Meghasandesam Serial Today Episode: భూమిని కిడ్నాప్‌ చేసిన రౌడీలకు అపూర్వ సైగ చేయడం చెర్రి చూస్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయాక చెర్రి కోపంగా ఆ రౌడీ దగ్గరకు వెళ్తాడు. వాణ్ని గుర్రుగా చూస్తూ..

చెర్రి: ఓరేయ్‌ మీ అపూర్వ అత్తయ్య నీకు ఎంత ఇచ్చిందిరా..?

రౌడీ: ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు. ఏం అడుగతున్నారు మీరు..?

చెర్రి: ఓరేయ్‌ నేను అన్ని చూశాను. అంతా గమనిస్తున్నాను.. నువ్వు మా అత్తయ్యను చూడటం ఆమె నీకు సైగలు చేయడం అంతా చూస్తున్నాను.. చెప్పు భూమిని చంపడానికి మా అత్తయ్య నీకు ఎంత ఇచ్చిందో చెప్పు మర్యాదగా చెప్పు లేదంటే.. చచ్చిపోతావు..

రౌడీ: అదేం లేదు బాబు.. మీరు పొరబడ్డారు.. అసలు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు.. మీరు నా చేతిలో కత్తి జారిపోవడం చూసి అడుగుతున్నారు కదా..? అది పొరపాటున జారి కింద పడిపోయింది బాబు.

చెర్రి: ఓరేయ్‌ ఇంకా ఆటలు ఆడొద్దు నేను స్ట్రెయిట్ గా అడుగుతున్నాను.. భూమిని చంపేయమని మా అపూర్వ అత్తయ్య నీకు ఒక యాభై వేలో.. ఒక లక్ష రూపాయలో ఇస్తానని ఆశ పెట్టి ఉంటుంది. నీకో బంఫర్‌ ఆఫర్‌ రా ఇదే విషయాన్ని నువ్వు మా మామయ్య శరత్‌చంద్ర ఎదురుగా చెబితే నీకు పది లక్షలు ఇప్పిస్తానురా..?

రౌడీ: అయ్య బాబోయ్‌.. పది లక్షలా..?

చెర్రి: అవును పది లక్షలు ఇప్పుడే ఈ క్షణమే నీకు ఇప్పిస్తాను..

రౌడీ: లక్ష కంటే పది లక్షలు ఎక్కువే కదా బాబు.. భూమి అమ్మగారిని చంపమని అపూర్వ అమ్మగారు నాకు పది వేలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. మీరు ఏం చెప్పమన్నా చెప్తాను బాబు..

చెర్రి: ఇదే విషయం మా మామయ్య శరత్ చంద్రతో చెప్పు.. చాలు.. పద..

అంటూ చెర్రి రౌడీని తీసుకుని శరత్ చంద్ర దగ్గరకు వెళ్తాడు. అపూర్వ, నక్షత్ర షాక్‌ అవుతారు.

శరత్‌: ఏంటి చెర్రి ఎవడు వీడు..?

చెర్రి: మీకో విషయం చెప్పాలి మామయ్య. ఇందాక మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వీడు భూమిని చంపాలని చూశాడు. భూమిని చంపమంది ఎవరో తెలుసా..? మామయ్య.. ఆ విషయం వీడే చెప్తాడు. చెప్పరా..?

రౌడీ: అంటే నేను కొబ్బరికాయల వ్యాపారం చేసుకునే వాడిని అండి. ఇందాక ఎవరో కత్తి విసిరిన మాట నిజమేనండి.. అదేదో పొరపాటున జరిగిపోయింది అంతే.. ఈ అబ్బాయి గారు ఆ కత్తి మేడం గారే విసిరించారని అలా చెప్తే పది లక్షలు ఇస్తానని చెప్పారు సార్‌. అందుకే ఏదో పొట్టపూటి కోసమని ఇలా చెప్తున్నాననండి..

చెర్రి: లేదు మామయ్య నేను అలా చెప్పలేదు.. రేయ్‌ నిజం ఏంటో చెప్పరా..?

అపూర్వ: అయ్యో ఏంటి చెర్రి ఎందుకురా నా మీద ఇంత పగ పెంచుకున్నావు..

చెర్రి: లేదు మామయ్య నేను అలా చెప్పలేదు.. రేయ్‌ నిజం చెప్పరా..?

రౌడీ: అయ్య బాబోయ్‌ నాకు ఏం తెలియదండి.. ఇందాక పది లక్షలు ఇస్తాను అలా చెప్పమని చెప్పారండి

శరత్‌: రేయ్‌ చెర్రి గోరు ముద్దులు తినిపిస్తూ మిమ్మల్ని పెంచిందిరా నా అపూర్వ. అలాంటి అపూర్వ మీద నిందలు వేస్తావా..? రా అపూర్వ వెళ్దాం

అంటూ అపూర్వను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు శరత్ చంద్ర. మరోవైపు భూమిని వెతుక్కుంటూ గగన్‌ వెళ్తాడు. ఇంతలో శరత్‌ చంద్ర రావణ దహనం చేస్తాడు. రావణుడి ఫోటోలో ఉన్న భూమికి మంటలు తగులుంటాయి. అక్కడే ఉన్న గగన్‌కు భూమి శారీ నిప్పులకు కాలిపోయి కిందపడటం చూసి వెళ్లి భూమిని రక్షిస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!