Meghasandesam Serial Today Episode: శివ కోసం బిందు గగన్‌ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వచ్చిన బిందును చూసిన శివ షాక్‌ అవుతాడు. శివ ఎలా ఉన్నావు అని పలకరిస్తుంది. ఎల వచ్చావని బిందును తన రూంలోకి తీసుకెళ్తాడు శివ.

శివ: ఏంటి బిందు ఇలా వచ్చావు..? ఎవ్వరూ లేని టైంలో వచ్చావు కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా ఉండి ఉంటే ఏంటి పరిస్థితి..

బిందు: ఏమో శివ ఎవరు ఉన్నారు లేరు అన్నది ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను.. నిన్ను చూడాలనిపించింది. వచ్చేశాను. నీకు పెళ్లి అయిపోతే మళ్లీ మనం కలుస్తామో లేదోనన్న దిగులు నన్ను క్షణం కూడా నిద్రపోనివ్వకుండా చేస్తుంది.
అంటూ బిందు, శివను హగ్‌ చేసుకుంటుంది. అప్పుడే బయటి నుంచి గగన్‌, భూమి ఇంటికి వస్తారు. లోపలికి వెళ్తారు.

భూమి: బావ ఇలా కార్డ్స్‌ పంచుతూ అందరినీ పిలవడం కష్టంగా ఉంది బావ. అదీ కాక పెళ్లికి ఎంతో టైం లేదు కదా..?

గగన్‌: చాలా వరకు వాట్సాప్‌ చేశాను భూమి. మరీ ముఖ్యం అనుకున్న వాళ్ల దగ్గరికే వెళ్లి కార్డ్స్‌ ఇస్తున్నాం. ఇంకా ఎన్నో లేవులే.. అవి అయిపోతే నువ్వు ఘనంగా పెళ్లి జరిపించొచ్చులే.. కొంచెం కాఫీ ఇస్తావా..? హెడేక్‌గా ఉంది.

భూమి: సరే బావ నువ్వు ప్రెష్‌ అప్ అవ్వు నేను కాఫీ తీసుకొస్తాను..
అని చెప్పగానే.. గగన్‌ పైకి వెళ్తుంటాడు. శివ రూంలో బిందును హగ్‌ చేసుకోవడం భూమి చూసి షాక్‌ అవుతుంది. రూంలోకి వెళ్లబోతుంటే.. గగన్‌ చూస్తాడు. అప్పుడే బిందు, శివలు కూడా భూమిని చూస్తారు.

గగన్‌: భూమి.. కాఫీ అడిగితే అటు వెళ్తున్నావేంటి..?

భూమి: ఏం లేదు బావ. గాలికి కిటికీలు కొట్టుకుంటున్నాయి. బావ నువ్వు వెళ్లు నేను కాఫీ తీసుకొస్తాను.

గగన్‌: త్వరగా రా భూమి నేను ఆఫీసుకు వెళ్లాలి..

భూమి: రావు గారి ఇంటికి వెళ్లాలి అన్నావు కదా..? ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టు అక్కడికి వెళ్లి వచ్చేద్దాం..

గగన్‌: సరే నువ్వు త్వరగా తీసుకురా..?
అంటూ చెప్పి గగన్ పైకి వెళ్లిపోతాడు. భూమి కోపంగా రూంలోకి వెళ్లి శివను కొడుతుంది.

భూమి: ఏంట్రా నువ్వు చేస్తున్న పని..

బిందు: వదినా..?

భూమి: బిందు నువ్వేం మాట్లాడకు. వయసులో చిన్నదానివే అయినా..నీకు దండం పెడతాను. దయచేసి పరిస్థితి అర్థం చేసుకో..

బిందు: మీరు మా ప్రేమను అర్తం చేసుకోండి వదిన.

భూమి: నేను కానీ మీ అన్నయ్య కానీ ప్రేమకు వ్యతిరేకం కాదు బిందు. ఇప్పటికిప్పుడు మీ ప్రేమ గురించి తెలిసినా మీ అన్నయ్య శివని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి వెనకాడడు. కానీ ఈ ఇంటి పరువు గురించి ఒక్కసారి ఆలోచించు బిందు. ఆ ఇంటి వలన ఈ ఇల్లు ఎన్ని అవమానాలకు గురైందో ఒక్కసారి గుర్తు చేసుకో..? మీరు ప్రేమించుకున్న సంగతి ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టక ముందు చెప్పి ఉంటే.. ఈ పెళ్లి నిజంగా జరిగేది కాదు. ఇప్పుడు మీ ప్రేమ ఈ ఇంటి పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి అర్తం చేసుకోవడానికి ప్రయత్నించు బిందు. శివను మర్చిపో.. నీ తలరాతలో ఇంకెవరో రాసి ఉన్నారని సరిపెట్టుకో.. ఈ ఇంటికి ఎప్పుడూ రాకు బయలుదేరు బిందు..

బిందు: అది కాదు వదిన..

శివ: అక్కా…

భూమి: ఫస్ట్‌ నువ్వు రా..
అంటూ బిందును తీసుకుని భూమి బయటకు రాగానే బయట గగన్‌ ఉంటాడు. గగన్‌ ను చూసి ముగ్గురూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.