Hyderabad BJP leader Madhavi latha In Delhi Airport: హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత మాధవీలత మరోసారి వార్తల్లో నిలిచారు. ఢిల్లీ విమానాశ్రయంలోని మహిళల ప్రార్థనా మందిరంలో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విమానాశ్రయంలోని మహిళల ప్రార్థనా గది లో ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటున్న సమయంలో, మాధవీలత అక్కడికి వెళ్లి గట్టిగా దుర్గాస్తుతి పఠించినట్లు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇతర మతస్థులు ప్రార్థనలు చేసుకుంటున్న చోట ఉద్దేశపూర్వకంగానే ఆమె ఇలా ప్రార్థనలు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో ఉండే ప్రార్థనా గదులు అన్ని మతాల వారికి అందుబాటులో ఉంటాయి. అయితే, అక్కడ ముస్లిం మహిళలు ప్రార్థనల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో, మాధవీలత అక్కడికి వెళ్లి వారి మధ్యలో కూర్చుని గట్టిగా హిందూ మంత్రాలు పఠించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇది ఇతర మతస్థులను రెచ్చగొట్టే చర్యేనని కొందరు విమర్శిస్తుండగా, తమ మత ప్రార్థనలు చేసుకునే హక్కు ఎక్కడైనా ఉంటుందని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు.

మాధవీలతకు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో రామనవమి శోభాయాత్ర సందర్భంగా ఒక మసీదు వైపు అదృశ్య బాణాన్ని వదిలినట్లు సైగ చేయడం దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీసింది. దీనిపై పోలీసులు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే పోలింగ్ రోజున బురఖా ధరించిన మహిళల ఓటర్ ఐడీ కార్డులను స్వయంగా తనిఖీ చేస్తూ, వారి ముఖాలను చూపించాలని పట్టుబట్టడం కూడా అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

She is Madhavi Latha BJP leader from Hyderabad.

She went to the women’s prayer room at Delhi airport.

Muslim women were offering namaz there, when she started reciting “Durga Stuti.”

She tried to provoke and disturb the Muslim women.

What kind of behavior is this? pic.twitter.com/isfjdSuYau

— هارون خان (@iamharunkhan) March 24, 2026

వరుసగా ఇలాంటి వివాదాస్పద పనుల ద్వారా ఆమె తన హిందూత్వ ఇమేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన నిరసనల్లో కూడా ఆమె పాల్గొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఘటన కూడా ఆమె రాజకీయ పంథాలో భాగమేనని, కావాలనే సున్నితమైన అంశాలను వివాదాస్పదం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.