Manchu Manoj: దమ్ముంటే వాళ్ళను అడగండి... మైక్‌తో కాద హెల్మెట్‌తో వెళ్ళండి - ఫ్యామిలీ ఇష్యూలపై మంచు మనోజ్
2 weeks ago 3
ARTICLE AD
క్రమశిక్షణకు మారుపేరుగా మంచు కుటుంబం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖులు చెప్పేవారు. అదంతా గతం. ఆ కుటుంబంలోనూ వివాదాలు వచ్చాయి. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు తలెత్తాయి. ఆ సమయంలో పెద్ద కుమారుడు విష్ణు మంచు (Vishnu Manchu) వైపు లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) నిలబడ్డారు. వాళ్ళిద్దరిపై మంచు మనోజ్ (Manchu Manoj) ఒంటరి పోరాటం చేశారు. కొన్నాళ్లుగా వివాదాలు (Manchu Family Issue) ఏమీ లేవు. ఆ సమస్య సమసిపోయినట్టేనా? అని అడగ్గా... మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
మే 20వ తేదీన మంచు మనోజ్ పుట్టినరోజు (Manchu Manoj Birthday). అందుకని మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, వివాదాల గురించి మనోజ్ మంచుకు ప్రశ్న ఎదురైంది.
'మీ కుటుంబంలో సమస్యలు క్లియర్ అయినట్టేనా?' అని అడిగితే... ''అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా?'' అని ఎదురు ప్రశ్నించారు. అంటే... తండ్రి మోహన్ బాబు, అన్నయ్య విష్ణు మంచును అడగమని పరోక్షంగా చెప్పారు. ఆ తర్వాత ''వెళ్లి అడగండి. కానీ మైక్ పట్టుకుని వెళ్లొద్దు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి'' అంటూ తన మార్క్ నవ్వుతో సమాధానం ముగించారు. ఆయన పైకి నవ్వుతున్నప్పటికీ... లోపల సమస్య మాత్రం అలాగే ఉందని, సమసి పోలేదని అర్థం అవుతోంది.
Also Read: Bhuma Mounika Reddy Political Entry - రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి?
Media Person: మీ ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయినట్టేనా ?
Manchu Manoj: అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా ? వెళ్ళి అడగండి. కానీ Mic 🎤 పట్టుకొని వెళ్లొద్దు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. pic.twitter.com/TFPL51AXaj
— Rajesh Manne (@rajeshmanne1) May 19, 2026
ఎన్టీఆర్, సిరివెన్నెల సైతం అదే తేదీన!
తెలుగు చిత్రసీమలోని యంగ్ స్టార్ హీరోలలో ఒకరైన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జన్మించినది కూడా మే 20వ తేదీన. అలాగే, ఎన్నో అద్భుతమైన పాటలు ప్రేక్షకులకు అందించి తిరిగి రాని లోకాలకు వెళ్లిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి జన్మించిన తేదీ కూడా మే 20నే.
Also Read: Manchu Manoj Trust - ఐదుగురు పిల్లలను దత్తత తీసుకున్న మంచు మనోజ్, మౌనిక - ఐక్య సేవా ట్రస్ట్ ప్రారంభం
సిరివెన్నెల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ... ''గతంలో ఎన్టీఆర్, సిరివెన్నెల గారితో పుట్టినరోజు జరుపుకొనేవాడిని. ఇప్పుడు సిరివెన్నెల మన మధ్య లేరు. మనిషికి అంతం ఉంటుంది. శాస్త్రి గారి పాటలకు లేదు'' అని మనోజ్ తెలిపారు.
Manchu Manoj Upcoming Movies: ప్రస్తుతం మంచు మనోజ్ 'డేవిడ్ రెడ్డి' (David Reddy Movie) సినిమాలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల కానుంది. ఇది కాకుండా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విలన్ రోల్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ విషయం గురించి ప్రశ్నించగా... అది బాలకృష్ణ గారిని అడగమని నవ్వేశారు.
Also Read: NTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?
Read Entire Article