Mahesh Babu Rajamouli Fight AI Video Gone Viral : ప్రస్తుతం AI ట్రెండ్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఏదైనా అసాధ్యాన్ని టెక్నాలజీతో సుసాధ్యం చెయ్యొచ్చు. సినీ ఇండస్ట్రీలో మూవీ ప్రమోషన్స్ కోసం ఇప్పుడిప్పుడే ఏఐను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని విధంగా కొన్ని ఏఐ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలా వైరల్ అవుతున్న AI వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ఇంతకీ అందులో ఏముందంటే?

మహేశ్ బాబు, రాజమౌళి ఫైట్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి గొడవ పడుతున్నట్లుగా కొందరు AI వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని షేర్ చేసిన ఆర్జీవీ... 'సినిమా ఈజ్ డెడ్' అంటూ రాసుకొచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు కొందరు AI వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే... కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

'ఏఐతో ఏదైనా సాధ్యమే' అంటూ ఓ నెటిజన్ రియాక్ట్ కాగా... 'మహేశ్ పాస్ పోర్డ్ విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు.' అంటూ ఓ నెటిజన్ రాయగా... 'వారణాసి ప్రమోషన్స్‌లో ఈ వీడియోను కచ్చితంగా ప్లే చేస్తారు.' అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. అసలు ఇలా ఎందుకు వీడియో క్రియేట్ చేయడం అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

CINEMA IS DEAD https://t.co/JUPhPHPTDz

— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2026

Also Read : 'కల్కి 2' షూటింగ్ - 40 ఏళ్ల తర్వాత సెట్‌లో లెజెండ్స్... డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ?