Mahindra Bolero Facelift 2025 Price Features Variants: మహీంద్రా బోలెరో - గ్రామీణ భారతదేశానికి సింబల్‌గా నిలిచిన రగ్డ్‌ SUV. ఇప్పుడు 2025లో ఇది కొత్త రూపంలో, మరింత ఫీచర్లతో, తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. బోలెరో అభిమానుల కోసం ఈసారి మహీంద్రా చేసిన మార్పులు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

ధరలు ఇప్పుడు మరింత తక్కువ
తెలుగు రాష్ట్రాల్లో, కొత్త బొలెరో ఫేస్‌లిఫ్ట్‌ ధరలు ఇప్పుడు రూ. 7.99 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ నుంచి ప్రారంభమవుతున్నాయి. టాప్‌ వేరియంట్‌ B8 ధర రూ. 9.69 లక్షలు. గత మోడల్‌తో పోలిస్తే ధరలు ఈసారి రూ. 80,000 వరకు తగ్గాయి, ఇది ఈ సెగ్మెంట్‌లో బోలెరోని మరింత అఫోర్డబుల్‌ SUVగా మార్చింది.

వేరియంట్లు & ధరలు:

B4: రూ. 7.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

B6: రూ. 8.69 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

B6 (O): రూ. 9.09 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

B8: రూ. 9.69 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

ఇంజిన్‌ & పెర్ఫార్మెన్స్‌
ఈసారి కూడా మహీంద్రా తన 1.5 లీటర్‌ 3-సిలిండర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌నే కొనసాగించింది. ఇది 76 Hp పవర్‌, 210Nm టార్క్‌ ఇస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో రియర్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ ఉంది.

ఫీచర్లు & సస్పెన్షన్‌ మార్పులు
ఈ విషయంలో, బొలెరో ఫేస్‌లిఫ్ట్‌ 2025 మోడల్‌లో మహీంద్రా పెద్ద మార్పు చేసింది. లీఫ్‌ స్ప్రింగ్‌ సస్పెన్షన్‌ స్థానంలో కొత్త ఫ్రీక్వెన్సీ డిపెండెంట్‌ డ్యాంపర్స్‌ ఇచ్చింది. దీనివల్ల, రోడ్డుపై ఉన్న గుంతలు, రఫ్‌ ప్యాచ్‌లపై SUV ఇంకా కంఫర్ట్‌గా నడుస్తుంది.

కలర్స్‌ & లుక్‌
2025 బోలెరోలో ఇప్పుడు నాలుగు కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి, అవి - డైమండ్‌ వైట్‌, డీసాట్‌ సిల్వర్‌, రాకీ బేజ్‌, & కొత్త స్టెల్త్‌ బ్లాక్‌. ఇంటీరియర్‌లో బ్లాక్‌-బేజ్‌ కలర్‌ థీమ్‌ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఉంటుంది.

వేరియంట్‌ వారీగా ముఖ్య ఫీచర్లు

B4: 2 ఎయిర్‌ బ్యాగ్స్‌, ABS+EBD, పవర్‌ స్టీరింగ్‌, ఆటో స్టార్ట్‌-స్టాప్‌, వినైల్‌ సీట్లు.

B6: పవర్‌ విండోలు, సెంట్రల్‌ లాకింగ్‌, టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌.

B6(O): కార్నరింగ్‌ లైట్స్‌, రియర్‌ వైపర్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌, డ్రైవర్‌ ఇన్ఫో డిస్‌ప్లే.

B8: 16-ఇంచ్‌ అల్లాయ్‌ వీల్స్‌, లెదరెట్‌ సీట్లు.

ఏ వేరియంట్‌ ఎవరికి బెస్ట్‌?
మహీంద్రా బోలెరో B6(O) వేరియంట్‌ ప్రాక్టికల్‌గా బెస్ట్‌ ఛాయిస్‌. ఎందుకంటే ఇది ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్న అన్ని అవసరమైన ఫీచర్లను అందిస్తుంది - కార్నరింగ్‌ లైట్స్‌, రియర్‌ వైపర్‌, ఇన్ఫో డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే, స్టైలిష్‌ లుక్‌ & లెదరెట్‌ సీట్లు కావాలనుకునేవారు అదనంగా రూ. 60,000 పెట్టి B8 వేరియంట్‌ ఎంచుకోవచ్చు. మొత్తంగా చూస్తే, 2025 బోలెరో ఫేస్‌లిఫ్ట్‌కు "రఫ్‌ రోడ్‌ SUV"గా నిలిచే సత్తా ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ, మహీంద్రా మళ్లీ “భారతీయ గ్రామీణ రోడ్ల రాజు”గా బోలెరోని నిలబెట్టింది.