్టర్ మొహంపై గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఛానల్ ప్రతినిధులు మోహన్ బాబుపై ముందు పెట్టిన కేసుని ఇప్పుడు హత్యాయత్నం కేసుగా మార్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఇండియా కూటమిలోకి వైఎస్ఆర్‌సీపీ ?

ఇండియా కూటమిలో చేరేందుకు వైసీపీ సిద్దమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ఇండియా కూటమికి నేతృత్వం వహించడాన్ని విజయసాయిరెడ్డి స్వాగతిస్తున్నారు. మామూలుగా అయితే ఆ కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తే మాకేంటి అంటారు కానీ ఆయన తీరు మాత్రం వేరుగా ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మోహన్ బాబు చుట్టూ బోలెడు వివాదాలు

మంచు మోహన్‌బాబు.. 500 సినిమాలకు పైగా నటించి.. 50 సినిమాల వరకూ నిర్మించి.. ఇంట్లో ముగ్గురు బిడ్డలను నటులుగా ఇండస్ట్రీకి అందించి.. టాలీవుడ్‌ మెయిన్ పిల్లర్లలో ఒకడిగా నిలిచిన వాడు. నటన విషయంలో మోహన్ బాబు టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అనొచ్చు. హీరోయిజమైనా, విలనిజమైనా, పౌరుషమైనా... పౌరాణికమైనా.. చివరకు కామెడీ అయినా సరే.. మోహన్‌బాబుకు తిరుగులేదు. కానీ ఆయన ప్రొఫెషనల్.. పర్సనల్‌ లైఫ్ లో బోలెడు వివాదాలున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌

ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కీలకమైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పెద్ద దెబ్బ తగలనుంది. విశాఖలో కీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. అధికారికంగా నేడు ప్రకటించనున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో మాట్లాడారాని ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని టాక్ నడుస్తోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట

సినీనటుడు మోహన్‌బాబు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన పిటిషన్‌ వేశారు. మోహన్‌బాబు పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. రాచకొండ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈనెల 24 వరకు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఇందిరమ్మ ఇండ్లపై కీలక ఆదేశాలు

నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో దరఖాస్తుదారుల వివరాలను పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్వే నిర్వహణపై దరఖాస్తుదారులకు అనుమానాల నివృత్తి కొరకు టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

స్కూల్ లో అయ్యప్ప మాల వివాదం

కొంపెల్లిలోని ఓ స్కూల్‌లో అయ్యప్ప మాల వేసుకున్నాడని ఓ విద్యార్థిని క్లాస్ రూంకి అనుమతించకుండా ఇంటికి పంపింది ఓ స్కూల్ యాజమాన్యం. అ ఘటనపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. స్కూలు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఉత్తరాంధ్ర వైసీపీ కొలుకొనే అవకాశమే లేదా?

ఉత్తరాంధ్రలో చాలామంది సీనియర్ నేతలు,రాజకీయ ప్రముఖులు కూడా ఇపుడు పార్టీ పట్ల అంత ఆసక్తిని చూపించకపోవడం విచిత్రమైన పరి ణామంగానే చూడాలని అంటున్నారు. వీరి విషయం లో ఏమి చేయాలన్నది కూడా అధినాయకత్వానికి తెలియని అంశంగా మారుతోంది. పార్టీలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టలేక అలాగని కొనసాగిం చలేక హైకమాండ్ సతమతమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఈ ఘటన బాధాకరమని, హృదయవిదారకంగా ఉందని కంగనా పేర్కొంది. అలాగే, ఈ ఆత్మహత్యకు కొన్ని సామాజిక, వ్యక్తిగత కారణాలే కారణమన్నారు. సమాజంలో ప్రస్తుతం ఫేక్ ఫెమినిజం అనేక సమస్యలను సృష్టిస్తుంది. ప్రతిరోజూ వేధింపులకు గురవుతున్న స్త్రీల సంఖ్యను కూడా మనం విస్మరించలేమన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో విషాదం

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో విషాదం చోటుచేసుకుంది. కాబూల్‌లో సంభవించిన భారీ పేలుడులో ఆఫ్ఘన్ తాలిబాన్ శరణార్థుల మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ దుర్మరణం చెందారు. మంత్రి సహా మొత్తం 12 మంది వరకు చనిపోయారు. మంత్రి ఖలీల్ హక్కానీ మరణించిన విషయాన్ని ఆయన మేనల్లుడు అనాస్ హక్కానీ బుధవారం వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..