Meghasandesam Serial Today Episode: శరత్‌ చంద్ర ఇంటికి వెళ్లిన పంతులు అపూర్వకు నిజం చెప్తాడు. కేపీ, చెర్రిలు నాటకం ఆడి తనను ఊరంతా తిప్పారని అంటాడు. కేపీ చెర్రిలు ఏమీ తెలియనట్టు యాక్టింగ్‌ చేస్తుంటారు. ఇంకా ఇవాళ్టీ మేఘసందేశం సీరియల్‌ ఏపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

అపూర్వకు నిజం చెప్పిన పంతులు

శరత్‌ చంద్ర ఇంటికి వెళ్లిన పంతులు అపూర్వకు నిజం చెప్తాడు. ఎవడో తన శిష్యుడిని అని చెప్పి వచ్చాడని తనకు అసలు శిష్యులే లేరని చెప్తాడు. పంతులు మాటలకు అపూర్వ, నక్షత్రలు షాక్‌ అవుతారు. నక్షత్ర కోపంగా ఆ వచ్చిన వాడు పంతులు కాదు కాబట్టే దోష నివారణ అంటూ మొట్టికాయలు కొట్టించాడు అంటుంది. పంతుళ్లు వాడే పద్దతులు కాకుండా అపరిచితులు వాడే శిక్షలు వాడాడు అంటూ చెప్పగానే.. అయ్యో అదేం దోష నివారణ అమ్మా అంటూ పంతులు అవాక్కవుతాడు. అంతే కాదు పంతులు గారు అరచేతిలో అరకిలో కర్పూరం కూడా వెలిగించారు అంటూ నక్షత్ర చెప్తుంది. నాలుక మీద శూలం కూడా దించాడు పంతులు గారు అంటూ అపూర్వ చెప్తుంది.

దోష నివారణ కాదు కక్ష్య సాధింపు అన్న పంతులు

పంతులు ఆశ్చర్యంగా ఇవన్నీ దోష నివారణ కోసం చేసిన పనులు కాదమ్మా ఇదేదో కక్ష తీర్చుకోవడానికి చేసినట్టుగా ఉంది అని పంతులు చెప్తాడు. అపూర్వ కోపంగా అసలు మీరెందుకు రాలేదు వాడెందుకు వచ్చాడు అని అడుగుతుంది. అందుకు పంతులు తాను ఉదయాన్నే బయలుదేరి ఇంట్లోంచి బయటకు రాగానే మా మామయ్య పంపించాడు అని ఒక అబ్బాయి వచ్చి నన్ను తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు అమ్మ. డ్రైవర్‌ నన్ను తీసుకెళ్తాడు అని చెప్పి అతను వెళ్లిపోయాడు. ఆ డ్రైవర్‌ గారేమో నన్ను ఊరంతా తిప్పాడు అని పంతులు చెప్పగానే.. అపూర్వ మేము అసలు మా ఇంటి డ్రైవర్‌ ను పంపించలేదే..? అంటూ అనుమానిస్తుంది.

చెర్రికి ఫోన్‌ చేసి పంతులు గురించి చెప్పిన కేపీ

ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

మరోవైపు కేపీ, చెర్రికి ఫోన్‌ చేసి ఆ పంతులును ఇంతసేపు మేనేజ్‌ చేశానని కొబ్బరిబొండం తాగి వస్తానని చెప్పి అటు నుంచి అటే పారిపోయాడు అని చెప్పగానే.. చెర్రి షాక్ అవుతాడు. అయినా ఏం పర్వాలేదులే నాన్న ఇక్కడ మనం అనుకున్నట్టే అన్నయ్య చేశాడు. అసలు ఆ సూర్య గాడిని అయితే ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అని చెప్పగానే.. కేపీ ఓకేరా నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను నువ్వు కూడా త్వరగా వచ్చేయ్‌ అని చెప్తాడు. చెర్రి ఒకే నాన్న నేను పక్కనే ఉన్నాను వస్తున్నాను అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు.

ఇంట్లో కేపీ, చెర్రిల బండారం బయటపెట్టిన పంతులు

కేపీ ఇంట్లోకి వెళ్లగానే.. పంతులు కేపీని గుర్తు పట్టి అమ్మా ఇవాళ నన్ను ఊరంతా తిప్పిన డ్రైవర్‌ ఇతనే అంటూ చెప్పగానే.. కేపీ ఏమీ తెలియనట్టు ఎవరు పంతులు మీరు అంటూ అడగ్గానే.. నక్షత్ర కోపంగా పంతులు గారు ఈయన మా మామయ్య అంటూ చెప్తుంది. అప్పుడే చెర్రీ వస్తాడు. చెర్రిని చూసిన పంతులు కంగారుపడుతూ అమ్మా ఇతనే నన్ను తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టింది అంటూ చెప్పగానే.. నక్షత్ర కన్పీజ్‌గా ఇతను తీసుకెళ్లడం ఏంటి..? అని అడుగుతుంది. చెర్రి కూడా ఏమీ తెలియనట్టు అత్తయ్య భూమి, సూర్యల పెళ్లి ముహూర్తం పెట్టేశారు కదా మళ్లీ ఈయన ఎవరు..? అని అడగ్గానే.. పంతులు షాక్‌ అవుతాడు. ఏంటి నేను మీకు తెలియదా..? అంటే అవునండి అసలు మీరెవరు..? నాన్న ఎవరు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అంటూ చెర్రి అడగ్గానే.. ఏమోరా నన్ను అలాగే అంటున్నాడు.. నేను ఈయనను కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పానట అంటూ కేపీ చెప్తే పంతులు షాక్‌ అవుతాడు. అపూర్వ, నక్షత్ర కన్పీజ్‌ అవుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?