Meghasandesam Serial Today Episode: అపూర్వ ప్లాన్‌ ప్రకారం తారను భూమి డాన్స్‌ స్కూల్‌ దగ్గరకు పంపిస్తుంది. అక్కడికి వచ్చే సుధాచంద్రన్‌ ఫ్రోగ్రాంను ఎలాగైనా బ్యాడ్‌ చేయాలని చెప్తుంది. అందువల్ల భూమి ఇమేజ్‌ పోతుందని ఆ డ్యాన్స్‌ స్కూల్‌కు అఫిలియేషన్‌ రాదని దాంతో భూమి పిచ్చిదైపోతుందని ఇక మీదట గగన్‌ వెంట తిరగదని మాటలు చెప్తుంది. అపూర్వ మాటలు నమ్మిన తార వెంటనే అక్కడకు బోకే తీసుకుని వెళ్లి సుధాచంద్రన్‌ రాక కోసం ఎదురు చూస్తుంటుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

సుధాచద్రన్‌ ముందు బ్యాడ్‌గా బిహేవ్‌ చేసిన తార

అప్పుడే అక్కడకు వచ్చిన సుధాచంద్రన్‌ ముందు తాను డాన్స్‌ స్కూల్‌ లో విద్యార్థిని అంటూ పరిచయం చేసుకుంటుంది. ఫ్రోగ్రాం నడుస్తుండగానే.. బ్యాడ్‌ బిహేవియర్‌ చేస్తుంది. తార బ్యాడ్‌ బిహేవియర్‌ వల్ల సుధాచంద్రన్‌ డిస్టర్బ్‌ అవుతుంది. వెంటనే భూమి కోపంగా వెళ్లి తారను అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్తుంది. తార తాను వెళ్లనని మొండికేయడంతో భూమి కోపంగా తార చెంప పగులగొడుతుంది. దీంతో తార కోపంగా నన్నే కొడతావా..? అంటూ ప్రశ్నించడంతో ఒక టీచర్‌ గా స్టూడెంట్‌ ను కొట్టే హక్కు తనకుందని భూమి చెప్పి కోపంగా తారను అక్కడి నుంచి పంపించి వేస్తుంది. తార వెళ్లిపోయాక సుధాచంద్రన్‌ వెళ్లిపోతుంటే.. భూమి వెళ్లి ఆపేస్తుంది. తన స్టూడెంట్స్‌ బాగా డాన్స్‌ చేస్తారని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. సుధాచంద్రన్‌ మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. వెనకాలే భూమి బాధగా రిక్వెస్ట్‌ చేస్తూ వెళ్తుంటే.. గగన్‌ స్టూడెంట్స్‌ తో డాన్స్‌ చేయిస్తుంటాడు. ఆ సౌండ్‌ కు తిరిగి చూసిన సుధాచంద్రన్‌ ఆశ్చర్యపోతుంది. తిరిగి వచ్చి కూర్చుని వాళ్ల డాన్స్‌ చూస్తుంటుంది.

శరత్‌చంద్రను రెచ్చగొట్టిన అపూర్వ

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

డాన్స్‌ అకాడమీ నుంచి బయటకు వెళ్లిన తార కోపంగా నన్నే కొడుతుందా.. అనుకుంటూ వాళ్లిద్దరికి ఈరోజు ఆఖరి రోజు కావాలి. తర్వాత గగన్‌తో తాను ఒక్కతే జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటుంది. వెంటనే అపూర్వకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్తుంది. తార మాటలకు అపూర్వ షాక్‌ అవుతుంది. భూమి, గగన్‌ కలిసి డాన్స్‌ చేస్తున్నారు అని చెప్పగానే.. అపూర్వ వాళ్ల సంగతి తనకు వదిలేయమని తాను చూసుకుంటానని చెప్పగానే.. తార సరేనని కాల్ కట్‌ చేస్తుంది. అపూర్వ మాత్రం భూమి బలే దొరికావు నిన్ను నీ తండ్రి చేతే బయటకు గెంటేస్తాను అనుకుంటూ లోపలికి శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి.. భూమి, గగన్‌ డాన్స్‌ చేసే విషయం చెప్తుంది.

అపూర్వ మాటలు వినగానే.. శరత్‌ చంద్ర కోపంగా ఏం మాట్లాడుతున్నావు అంటూ అనగానే.. అవును బావ భూమి ఇప్పుడు గగన్ తో కలిసి ఆ అకాడమీలో సరసాలు ఆడుతుంది అంటూ చెప్పగానే.. శరత్‌ చంద్ర కోపంగా నువ్వు చెప్పేది నిజమా అంటాడు. నేను అబద్దం చెబితే నన్ను చంపేయ్‌ బావ అంటుంది అపూర్వ. దీంతో శరత్‌ చంద్ర కోపంగా గన్‌ తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. అంతా దూరం నుంచి గమనిస్తున్న కేపీ అక్కడి నుంచి కంగారుగా వెళ్లిపోతాడు. శరత్‌ చంద్ర గన్‌ తీసుకుని వెళ్లిపోగానే.. అపూర్వ నవ్వుతూ తారతో గగన్‌ పెళ్లి చేసి ఆ భూమిని బతికుండగానే దాన్ని చావుదెబ్బ కొట్టాలనుకున్నాను. కానీ దాని చావు దాని తండ్రి చేతిలో రాసిపెట్టి ఉందని చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాన్నే కాదు బావ ఉన్న ఆవేశానికి వాళ్లిద్దరినీ చంపేస్తాడు. అనుకుంటూ నవ్వుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!