Modi Melody Toffee Gift to Giorgia Meloni:  ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ Narendra Modi- ఇటలీ ప్రైమ్‌ మినిస్టర్‌ జార్జియా మెలోనీ Giorgia Meloni.. ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ ఒక ఫ్రేమ్‌లోకి వస్తే చాలు.. సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన కాంబో లీడర్స్‌గా వీళ్లు వరల్డ్‌వైడ్ పాపులర్ అయిపోయారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, స్నేహం, మర్యాదపూర్వకమైన ర్యాపోను నెటిజన్లు ఎప్పుడూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఈ ‘మెలొడీ’ మ్యాజిక్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఐదు దేశాల సుదీర్ఘ పర్యటనలో భాగంగా చివరి రోజు ఇటలీలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి.. అక్కడ ఊహించని రీతిలో అదిరిపోయే వెల్‌కమ్ లభించింది.

గ్రాండ్ వెల్‌కమ్.. క్రేజీ డిన్నర్!

ఇటలీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రధానమంత్రి జార్జియా మెలోనీ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. పర్యటన ముగింపు సందర్భంగా మెలోనీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిన్నర్‌లో మోదీ పాల్గొన్నారు. తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి మోదీ డిన్నర్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే, ఈసారి కేవలం ఫోటోలు మాత్రమే కాదు.. మోదీ ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

"మెలోనీ అండ్ మోదీల కాంబినేషన్‌ను ఆన్‌లైన్ ప్రపంచం ఎప్పుడో ‘Melody’ (Meloni + Modi) అనే క్రేజీ ట్యాగ్‌తో ఫిక్స్ చేసింది. దానిని వాళ్లిద్దరూ కూడా Ackknowledge చేశారు. అప్పుడప్పుడూ ఆ ట్యాగ్‌తోనే పోస్టులు పెడుతుంటారు.

మెలోనీకి మోదీ అదిరిపోయే గిఫ్ట్

భారత ప్రధాని సోషల్‌మీడియాను వాడుకోవడంలో.. దాంతో ఆడుకోవడంలో ఓ మెట్టు పైనుంటారు. అందుకే ఇంటర్‌నెట్ ప్రపంచం తమకు తగిలించిన MELODY ట్యాగ్‌ను మోదీ చాలా స్మార్ట్‌గా వాడారు. ఈసారి ఇటలీ వెళ్తూ వెళ్తూ ఆయన మెలోనీ కోసం మన భారతీయులకు ఎంతో ఇష్టమైన ‘ఇండియన్ మెలొడీ (Melody) చాక్లెట్లను’ గిఫ్ట్‌గా పట్టుకెళ్లారు. "మెలొడీ ఎందుకు అంత చాక్లెటీగా ఉంటుంది?" అనే ఫేమస్ డైలాగ్‌ను గుర్తు చేస్తూ మోదీ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్‌కు Meloni ఫిదా అయిపోయారు.

షేక్ అవుతున్న సోషల్ మీడియా

మోదీ ఇచ్చిన ఈ స్వీట్ సర్ప్రైజ్‌కు మెలోనీ ఎంతగానో సంతోషపడ్డారు. ఆ చాక్లెట్లను చూపిస్తూ డిన్నర్ టేబుల్ దగ్గర దిగిన ఫోటోలను ఆమె తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేశారు. ఇంకేముంది.. ఈ ఫోటోలు బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే లక్షల్లో లైకులు, కామెంట్లతో ఇంటర్నెట్ మోతెక్కిపోతోంది. మెలోనీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోను బుధవారం మధ్యాహ్నానికే ౩.5 మిలియన్ మంది, మోదీ Xలో పెట్టిన ఫోటోలను 7.7మిలియన్ల మంది చూశారు.

[yt]https://www.youtube.com/watch?v=3IlNvbMirXE[/yt]

రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాల సంగతి పక్కన పెడితే.. ఇద్దరు ప్రపంచ దేశాల అధినేతల మధ్య ఉన్న ఈ స్నేహపూర్వక బంధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.