Chiranjeevi Bobby Mega 158 Movie Shooting First Schedule Date Locked : 'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీపై మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. 'వాల్తేరు వీరయ్య' ఫేం బాబీతో ఆయన మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా... పూజా కార్యక్రమాలకు రెడీ అవుతోంది.

పూజా కార్యక్రమాలతో ప్రారంభం

ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో 'Mega 158' ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి సహా మూవీ టీం ఈ వేడుకలో పాల్గొననుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాగా... ఈ నెల 20 నుంచి షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ చిరుతో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఫస్ట్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... స్టోరీ ఎలా ఉండబోతోందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. గతంలో వీరిద్దరి కాాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అందులో మాస్ మహారాజ రవితేజ కీలకపాత్ర పోషించారు. బెంగాల్ నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?