Meghasandesam Serial Today Episode: గుడి నుంచి ఇంటికి వెళ్లిపోతున్న గగన్‌ కారు స్టార్ట్‌ చేస్తుంటే గుడి మైకులో శరత్‌ చంద్రతో కర్రసాములో పోటీ పడి గెలిచేవారు ఎవరైనా ఉన్నారా..? అని వినిస్తుంది. అది వినగానే గగన్‌ వెంటనే కారు ఆపేసి కిందకు దిగుతాడు. అందరూ కిందకు దిగగానే..

గగన్‌: అమ్మా అది విన్నావా..?

శారద: ఏంట్రా..?

గగన్‌: ఆ గుడి మైకులో చెప్పింది. ఆ పోటీ ఏదో చాలా ఇంట్రస్ట్‌ గా ఉంది కదా..? గెలిచిన వాళ్లు చెప్పాలి. ఓడిన వాళ్లు గెలిచిన వాళ్లు చెప్పింది చేయాలి. అమ్మ నేను ఈ పోటీకి వెళ్లి వస్తానమ్మా..

శారద: రేయ్‌ ఆగరా అవన్నీ మనకు ఎందుకు..?

గగన్‌: అమ్మా ఆగు..

భూమి: అవును బావ వెళ్దాం పద

గగన్‌: లేదు ఈ పోటీలో నేను పార్టిసిపేట్‌ చేయాలనుకుంటున్నాను.

భూమి: వద్దు బావ ఫ్లీజ్‌ ఇప్పటి వరకు నీకు మా నాన్నకు ఉన్న వైరం చాలు బావ. అది వర్గంగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి తీసుకురావొద్దు. ఫ్లీజ్‌ బావ అర్తం చేసుకో.. మీ ఇద్దరిలో ఎవరు ఓడినా బాధపడేది నేనే.. దయచేసి అర్థం చేసుకో బావ. పద వెళ్దాం.

గగన్: భూమి ఈరోజు మనం సంక్రాంత పండగలో ఉన్నాం. యుద్దంలో కాదు. జరుగుతున్నవి పోటీలు, పోట్లాటలు కాదు. ఇందులో ఎవరు ఓడిపోయినా స్పోర్టివ్‌ గానే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఓడిపోవాల్సిన పరిస్థితే వస్తే నాకు లాగే మీ నాన్న కూడా స్పోర్టివ్‌ గానే తీసుకుంటారు అనే నమ్మకం నాకు ఉంది భూమి.

భూమి: అత్తయ్య బావకు మీరైనా చెప్పండి అత్తయ్య..

శారద: అవునురా ఈ పోటీలో నువ్వు పాల్గొనడం నాకు కూడా ఇష్టం లేదురా..? అదికాక అది కర్రసాము. దానికి శిక్షణ ఉండాలిరా..? నీకేం తెలుసని గుడ్డిగా బరిలోకి దిగుతానంటున్నావు..

గగన్‌: అంటే శిక్షణ లేకుండా కర్రసాము పోటీలో దిగితే ఓడిపోతానా నేను

శారద: ఇంచు మించు అదేరా..?

గగన్‌: అది కూడా ఒకందుకు మంచిదే కదమ్మా..? సంక్రాంతి పూట మా నాన్న గెలిచాడు అన్న ఆనందం భూమికి ఉంటుంది. ఆయన్ని గెలిపించాను అన్న సంతోషం నాకు ఉంటుంది కదమ్మా..?

భూమి: లేదు బావ. మా నాన్నతో పాటు నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయినా నాకు బాధే తప్ప ఆనందం ఉండదు.

గగన్: భూమి దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.. నేను ఏం చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించే చేస్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అమ్మ, భూమి మీ ఇద్దరికీ చెప్తున్నాను.. నేను ఈ పోటీలో పాల్గొనే తీరతాను..

పూర్ణి: అన్నయ్యా..

శారద: గగన్‌..

భూమి: బావ..

గగన్‌: నో వే వస్తాను..

అంటూ గగన్‌ ఆగకుండా పోటీలు జరుగుతున్న వైపు వెళ్తాడు. శారద, భూమి భయపడుతుంటారు. గుడిలో పోటీల దగ్గర నిర్వాహకులు ఈ సంవత్సరం కూడా శరత్‌ చంద్ర గారితో పోటీ పడే వారే లేరా అని అడుగుతుంటారు. అప్పుడే అక్కడికి గగన్‌ వెళ్లి నేనున్నాను అంటాడు. గగన్‌ను చూసిన శరద్‌ చంద్ర ఫ్యామిలీ షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!