Mobile Numerology: మొబైల్ నంబర్ మీ జీవితాన్ని మారుస్తుందా? శుభ, అశుభ సంఖ్యలు ఏవి? తెలుసుకోండి!

1 month ago 7
ARTICLE AD

Mobile Numerology:  మొబైల్ ప్రస్తుతం అందరి శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. నిద్రలేచినప్పటి నుంచీ నిద్రపోయేవరకూ చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అయితే  న్యూమరాలజీ ప్రకారం  మీ మొబైల్ నంబర్ మీ విధికి ముడిపడి ఉందని మీకు తెలుసా? మొబైల్ నంబర్లో చివరి రెండు సంఖ్యల కలయిక ఓ వ్యక్తి జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఏ సంఖ్యల కలయికలు శుభప్రదమో -  ఏ సంఖ్యలు తీసుకోకుండా ఉండాలో తెలుసుకుందాం

మొబైల్ నంబర్ లో చివరి రెండు నంబర్లు ఇలా ఉంటే శుభప్రదంగా పరిగణిస్తారు

12, 21 - విజయం మరియు కొత్త ప్రారంభాల సూచన
19, 91 - పనిలో విజయం
23, 32 - రాజ్యయోగం మరియు పురోగతి
29, 92 - డబ్బు మరియు వృత్తిలో బలం
35, 53 - ఆర్థిక మరియు ఆర్థిక స్థిరత్వం
38, 83 - ఉద్యోగంలో విజయం
57, 75 - వ్యాపారంలో పురోగతి
67, 76- విలాసవంతమైన జీవితం
69, 96- నిర్వహణ మరియు ప్రణాళికలో విజయం

ఈ కలయికలు ఉన్న మొబైల్ నంబర్లు సానుకూల శక్తిని ఇస్తాయని భావిస్తారు.

దురదృష్టకరమని భావించే సంఖ్యల కలయికలు

14, 41 - శరీర నొప్పి , చట్టపరమైన వివాదాలు
16, 61, 18, 81 - వైవాహిక ఉద్రిక్తత   ఆరోగ్య సమస్యలు
26, 62, 27, 72 - ఆరోగ్య సంబంధిత సమస్యలు
34, 43 - ఆరోగ్య సవాళ్లు
46, 64 - సంబంధాల ఉద్రిక్తతలు
48, 84 - వ్యసన ధోరణులు
49, 94 - చట్టపరమైన వివాదాలు
68, 86 - తీవ్రమైన ఆరోగ్య సమస్యలు
89, 98 - వాదించడం, వివాదం చేయడానికి ధోరణి

మొబైల్ నంబర్లు నిజంగా ప్రభావం చూపుతాయా?

మొబైల్ నంబర్లు ఓ వ్యక్తి జీవితంపై నిజంగా ప్రభావం చూపిస్తాయా అనేది చాలామంది అడిగే ప్రశ్న. అయితే దీనికి సమాధానం రెండువైపులా ఉంది. ఒకటి సంఖ్యాశాస్త్రం దృష్టిలో..మరొకటి వైజ్ఞానిక దృష్టితో. న్యూమరాలజీ ప్రకారం అయితే మొబైల్ నంబర్ మీ జీవితంపై బలమైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ప్రతి సంఖ్యకు ఓ వైబ్రేషన్ ఉంటుంది..ఆ ప్రభావం మీపై ఉంటుందని చెబుతారు. మీ మొత్తం మొబైల్ నంబర్... మీరు పుట్టిన తేదీతో సరిపోలితే అదృష్టం, డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం కలిసొస్తుందని నమ్మకం..ఉదాహరణకు 6,8,9 నంబర్లు ధనలాభాన్నిస్తాయని చెబుతారు. 4,7 నంబర్లు సమస్యలు తెచ్చిపెడతాయని కూడా చెబుతారు

అయితే సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్పే ఈ విషయాన్ని సైంటిస్టులు, రీసెర్చ్ జర్నల్స్ ధృవీకరించడం లేదు. మీ ఆలోచనలు, నమ్మకాలు  మారుతాయి కానీ అది నంబర్ శక్తి ప్రభావం కాదంటారు. ఇక న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీలో సరిపోలే నంబర్ తీసుకోవడం మీ మనసుకి సంతోషం ఇశ్తుంది..ఇది కూడా ఓ రకంగా పాజిటివ్ ఎఫెక్టే. ఇక సైంటిఫిక్ గా చూస్తే నంబర్ ఏదైనా మీ కష్టంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

సంఖ్యాశాస్త్రం అనేది విశ్వాసం ఆధారిత శాస్త్రం. దీని ప్రభావం ఒక వ్యక్తి జన్మ సంఖ్య, మూల సంఖ్యతో కూడా ముడిపడి ఉంటుంది. ఏదైనా విషయాన్ని పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకునే ముందు నిపుణుడిని సంప్రదించడం మంచిది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Read Entire Article