<p>Manchu Manoj filed a police complaint against Mohan Babu: ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనపై దాడి చేశారని మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. తనకు అయిన గాయాల మెడికల్ రికార్డులను సమర్పించారు అలాగే ఇతర ఆధారాలను ఆయన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో సమర్పించినట్లుగా తెలుస్తోంది. జల్ పల్లి లో ఉన్న మంచు మోహన్ బాబు నివాసంలోనే దాడి జరిగింది. ఆ ఇల్లు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో అక్కడ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. </p>
<p>ఆదివారం డయల్ 100కు మంచు మనోజ్ తో పాటు మంచు మోహన్ బాబు కూడా ఫోన్లు చేసి ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తర్వాత పోలీసులు ఇంటికి వెళ్లేసరికి ఇద్దరూ ఆల్ హ్యాపీస్ అని చెప్పడంతో వచ్చేశారు. పహాడీ షరీఫ్ సీఐ కూడా మీడియాకు అదే చెప్పారు. ఆదివారం సాయంత్రం తర్వాత మంచు మనోజ్ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. సోమవారం ఉదయం అంతా ఆయన జల్ పల్లి ఇంట్లోనే ఉన్నారు. మంచు లక్ష్మి కూడా వచ్చి మనోజ్ తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయిదని తెలుస్తోంది. </p>