Maaya Rajeshwaran: దూసుకొస్తున్న యువ కెరటం మాయ.. ముంబై ఓపెన్ సెమీస్ చేరిక, ఇప్పటికే వరల్డ్ క్లాస్ ప్లేయర్లను ఓడించిన 15 ఏళ్ల ప్లేయర్

9 months ago 8
ARTICLE AD

Maaya Vs Sania Mirza: భారత టెన్నిస్ లో 15 ఏళ్ల టీనేజర్ యాయ రాజేశ్వరన్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 15 ఏళ్ల వయసులో తొలి డబ్ల్యూటీఏ పాయింట్ సాధించిన్న పిన్న వయస్కురాలిగా నిలిచింది. ముంబై ఓపెన్ సెమీస్ కు చేరుకోవడం ద్వారా తను ఈ ఘనత సాధించింది. గతంలో హైదరాబాదీ సానియా మీర్జా టెన్నిస్ లో భారత్ తరపున ఎన్ని ప్రకంపనను రేపిందో తెలిసిన సంగతే. తాజాగా మాయలో అలాంటి పొటెన్షియల్ ఉందని నిపుణుల వాదాన తాజగా జరిగి ముంబై ఓపెన్ లో సెమీస్ చేరి సత్తా చాటింది.

క్వార్టర్ ఫైనల్లో మయా 6-3, 3-6, 6-0తో ప్రపంచ నె. 285, జపాన్ కు చెందిన మీ యమగూచిని ఓడించింది. మూడు సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో మయా కీలకదశలో సత్తా చాటింది. తొలి సెట్ లో సర్వీస్ బ్రేక్ చేసి సునాయాసంగా గెలుచుకున్న మాయ, రెండో సెట్లో మాత్రం తడబడి ప్రత్యర్థికి సెట్ సమర్పించుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు బ్రేక్ పాయింట్లు సాధఇంచి సత్తా చాటింది. పదునైన షాట్లు, నెట్ దగ్గరికి వచ్చి పాయింట్లు సాధించి తను విజయం సాధించింది.

Guess who’s in the quarterfinals of a @WTA tournament at just 15 years old? What a great achievement for Maaya Rajeshwaran 🇮🇳! Best of luck in the next round in Mumbai! VAMOS‼️ pic.twitter.com/QLLSSJGu84
— Rafa Nadal Academy by Movistar (@rnadalacademy) February 6, 2025

ప్రపంచ స్థాయి ప్లేయర్లనూ..
ఈ టోర్నీలో వైల్డ్ కార్డు ఎంట్రీగా బరిలోకి దిగిన మయా.. పలు సంచనల ప్రదర్శనలు నమోదు చేసింది. తొలి రౌండ్ లోనే ప్రపంచ 225, బెలారస్ కు చెందిన ఇరీనా షిమనోవిచ్ ను 6-4, 6-1తో వరుస సెట్లలో సునాయసంగా ఓడించి సంచలనం రేకెత్తించింది.   ప్రి క్వార్టర్స్ లో ఎంతో మెరుగైన  ప్రపంచ నెంబర్ 264,  ఇటలీకి చెందిని నికోల్ ఫొస్సాను కంగుతినిపించింది. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను గెలుచుకుని సత్తా చాటిన మాయ, అనుభవ రాహిత్యంతో రెండో సెట్ లను ప్రత్యర్థికి అప్పగించింది. ఇక కీలకమైన మూడో సెట్ లో ప్రత్యర్థి సర్వీస్ ను మూడుసార్లు బ్రేక్ చేసి, ఒక్క పాయింట్ ఇవ్వకుండానే మూడో సెట్ తో పాటు మ్యాచ్ ను తన సొంతం చేసుకుంది. దీంతో పిన్న వయస్సులోనే ఈ టోర్నీ సెమీస్ కు చేరుకుంది. ఇక అంతకుముందు జరిగిన మ్యాచ్ లో మయా 7-6, 1-6, 6-4తో అమెరికాకు చెందిన జెస్సిక ఫైల్లా ను ఓడించింది. తను గెలిచిన గత మూడు మ్యాచ్ ల్లోనూ మూడు సెట్లపాటు పోరాడి ప్రత్యర్థులను ఓడించడం విశేషం.

రఫా నాదల్ అకాడమీకి..
తమిళనాడులోని కొయంబత్తూర్ లో 2009, జూన్ 12న జన్మించిన మాయ.. ఎనిమిదేళ్ల వయసులోనే రాకెట్ చేతబట్టి ప్రాక్టీస్ ప్రారంభించింది. మాజీ ఇండియా నెం.1 కేజీ రమేశ్ మార్గదర్శకత్వంలో తొలి అడుగులు వేసిన మాయ.. ఆ తర్వాత ప్రొ సర్వ టెన్నిస్ అకాడమీలో తన ఆటకు మెరుగులు దిద్దుకుంది. కోచ్ మనోజ్ కుమార్ శిక్షణలో చాలా రాటుదేలింది. గత ఐదేళ్లుగా దినదనాభివృద్ధి చెందుతూ వస్తోంది. అమెరికన్ గ్రేట్ సెరెనా విలియమ్స్, రష్యన్ ప్లేయర్ సబలెంకా ఆటను ఇష్టపడే మయా.. వారి తరహాలోనూ దుకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులకు ముచ్చెటమలు పోయిస్తోంది. తన కెరీర్లో కేవలం ఐదో మేజర్ టోర్నీలో ఆడుతున్న మాయ.. ఏకంగా సెమీస్ కు చేరి అందరి చేత వారెవ్వా అనిపించింది. అంతకుముందే ఆమె ప్రతిభను గుర్తింపు లభించింది. ప్రముఖ రఫా నాదల్ అకాడమీలో ట్రైనింగ్ కు కూడా పిలుపొచ్చింది. స్పెయిన్ లో ఏడాది పాటు జరిగే శిక్షణలో తన ఆటతీరును మరింతగా రాటు దేల్చుకోవాలని మాయా భావిస్తోంది. వచ్చేనెలలో అకాడమీలో జాయిన్ కావడం కోసం స్పెయిన్ బయలు దేరుతోంది. దీంతో వచ్చే కొన్ని సంవత్సరాల్లో భారత చిచ్చిర పిడుగు మాయా పేరు వినిపించడం ఖాయం అని తెలుస్తోంది. ప్రస్తుతానికి కైతే ముంబై ఓపెన్ ను దక్కించుకోవాలని ఆరాట పడుతోంది. శనివారం జరిగే సెమీస్ లో ప్రపంచ నెం 117 స్విట్జర్లాండ్ కు చెందిన జిల్ టెయిక్ మన్ తో మయా తలపడనుంది.

Also Read: Bumrah Injury Update: బుమ్రా గాయంపై ఉత్కంఠ.. మరికొన్ని గంటల్లో రానున్న స్పష్టత..! తరుముకొస్తున్న మెగాటోర్నీ గడువు!!

Read Entire Article