Maruti Suzuki Victoris కారు కొనుగోలు చేయాలని సెప్టెంబర్ 2026లో ఆలోచిస్తున్న వారికి శుభవార్త. కంపెనీ తరఫున భారీ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. Victoris Strong Hybrid వేరియంట్‌పై రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. పెట్రోల్, CNG మోడళ్లపై రూ. 85,000 వరకు ఆఫర్లు పొందవచ్చు. ఈ మొత్తం నేరుగా క్యాష్ డిస్కౌంట్ లభించదు. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్, లాయల్టీ, ఇతర అంశాలు ఉంటాయని స్పష్టం చేసింది.

విక్టోరిస్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది?

ఈ సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకీ విక్టోరిస్ హైబ్రిడ్ (Maruti Suzuki Victoris Strong Hybrid) మోడల్‌పై గరిష్టంగా రూ. 1.35 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌లో రూ. 20,000 కన్స్యూమర్ బెనిఫిట్ ఉంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్, లాయల్టీ/ అప్‌గ్రేడ్, స్క్రాపేజ్ వంటి అంశాల్లో బెనిఫిట్స్ పొందవచ్చు. అన్ని ఆఫర్లు ప్రతి కస్టమర్‌కూ వర్తిస్తాయని కాదు. హైదరాబాద్‌లో ఈ కారు బేస్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.49 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 13,30,576గా ఉంది. హైదరాబాద్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్(Petrol) ఎక్స్‌షోరూమ్ ధర రూ. 16,42,900 కాగా, అన్ని ఛార్జీలు, పన్నులు కలిపితే ఆన్ రోడ్ ధర రూ. 20.67 లక్షల వరకు అవుతుంది.

మారుతి Victoris పెట్రోల్, CNG వేరియంట్లపై రూ. 85,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. కస్టమర్లు బుకింగ్ చేయడానికి ముందు వారు తీసుకునే వేరియంట్‌పై వర్తించే ఆఫర్ల పూర్తి సమాచారాన్ని డీలర్‌ను అడిగి తెలుసుకోవాలి. రూ. 1.35 లక్షలను నేరుగా క్యాష్ డిస్కౌంట్‌గా రాదు. ఎక్స్ఛేంజ్-స్క్రాపేజ్ వంటి కొన్ని ప్రయోజనాలు కొన్ని మోడల్స్ కు రావొచ్చు.

Also Read: 2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌.. మైలేజ్, పవర్‌లో వచ్చిన మార్పులేంటి?

Victorisలో పలు పవర్‌ట్రెయిన్లు

మారుతి సుజుకి Victorisను వేర్వేరు పవర్‌ట్రెయిన్లతో వస్తోంది. ఇందులో పెట్రోల్, ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లు ఉన్నాయి. సెప్టెంబర్ ఆఫర్‌లో Strong Hybrid వేరియంట్‌పై అత్యధికంగా రూ. 1.35 లక్షల వరకు బెనిఫిట్ ఇస్తున్నారు. ఒకవేళ పెట్రోల్, CNG వేరియంట్లుఅయితే రూ. 85,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

Victorisను ఒక ప్రీమియం మిడ్-సైజ్ SUV. ఇందులో ఆటోమోటివ్ ఇంటీరియర్, పెద్ద స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సేఫ్టీకి సంబంధించిన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు Hyundai Creta, కియా సెల్టోస్ (Kia Seltos), Honda Elevate, టాటా సియెర్రాలతో పోటీ పడుతుంది.

ఈ విషయాలు తెలుసుకోవాలి

మీరు సెప్టెంబర్ లో Victoris కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, అత్యధికంగా Strong Hybridపై రూ. 1.35 లక్షలు, పెట్రోల్/ CNG మోడల్‌పై రూ. 85,000 వరకు బెనిఫిట్స్ పొందచ్చు. SUV సెగ్మెంట్‌లో ఇది ఫీచర్-లోడెడ్ ఆప్షన్. ఇందులో పెట్రోల్, CNGతో పాటు Hybrid వంటి పవర్‌ట్రెయిన్లు, మోడ్రన్ డిజైన్, ప్రీమియం కేబిన్, స్ట్రాంగ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Also Read: మారుతి కార్ల ధరలు పెరగనున్నాయ్.. ఏకంగా రూ.20,000 వరకు!

డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, మైలేజ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండే SUVని కోరుకునే వారికి మారుతి Victoris మంచి ఆప్షన్ కావచ్చు. ఇందులో పెట్రోల్‌తో పాటు CNG, Strong Hybrid వంటి ఆప్షన్లు లభిస్తాయి. ఇవి కాకుండా Level-2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, డిజిటల్ క్లస్టర్, ప్రీమియం ఆడియో వంటి ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో మంచి పోటీదారుగా చేస్తున్నాయి.