Lakshimi Raave Maa Intiki Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రజాధరణతో దూసుకుపోతున్న లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్‌లో ఇవాల్టి ఏపీసోడ్‌ మంచి ట్విస్ట్‌లతో సాగుతుంది. లక్ష్మీని పెళ్లిచేసుకుంటానని నేరుగా మ్యాడీ ఇంటికి వెళ్లి సూర్యనారాయణతో మాట్లాడిన విక్రమ్‌కు ఊహించని షాక్‌ ఎదురవుతుంది.మ్యాడీ,లక్ష్మీ భార్యాభర్తలని తెలుసుకుని అతను షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత ఏం చేశాడన్నది ఇవాల్టి ఏపిసోడ్‌లో తెలుసుకుందాం...
విక్రమ్‌ను రెచ్చగొట్టి పంపిన త్రిష
శ్రీలక్ష్మీ విషయంలో మ్యాడీ పదేపదే అడ్డుపడుతుండటం విక్రమ్‌కు ఏమాత్రం నచ్చదు.అసలు మా ఇద్దరి మధ్య ఎప్పుడూ వీడు ఎందుకు దూరుతున్నాడని విక్రమ్ త్రిషతో అంటాడు. వాళ్ల ఇంట్లోనే లక్ష్మీ ఉంటుందని అడ్వాన్స్‌ తీసుకుని ఆమెను ప్రేమించమని వేధించి ఉంటాడని...దీనికి లక్ష్మీ ఒప్పుకోకపోవడంతోనే ఇలా ప్రవర్తిస్తున్నాడని అంటాడు. నాకు కూడా అదే అనుమానం కలుగుతుందని...మ్యాడీ ఇంతకు ముందులా నాతో ఉండటం లేదని త్రిష అంటుంది. దీనికి ఒక్కటే పరిష్కారమని విక్రమ్‌ను రెచ్చగొడుతుంది. మ్యాడీ చెప్పినట్లు లక్ష్మీ బాధ్యత అంతా వాళ్ల తాతయ్య సూర్యనారాయణదే కదా కాబట్టి నువ్వు నేరుగా మీ అమ్మానాన్నలతో వెళ్లి లక్ష్మీని పెళ్లిచేసుకుంటానని ఆయన్నే అడగమని చెబుతుంది. ఆయన ఓకే అంటే అప్పుడు మ్యాడీ నీకు అడ్డురాడని...మీరు ఎంచక్కా కాలేజీలో కూడా ప్రేమించుకోవచ్చని చెప్పి పంపుతుంది.
లక్ష్మీని పెళ్లిచేసుకుంటానని మ్యాడీ ఇంటికి వచ్చిన విక్రమ్‌
త్రిష మాటలు నమ్మి నిజంగానే విక్రమ్‌ తల్లిదండ్రులను తీసుకుని మ్యాడీ ఇంటికి వస్తాడు. అప్పుడే కాలేజీకి బయలుదేరుతున్న మ్యాడీ,లక్ష్మీ వాళ్లను చూసి కంగారుపడతారు.వీడేంటి ఇక్కడికి వచ్చాడని మ్యాడీ అంటాడు. అంతుకు ముందు డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో త్రిషతో కలిసి డ్యాన్స్‌ వేసిన విక్రమ్‌ను చూసి ఇంట్లో వాళ్లు కూడా ఇట్టే గుర్తుపట్టేస్తారు.విక్రమ్ తల్లిదండ్రును ఇంట్లో రమ్మని పిలుస్తారు.ఇంతలో సూర్యనారాయణ వచ్చి ఏ విషయంపై మాట్లాడటానికి వచ్చారని ఆరా తీస్తారు. విక్రమ్ తల్లిదండ్రులు సూర్యనారాయణతో మాట్లాడతారు.మా అబ్బాయి మీ ఇంటి పిల్లను ఇష్టపడ్డాడని...ఆ విషయం ఆమెకు కూడా చెప్పలేదని...నేరుగా మీతో మాట్లాడితేనే బాగుంటుదని మమ్మల్ని తీసుకుని వచ్చాడని చెబుతాడు.
తికమకపడిన మ్యాడీ కుటుంబం
ప్రేమించిన అమ్మాయి కూడా విషయం చెప్పకుండా నేరుగా పెద్దలతోనే మాట్లాడటానికి వచ్చిన మీ అబ్బాయి సంస్కారం నాకు ఎంతో బాగా నచ్చిందని సూర్యనారాయణ అంటాడు. కాకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వలేమని చెబుతాడు. ఎందుకని విక్రమ్‌ అడగ్గా...మా ఐశ్వర్యకు మొన్ననే వేరే సంబంధం వచ్చిందని మేము వారికి మాట ఇచ్చామని చెబుతాడు. దీంతో విక్రమ్‌కు కూడా ఏం అర్థం కాదు. మీ ఐశ్వర్యను వేరేవాళ్లకు ఇచ్చి పెళ్లి చేస్తే మాకు అభ్యంతరం ఏముంటుందని అంటాడు. ఇంతలో సుకన్య కలుగజేసుకుని మా ఇంట్లో పెళ్లిచేయాల్సి అమ్మాయి ఐశ్వర్య మాత్రమే ఉంది కదా...ఇంకెవరు ఉన్నారని అంటుంది. మీరు పొరబడుతున్నారని....నేను ఐశ్వర్య కోసం రాలేదని...శ్రీలక్ష్మీ కోసం వచ్చానని చెబుతాడు.ఆ మాటలు విన్న సూర్యానారాయణతోపాటు ఇంట్లో వాళ్లంతా షాక్‌ తింటారు.
విక్రమ్‌ను మెడపట్టుకుని బయటకు గెంటుతానన్న పెద్దయ్య
విక్రమ్ ఆ మాటలు అనగానే కోపంతో రగిలిపోయిన సూర్యనారాయణ మెడపట్టుకుని బయటకు గెంటకు ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోండని అంటాడు. ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగేనా మాట్లాడేది అని విక్రమ్‌ అంటాడు.అయినా మేం ఏం తప్పుగా మాట్లాడమని మీరు ఇంత కోప్పడుతున్నారని అంటాడు. పెళ్లయిన అమ్మాయిని పట్టుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటానంటే మెడపట్టుకుని బయటకు గెంటకుండా చూస్తూ ఊరుకోవాలా అని పెద్దయ్య మండిపడతాడు.ఆ మాటలకు విక్రమ్‌ షాక్‌తింటాడు. పెళ్లవ్వడం ఏంటని అడగ్గా...శ్రీలక్ష్మీకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని మ్యాడీ ఆమె భర్తని చెబుతాడు.దీంతో విక్రమ్‌కు మైండ్‌ బ్లాంక్‌అవుతుంది. నిజంగా నాకు ఆ విషయం తెలియదని...కాలేజీలో కూడా ఎవరికీ వాళ్లు భార్యాభర్తలని తెలియదని అంటాడు. అందుకే పొరపాటుగా ఈ ప్రపోజల్ తెచ్చానని సారీ చెబుతాడు. మ్యాడీ దగ్గరకు వెళ్లి మొగుడు పెళ్లాలై ఉండి నన్ను వెదవని చేస్తారు కదరా మీ పని చెబుతానని అనడంతో ఇవాల్టీ ఏపిసోడ్ ముగిసిపోతుంది.