Akhil Akkineni's Lenin Yetta Yetta Song Telugu Lyrics : అక్కినేని యంగ్ హీరో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా రాబోతోన్న రూరల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన 'వారెవ్వా వారెవ్వా...' సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

అఖిల్, భాగ్యశ్రీ జోడీగా 'ఎట్టా ఎట్టా' అంటూ సాగే లవ్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా... తమన్ మ్యూజిక్ అందించారు. శ్రీకృష్ణ పాడారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో అఖిల్, భాగ్యశ్రీ డ్యాన్స్... విజువల్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. లవ్ సాంగ్ లిరిక్స్ ఓసారి చూస్తే...

'ఎట్టా ఎట్టా...' సాంగ్ లిరిక్స్

పల్లవి

గొప్పోడు గొప్పోడు దేవుడు... ఎంతటి గొప్పోడు దేవుడు

బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు...

ఆగమైపోతున్నాడు జీవుడు...

గొప్పోడు గొప్పోడు దేవుడు... ఎంతటి గొప్పోడు దేవుడు

బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు...

ఆగమైపోతున్నాడు జీవుడు...

రెండు కళ్లు సరిపోతలే... రెప్ప ముయ్యాలనిపిస్తలే...

నువ్వు తప్ప కనిపిస్తలే... నీలా ఎవరూ అనిపిస్తలే...

నడుమేమో జానెడు జానెడు... ఆ జడ చూస్తే బారెడు బారెడు...

తల్లో మెరిసి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు...

నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు...

నీ మూతి తిప్పుడు తిప్పుడు... ఆ గాజుల చప్పుడు చప్పుడు...

జారీ జారని పైటను పట్టి అట్టా ఇట్టా సర్దుడు...

నన్ను రోట్లో ఏసి రుబ్బుడు...

ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా...

ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా...

ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా...

ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా...

రెండు కళ్లు సరిపోతలే... రెప్ప ముయ్యాలనిపిస్తలే...

నువ్వు తప్ప కనిపిస్తలే... నీలా ఎవరూ అనిపిస్తలే...

గొప్పోడు గొప్పోడు దేవుడు... ఎంతటి గొప్పోడు దేవుడు

బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు...

ఆగమైపోతున్నాడు జీవుడు...

చరణం 1

హేయ్ ఇంతకాలం ఏడున్నవే... ఎందుకింత నచ్చేస్తివే...

గుండె ఎక్కి తొక్కేస్తివే... తిరగ మరగ నా ఏరుశెనగ...

ఎంతలాగా ఆడిస్తివే... నవ్వుతోటి ఓడిస్తివే...

అగ్గి మంట అంటిస్తివే... ఇరగ ఇరగ నీ సిగతరగ...

ఒంపులు బోలెడు బోలెడు... నీ సొంపులు జారుడు జారుడు..

నువ్ నడిసి నడిసి పోతావుంటే... సూసేటోడు తగ్గడు...

నువ్ సూసావంటే నెగ్గడు... ఊ.. ఊ.. ఊ...

సోకులు చెక్కుడు చెక్కుడు... నీ టెక్కులు ఎక్కుడు తొక్కుడు

నువ్ బాయి మీద గిలకను కట్టి పైపైకట్టా లాగుడు...

నీ కైపులో దించి ముంచుడూ... ఊ... ఊ... ఊ...

ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా...

ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా...

ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా...

ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా...

Also Read : కొడుకుల కోసం కథ రాస్తే... తండ్రులతో ఓకే అయ్యింది - విశ్వంభర, బాలయ్య మూవీస్ వెనుక బిగ్ ట్విస్ట్!