నందమూరి, మంచు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కొన్ని సినిమాల్లో నటించారు. తర్వాతి తరంలోనూ ఆ అనుబంధం కొనసాగుతోంది. ఒక్క నందమూరి కుటుంబం అని కాదు... ఇండస్ట్రీలో అందరితోనూ కలుపుకోలుగా ఉండే మనిషి మంచు మనోజ్ (Manchu Manoj). మల్టీస్టారర్స్ చేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేశారు. విలన్ రోల్స్ చేసేందుకు కూడా ఓకే అన్నారు. దాంతో ఆయనకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే ఆ అవకాశాల్లో కొన్నిటికి మాత్రమే 'ఎస్' చెబుతున్నారు. అందులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

'ఎన్‌బీకే 111'లో విలన్‌గా మంచు మనోజ్?
Manchu Manoj in NBK111: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య చాలా చక్కటి అనుబంధం ఉంది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమా చేశారు. అందులో మంచు మనోజ్ హీరో. బాలకృష్ణ ప్రత్యేక అతిథి పాత్ర చేశారు. అయితే... ఈసారి బాలయ్య సినిమాలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నట్లు సమాచారం.

Also Read: Toxic Release Postponed: యశ్ 'టాక్సిక్' విడుదల వాయిదా... 'ధురంధర్ 2'కు లైన్ క్లియర్... అసలు రీజన్ ఏమిటంటే?

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 Movie రూపొందుతోంది. 'వీర సింహా రెడ్డి' విజయం తర్వాత వాళ్ళిద్దరి కలయికలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర మంచు మనోజ్ చేస్తే బావుంటుందని దర్శక నిర్మాతల ఆలోచన. బాలయ్య సినిమా కావడంతో అడిగిన వెంటనే మనోజ్ కూడా ఓకే చేశారట.

Also Read: Chittoor Pilla Song Lyrics: చిత్తూర్ పిల్ల సాంగ్ లిరిక్స్... 'సతీ లీలావతి'లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి పాట - ఎలా ఉందో విన్నారా?

రీ ఎంట్రీలో మంచు మనోజ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్నారు. హీరోగా మల్టీస్టారర్ 'భైరవం'తో విజయం సాధించారు. విలన్‌గా పాన్ ఇండియా హిట్ 'మిరాయ్' చేశారు. ఆ రెండు విజయాల తర్వాత సోలో హీరోగా 'డేవిడ్ రెడ్డి' చేస్తున్నారు. అది కాకుండా బాలయ్య సినిమా, మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలిసింది.

Also Read: Chiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?