Lakshimi Raave Maa Intiki Serial Today Episode: శ్రీలక్ష్మీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని...ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోమని ఎస్‌ఐ చెప్పడంతో సూర్యనారాయణ చేసేదిలేక ఇంటికి బయలుదేరతాడు.నీకోసం నీభార్య ఎంతో త్యాగం చేసి స్టేషన్‌లో కూర్చందని మ్యాడీని పిలిచి సూర్యనారాయణ చెబుతాడు. నువ్వు నిజంగానే ఈ యాక్సిడెంట్ చేయకపోతే...నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని నీ భార్యతోనే ఇంటికి రావాలని...అప్పటి వరకు నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో మ్యాడీ ఎస్‌ఐ దగ్గరకు వెళ్లి యాక్సిడెంట్ నేనే చేశానని...ఆ సమయంలో అసలు కారులో ఆ అమ్మాయి లేదని చెప్పినా వినడు.

ఈ విషయం నిరూపిస్తూ రేపు కోర్టు సమయం ముగిసేలోపు ఆధారాలతో రమ్మని చెబుతాడు. దీంతో మ్యాడీ శ్రీలక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. మీరు ఏం బాధపడొద్దని...నేను ఆ కారులో లేనని నిరూపించే ఆధారాలు కాకుండా అసలు మీరు ఆ యాక్సిడెంట్ చేయలేదని ఆధారాలు సంపాదించడంపై దృష్టిపెట్టమని శ్రీలక్ష్మీ చెబుతుంది. అసలు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్లి చూస్తే...నీకు ఏదైనా ఆధారాలు దొరకొచ్చని అనడంతో మ్యాడీ సరేనంటూ స్టేషన్‌ నుంచి బయలుదేరివెళ్తాడు.

పోలీసుస్టేషన్‌ నుంచి సూర్యనారాయణ ఇంటికి వెళ్లడంతో అందరూ మ్యాడీ కోసం ఎదురుచూస్తుంటారు. పెద్దాయన ఒక్కడేఇంటికి రావడంతో మ్యాడీ ఎక్కడని అడుగుతారు. ఈయనగారు ఉదయం మ్యాడీని తీసుకెళ్లినప్పుడే నేను అనుకున్నానని...ఖచ్చితంగా మ్యాడీని కూడా పోలీసులకు అప్పగించే వస్తారని ప్రియంవద అంటుంది. ఆ పనిచేద్దామనేవాడిని తీసుకెళ్లానని కానీ దురదృష్టవశాత్తు అప్పటికే శ్రీలక్ష్మీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యిందని... దీంతో చేసేది లేక వెనుదిరిగి వచ్చానని అంటాడు. మరి మ్యాడీ ఏమయ్యాడని అడిగితే.. భార్య స్టేషన్‌లో ఉంటే వాడు ఇంట్లో ఎలా ఉంటాడని సూర్యనారాయణ అంటాడు. తన భార్య ఏ తప్పు చేయలేదని నిరూపించి తీసుకొచ్చేవరకు నేనే ఇంటికి రావొద్దని చెప్పానని అంటాడు.వాడిగురించి మీరు ఎలాంటి దిగులు పెట్టుకోకండని..ఖచ్చితంగా శ్రీలక్ష్మీని తీసుకునే వాడు ఇంటికి వస్తాడన్న నమ్మకం నాకు ఉందని అని చెప్పి లోపలకి వెళ్లిపోతాడు.

స్టేషన్‌ నుంచి మ్యాడీ హడావుడిగా బయటకు వెళ్లడం చూసిన బుల్లిరాజు, అతని అనుచరులు మ్యాడీని అనుసరించి వెళ్తారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం వెతుకుతున్న మ్యాడీకి ప్లాస్టిక్‌ ప్యాకెట్‌లోమిగిలిపోయిన ద్రాక్షరసం కనిపిస్తుంది. అది చూసి ఇది అసలు రక్తమే కాదని తెలుసుకుంటాడు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు ఉండటం చూసి ఫుటేజ్‌ కోసం వెళ్తాడు. అక్కడ సీసీ ఫుటేజ్ పరిశీలించిన మ్యాడీకి అసలు నిజం తెలుస్తుంది.తాను అసలు యాక్సిడెంట్‌ చేయలేదని...కావాలనే ఎవరో ఇదంతా చేశారని తెలుసుకుని ఆ ఫుటేజీని తన ఫోన్‌లో రికార్డు చేసుకుంటాడు.

ఇది కోర్టులో చూపిస్తే....శ్రీలక్ష్మీపై పెట్టిన కేసు కొట్టేస్తారని అనుకుంటూ వెళ్తుండగా బుల్లిరాజు కర్రతో మ్యాడీని కొట్టి అతడి కిడ్నాప్ చేసి బంధిస్తారు. మ్యాడీ వద్ద ఉన్న ఫోన్‌ లాక్కుని స్విచ్ఛాప్ చేస్తారు.మ్యాడీ పూర్తిగా స్పృహ కోల్పోయాడని భావించి బుల్లిరాజు,అతని అనుచరులు మందు తెచ్చుకుని ఫుల్‌గా తాగుతారు. ఇంతలో మ్యాడీకి స్పృహరావడంతో వాళ్లు మాట్లాడుకునే మాటలన్నీ వింటాడు. అయితే ఇదంతా ఆ శ్రీకాకుళం పెళ్లికొడుకు బుల్లిరాజు పనేనా అని అనుకుంటాడు.