<p><strong>Mohan Babu is likely to be arrested by the police at any moment:</strong> కుటుబంంలో జరుగుతున్న వివాదంతో మోహన్ బాబు ఆవేశపడి మీడియాపై దాడి చేయడం, తన కుమార్తె కోసం ఇంటికి వచ్చిన మంచు మనోజ్ దంపతులపైనా దాడి చేయడంతో ఆయనను పోలీసులు ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు మోహన్ బాబు మీడియా ప్రతినిధి వద్ద లాక్కుని చేసిన దాడిలో ఇద్దరకి గాయాలయ్యాయి. వారిద్దరికి తల, చెవి దగ్గర తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ మోహన్ బాబు తమను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. </p>