Meghasandesam Serial Today Episode: భూమి రూంలో ఆకాష్‌ ఉన్నాడని తెలుసుకున్న సూర్య వెళ్లి డోర్‌ కొడుతుంటాడు. అది తెలుసుకుని ఆకాష్‌ కోపంగా వాడికి లాస్ట్‌ టైం ఇచ్చిన డోస్‌ సరిపోలేదు అనుకుంటాను నువ్వు వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేసి డోర్‌ పక్కనే నిల్చో. నేను చీర చుట్టుకుని బెడ్‌ మీద ఉంటాను అని చెప్పగానే.. భూమి వెళ్లి డోర్‌ తీస్తుంది. భూమి డోర్‌ చాటుకు వెళ్లిపోతుంది. ఆకాష్‌ చీరలో కూర్చుని లైట్స్‌ ఆఫ్‌ చేసి కూర్చుని ఉంటాడు. లోపలికి వెళ్లిన సూర్య రొమాంటిక్‌ గా మాట్లాడుతూ దగ్గరకు వెళ్లి ఆకాష్‌ భుజాల మీద చేయి వేసి చూడ్డానికి సన్నగా ఉంటావు కానీ చాలా ఫిట్‌గా ఉంటావు.. జిమ్‌కు వెళ్తున్నావా.? ఏంటి… అంటే ఏం లేదు కానీ పెళ్లికి ముందు ఫస్ట్‌ నైట్‌ కరెక్ట్‌ కాదు ఇది సంప్రదాయం కాదు అంటూ చెప్తుంటే.. అదేంటి నీ గొంతు ఇలా మారిపోయింది. అంటూ సూర్య డౌటుగా అడిగితే..

ఏమో అలా మారిపోయింది అంటూ సిగ్గు అవుతుంది అని ఆకాష్‌ చెప్తుంటే.. నీ సిగ్గు నేను పోగొడతాను కదా ఇదిగో ఈ పాలు తీసుకో నువ్వు సగం పాలు తాగి సగం పాలు నాకు ఇవ్వు అంటే.. ఆకాష్‌ పాలు మొత్తం తాగి ఇస్తాడు. అదేంటి పాలు మొత్తం తాగేశావు.. అంత ఆకలిగా ఉందా..? అయినా నీ ఆకలి నేను తీరుస్తానులే అంటూ అరటి పండు వలచి నోట్లో పెడితే..పండు మొత్తం తింటాడు ఓ అంత ఆకలిగా ఉందా..? అయితే నీ ఆకలి నేను తీరుస్తాను అంటూ ఇంకో పండు నోట్లో పెట్టబోతూ.. అదేంటి నీకు గడ్డం మీసాలు ఉన్నాయి అంటూ అడగ్గానే.. నేను భూమి కాదు.. గగన్‌ను అంటూ సూర్య మీదకు పడి కొడుతుంటాడు.

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

కిత్రం సారి కొట్టిన దెబ్బలకు భూమి జోలికి రావనుకున్నాను అయినా మళ్లీ వస్తావా..? పెళ్లికి ముందు ఫస్ట్‌ నైట్‌ ఏంట్రా అంటూ కొడుతుంటే.. సూర్య తప్పించుకుని బయటకు వెళ్లి అపూర్వకు చెప్పి రూంలోకి తీసుకెళ్తాడు. రూంలో ఆకాష్‌ మంత్రగాడి వేషంలో కూర్చుని ఉంటాడు. ఈ రూంలోకి ఆకాష్‌ వచ్చాడా..? అని అడిగితే.. ఆకాష్‌ వస్తాడా..? వస్తే గగన్‌ రావాలి కదా..? ఒకవేళ వచ్చినా భూమిని కాపాడటానికి నేను ఇక్కడే ఉన్నాను కదా అంటాడు మంత్రగాడి గెటప్ లో ఉన్న ఆకాష్‌. మరి అయితే సూర్యను చితకబాదింది ఎవరు..? అని అనుమానంగా చూస్తూ వెళ్లిపోతుంది. మంత్రగాడి గెటప్‌లో ఉన్న ఆకాష్‌ నిద్రపోతున్నట్టు నటిస్తాడు.

తర్వాత రోజు గగన్‌ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో శారద నిద్రపోతూనే ఉంటుంది. గగన్‌ వెళ్లి డోర్‌ కొట్టి నిద్ర లేపుతాడు. ఏంటమ్మా ఇంత టైం వరకు పడుకునే ఉన్నావు.. అంటూ అడగ్గానే.. రాత్రి పడుకునే సరికి లేట్‌ అయింది. అని చెప్పగానే.. భూమి మెహెందీ ఫంక్షన్‌ ఆగిపోయిందని గగన్‌ చెబితే.. శారద సంతోషంగా మెహెందీ ఫంక్షన్‌ ఆగిపోయినట్టే పెళ్లి కూడా ఆగిపోవాలి.. నా కోడలు మళ్లీ తిరిగి మన ఇంటికి రావాలి. అంటుంది. తప్పకుండా వస్తుంది.. అమ్మా అంతా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అంటూ వెళ్లిపోతూ శారద రూంలో కేపీ దుప్పటి కప్పుకుని పడుకుని ఉండటం చూసి ఎవరు పడుకున్నారు అని అడుగుతాడు. శారద షాక్‌ అవుతూ.. మీరా పడుకుందని చెప్తుంది. గగన్‌ సరే అంటూ వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?