Prasanth Varma's Mahakali Glimpse Review : ఫస్ట్ మూవీ 'హను మాన్'తోనే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన పర్యవేక్షణలో ఇప్పుడు వరుస ప్రాజెక్టులు రాబోతున్నాయి. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతోన్న మరో పవర్ ఫుల్ మైథలాజికల్ ఎపిక్ 'మహాకాళి' (Mahakali). ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన లుక్స్, పోస్టర్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా అది పదింతలు చేసేలా గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.

మహాకాళి గ్లింప్స్ రివ్యూ

ఇండియన్ సినిమాలో ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ 'మహాకాళి'. చెడును అంతం చేసే రౌద్ర రూపం. అందుకు తగ్గట్లుగానే నల్లని రంగు ముఖం, ముక్కు పుడక, ఉగ్ర రూపంలో మహా దేవతను కళ్లకు కట్టేలా కాళికా దేవిని ప్రెజెంట్ చేశారు ప్రశాంత్ వర్మ. మహాకాళిగా భూమి శెట్టి నటిస్తున్నారు. తాజా గ్లింప్స్‌ అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీలో శుక్రాచార్యుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆయన లుక్ ట్రెండింగ్‌గా నిలిచింది.

Also Read : Irumudi Three Days Collections : ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే

ఈ మూవీకి ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే, స్టోరీ అందిస్తుండగా... పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ రోల్ మహాకాళి పాత్రలో భూమిశెట్టి నటిస్తుండగా... హీరోయిన్ శ్రియా రెడ్డి మోస్ట్ వయలెంట్ రోల్‌లో నటిస్తున్నారు. వీరితో పాటే శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్, మురళీ శర్మ, నాజర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ కానుంది.

Also Read : Eshwar Sai Madhuri Rathod : అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.