Tollywood Producer Registers MAVIGUN Title : సోషల్ మీడియాలో ప్రతీ రోజూ చాలా ట్రెండ్ అవుతుంటాయి. అలా ఫేమస్ అయిన పదాలు, క్రైమ్ స్టోరీస్, రియల్ సంఘటనలను మూవీస్‌గా తెరకెక్కించడం మనం చూశాం. కొన్నింటిని సాంగ్ లిరిక్స్‌లోనూ వాడుతుంటారు. గతంలో చాలా వరకూ అలాంటి ట్రెండింగ్ వర్డ్స్ సినిమాలుగా వచ్చాయి. తాజాగా అలాంటి రీసెంట్ వర్డ్‌ను మూవీ టైటిల్‌గా రిజిస్టర్ చేేయించినట్లు ప్రచారం సాగుతోంది.

'మావిగన్' ట్రెండింగ్...

గత రెండు రోజులుగా ఏ నోట విన్నా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మావిగన్ (MAVIGUN) పేరే వినిపిస్తోంది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తాజా ప్రెస్ మీట్‌లో ఈ కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించిన సందర్భంగా... ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ బిల్లును వైసీపీ ఎంపీలు వ్యతిరేకించారు.

ఈ క్రమంలో జగన్ ప్రెస్ మీట్‌లో మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు ప్రాంతాలను కలుపుతూ రాజధాని ఏర్పాటు చేయాలంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUNను తీసుకుని MAVIGUN అని పేరు పెట్టాలని సూచించారు. ఈ పేరు నచ్చకపోతే అమరావతి పేరుతోనే ఆ ప్రాంతాన్ని కాపిటల్‌గా చేయాలని అన్నారు. దీంతో ఆ పేరు మార్మోగుతోంది.

Also Read : బండ్ల గణేష్‌కు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా? - వియ్యంకుడి బ్యాగ్రౌండ్, ఆస్తుల వివరాలివే...

నెట్టింట ట్రోలింగ్స్

మావిగన్ (MAVIGUN) ప్రతిపాదనపై జగన్ సపోర్టర్స్ ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే... కొందరు వైసీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు సైతం భవిష్యత్తులో మావిగన్ రాజధాని అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా ఈ పదం వైరల్ అయ్యింది.

టైటిల్ రిజిస్టర్

ఈ క్రమంలో MAVIGUN పేరుతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్‌లో టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ పేరుతో మూవీ తీయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. మరి MAVIGUN పేరుతో ఎలాంటి జానర్ మూవీ తీస్తారో అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ జానర్ అయితే బెటర్ అంటూ సలహాలు ఇస్తున్నారు.