మాస్ మహారాజా రవితేజ సోదరుని కుమారుడు మాధవ్ భూపతిరాజు (Madhav Bhupathiraju) కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'మారెమ్మ' (Maremma). సెప్టెంబర్ 10న విడుదల అవుతోంది. శనివారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్రెడీ సినిమా చూశానని చెప్పారు. మరి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?

ఆగస్టులో సినిమా చూశా... నాకు నచ్చింది - రవితేజ
'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ... ''నేను ఆగస్టు నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన రఫ్ కట్ చూశా. 'మారెమ్మ' చాలా నేచురల్‌గా తీసిన రస్టిక్ అండ్ రూటెడ్ సినిమా. గ్రామీణ నేపథ్యంలో అసాధారణమైన కథను తీసుకుని చేయడం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సినిమాను చాలా అద్భుతంగా తీశారు. నాకు బాగా నచ్చింది. ఎంజాయ్ చేశా" అని చెప్పారు. ముఖ్యంగా హీరో మాధవ్ భూపతిరాజు, గేదె మధ్య సాగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Jagamae Sangeetham Review By Chiranjeevi - 'జగమే సంగీతం' సిరీస్‌కు చిరంజీవి రివ్యూ... ప్రకాష్ రాజ్ గురించి ఏం చెప్పారంటే?

'మారెమ్మ' కోసం మాధవ్ భూపతిరాజు బాడీ పరంగా ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించాడని, ఆ పాత్రకు అతని ఎత్తు, గడ్డం, లుక్ పర్ఫెక్ట్ యాప్ట్ అని రవితేజ అభినందించారు. దీపా బాలు తమిళ అమ్మాయి అయినప్పటికీ, తెలంగాణ యాసను నేర్చుకుని చాలా చక్కగా తెలుగు మాట్లాడిందని, అద్భుతంగా నటించిందన్నారు. వికాస్ నటనపై కూడా రవితేజ ప్రశంసలు కురిపించారు.

Also Read: Supritha Boyfriend - సుప్రీతా బాయ్‌ఫ్రెండ్ కాదు... అతను 'గే' - వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు

మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మారెమ్మ'ను మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు (మయూర రెడ్డి), కుశాల్ నిర్మించారు. పల్లెటూరి ప్రజల్లో దేవునిపై నమ్మకం, భక్తి, యాక్షన్ అంశాలు మేళవించి ఈ సినిమా తీశారు. తెలంగాణలోని ఓ ఊరిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించారని రవితేజ తెలిపారు. మహీషాపురం గ్రామం, ఆ గ్రామదేవత అయిన మారెమ్మ చుట్టూ కథ తిరుగుతుందని... చిన్నప్పటి నుంచి గేదెతో హీరో పెంచుకున్న అనుబంధం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని రవితేజ వివరించారు. 'ఇరుముడి'తో ఆయన భారీ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి హీరోగా వస్తున్న మాధవ్ భూపతిరాజు 'మారెమ్మ'తో మంచి విజయం అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయన్నారు రవితేజ.

పెదనాన్న రవితేజను, ఆయన సినిమాలను చూస్తూ పెరిగానని మాధవ్ భూపతిరాజు చెప్పారు. తన తొలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రవితేజ రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది తనకు స్పెషల్ మూమెంట్ అని ఎమోషనల్ అయ్యారు. రవితేజ తనకు పెదనాన్నలా మాత్రమే కాకుండా అన్నయ్య లాంటి వారన్నారు.

Also Read: Sree Vishnu Ameerpet Comment - అమీర్‌ పేట్‌ ఛాలెంజ్‌లు వద్దు... బట్టలు విప్పొద్దు... పబ్లిసిటీ రాయుళ్ళకు శ్రీవిష్ణు కౌంటర్