Meghasandesam Serial Today Episode: నక్షత్ర తన కాలేజ్ లెక్చరర్ల ను ఇంటికి తీసుకొచ్చి తమ కాలేజీలో నాట్యాలయం కోసం ఒక బిల్డింగ్‌ కట్టాలనుకుంటున్నారు అందుకోసం డొనేషన్‌ కోసం వచ్చారని చెప్తుంది. తాము కట్టే ఆ బిల్డింగ్‌కు శోభాచంద్ర గారి పేరు పెట్టాలనుకుంటున్నట్లు లెక్చరర్లు చెప్తారు. దీంతో శరత్‌ చంద్ర తనకు ఇష్టం లేదని నాట్యం నేర్చుకున్న వాళ్లకు, నేర్చుకుంటున్న వాళ్లకు పిచ్చి ఉంటుంది. అలాంటి పిచ్చిని ప్రోత్సహిస్తూ నేను ఫండ్‌ ఇవ్వలేను అని చెప్తాడు. దీంతో లెక్చరర్లు వెళ్లిపోతారు.

నక్షత్ర: ఇది నీకు డామ్‌ ఇన్సల్ట్‌ డాడ్‌..

శరత్‌: అది నేను చెప్తున్నాను ఇలాంటి డామ్‌ ఇన్సల్ట్‌ పనులు ఇంకెప్పుడు చేయకు. వాళ్లతో పాటు మీ అందరికీ ఎందుకు చెప్పానంటే మన ఇంట్లో మళ్లీ ఈ డాన్స్‌ అనే పదం వినిపించకూడదు.

నక్షత్ర: మరి అలా అనుకున్నప్పుడు భూమి కూడా ఆ డాన్స్ లో ఫేమసే కదా..?

శరత్‌: భూమిని నేను ఆదరించింది. తన నాట్యం చూసి కాదు. తన మనసును చూసి. నాట్యం అనే పదం అందరితో పాటు తను కూడా ఉచ్చరించదు.

అని చెప్పి వెళ్లిపోతాడు శంకర్‌ . తర్వాత ప్రసాద్‌, భూమి దగ్గరకు వెళ్లి నాట్యం గురించి మీ నాన్న అలా మాట్లాడుతుంటే.. మీ అమ్మ నాట్యంతో చనిపోలేదని.. గట్టిగా చెప్పాలనుకున్నాను కానీ సాక్ష్యం లేదుగా అంటాడు.

భూమి: నిజంగా అమ్మ ఆత్మ అక్కడే ఉండి ఉంటే ఎంత బాధపడి ఉండేదో..?

ప్రసాద్‌: నిజమే అమ్మా ఈ ఆస్తి అంతా మీ అమ్మా నాట్యం ద్వారానే సంపాదించింది. ఈ ఆస్తిలో సగం నాట్య కళాశాలలు ప్రారంభించాలనుకుంది.

భూమి: నిజమా మామయ్యా..

ప్రసాద్‌: అవును భూమి.. ఆ కలలను నాతో పంచుకుంది మీ అమ్మ కానీ అపూర్వ కాల్చి పడేసింది.

భూమి: అపూర్వ అనే రాక్షసి కాల్చేస్తే అవి కాలిపోతాయా..? వాటిని మనం నిలబెడదాం.

ప్రసాద్‌: మనమెలా నిలబెడతాం అమ్మా.. ఆ దేవుడే దిగి వచ్చినా మీ నాన్న వినరు.

భూమి: శోభాచంద్ర గారే దిగి వచ్చి చెబితే శ్రీశ్రీశ్రీ శరత్‌ చంద్ర గారు నమ్మరా మామయ్యా..?

అనగానే ప్రసాద్‌ ప్రతిసారి శోభాచంద్ర గారు వస్తారా..? అని అడగ్గానే ఎందుకు రాదు వస్తుంది. అంటూ ఆరోజు తాను శోభాచంద్ర తనను పూనినట్టు నాటకం ఆడానని భూమి చెప్తుంది. ఇదంతా డోర్‌ చాటు నుంచి చూస్తున్న అపూర్వ తన ఫోన్‌ లో వీడియో రికార్డు చేస్తుంది. ఆరోజు నాటకం ఆడినట్టే ఈరోజు నాటకం ఆడతానని తిరిగి శోభాచంద్ర గారి కలలకు ప్రాణం పోస్తాను అని చెప్తుంది. వీడియో రికార్డు చేసుకున్న అపూర్వ ఇప్పుడు నేను ఆడబోయే నాటకంతో భూమి బతుకు రోడ్డున పడుతుంది అనుకుని వెళ్లిపోతుంది. తర్వాత గగన్‌, చెర్రికి ఫోన్‌ చేసి భూమికి ఇవ్వమంటాడు. చెర్రి, ప్రసాద్‌ దగ్గరకు వెళ్లి అన్నయ్య మాటి మాటికి నాకు ఫోన్‌ చేసి భూమికి ఇవ్వమంటున్నాడు కొంపదీసి అన్నయ్య ప్రేమించేది భూమినా అని అడుగుతాడు. ప్రసాద్‌ తిడుతూ నీకు అన్ని అనుమానాలే అంటాడు. దీంతో చెర్రి ఫోన్‌ తీసుకెళ్లి భూమికి ఇస్తాడు ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!" href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_blank" rel="noopener">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!