Digital life certificate Date 2025: కేంద్ర ప్రభుత్వం జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి నిర్ణయించిన గడువు ఇక ఒక్క రోజులో ముగియనుంది. ప్రతి సంవత్సరం పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. దాంతో వయో వృద్ధులు ఎటువంటి ఆటంకం లేకుండా పెన్షన్ తీసుకుంటారు. ఒకవేళ మీరు పెన్షనర్ అయితే, జీవిత ధృవీకరణ పత్రాన్ని (Life Certificate) సమర్పించడానికి చివరి తేదీలోపు ఇది సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వం దీని కోసం నవంబర్ 30, 2025ని చివరి తేదీగా నిర్ణయించింది.

పెన్షనర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 పద్ధతుల్లోనూ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చు. అలాగే, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న పెన్షనర్ల కోసం ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది. ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల కోసం, బ్యాంకు ఉద్యోగులు ఆసుపత్రికి వెళ్లి వారి జీవిత ధృవీకరణ పత్రాలను తయారు చేయడంలో సహాయం చేస్తున్నారు. మీరు ఆన్‌లైన్‌లో జీవిత ధృవీకరణ పత్రాన్ని ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం.

ఇంట్లో కూర్చొని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని పొందండి

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఇంట్లో డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాలను పొందే సౌకర్యాన్ని అందిస్తోంది. దీనివల్ల వారు బ్యాంకులకు, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లవలసిన అవసరం ఉండదు. డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి మీరు Android ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కలిగి ఉండాలి.

అలాగే, మీరు పెన్షన్ పొందే సంస్థలో నమోదు చేసిన ఆధార్ నంబర్ మీ వద్ద ఉండాలి. తరువాత, గూగుల్ ప్లేస్టోర్ (Google Play Store) నుంచి 'AadhaarFaceRD'తో పాటు జీవన్ ప్రమాన్ ఫేస్ యాప్ (Jeevan Pramaan Face App) యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఆ తరువాత Jeevan Pramaan Face యాప్‌ను ఓపెన్ చేసి, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, లైవ్ ఫోటో ద్వారా మీ ఐడెంటిటీ ధృవీకరించాలి.

వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, యాప్‌లో అడిగిన సమాచారాన్ని ఫిల్ చేయాలి. ముందు కెమెరా నుండి మీ ఫోటోను తీసి సమర్పించాలి. దీని తరువాత మీ ఈమెయిల్, మొబైల్ నంబర్‌కు జీవిత ధృవీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేయడానికి ఒక లింక్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే ఆన్‌లైన్ విధానం

ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ (Life Certificate) సమర్పించడానికి జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఆ పోర్టల్‌లో మీ ఆధార్ నంబర్‌తో బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి. ఆ తరువాత, మీ డిజిటల్ జీవిత ధృవీకరణ సర్టిఫికెట్‌ను సంబంధిత పెన్షన్ ఆఫీసులో సబ్మిట్ చేస్తే సరిపోతుంది.