మలయాళ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఉంది. 'జల్లికట్టు' సహా 'ఆర్‌డీఎక్స్', 'కాట్టలాన్', ఇక రీసెంట్ 'ఐయామ్ గేమ్'లో నటించిన ఆంటోనీ వర్గీస్ కొంత మంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఆయన ఓ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా 'అనపరంబిలే వరల్డ్ కప్'. బాలల చిత్రమిది. ఇప్పుడీ సినిమాను తెలుగులో డబ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

'మెస్సి'గా తెలుగులోకి మలయాళ సినిమా
ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన 'మెస్సీ - లవ్ ఫ్రమ్ ఇండియా'లో జమునా అబ్దుల్ రెహమాన్, విజయన్, సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చనా వాసుదేవ్ ప్రధాన తారాగణం. నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ధామా టేల్స్ పతాకంపై ఆకర్ష ఆలపాటి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

Also Read: Prabhas Fauzi Release Update - జనవరి బరిలో ప్రభాస్ 'ఫౌజీ'? సంక్రాంతి సినిమాలకు టెన్షన్?

ఇటీవల స్కూల్ పిల్లల చేతుల మీదుగా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఏపీ, తెలంగాణలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Also Read: Suriya Jyothika Wedding Viral Video - సూర్య, జ్యోతికకు మళ్ళీ పెళ్ళి... పిల్లల సాక్షిగా మళ్ళీ ప్రమాణం... వెడ్డింగ్ వీడియో వైరల్

నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ... "మెస్సి' తర్వాత ఇటువంటి మరిన్ని సినిమాలు చేయాలని ప్లాన్ చేశాం. పీవీఆర్ ఉదయ్, వెంకట్ గారు మాకు మంచి సపోర్ట్ అందించారు'' అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఫైజ్ సిద్ధిక్, సంగీతం: జేక్స్ బిజాయ్, కూర్పు: నౌఫల్ అబ్దుల్లా, విఎఫ్ఎక్స్: అశోక్ మల్లికార్జున.

Also Read: MS Subbulakshmi Biopic Launch - కమల్ హాసన్ ముఖ్య అతిథిగా 'ఎస్ఎస్ సుబ్బలక్ష్మి' బయోపిక్ ఓపెనింగ్... రష్మికతో అఫీషియల్‌గా గౌతమ్ తిన్ననూరి సినిమా