Lakshimi Raave Maa Intiki Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రజాధరణతో దూసుకుపోతున్న లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్‌లో ఈరోజు ట్విస్ట్‌లపై ట్విస్టులతో అదిరిపోయింది. తాను గర్భవతిని కానని చెప్పిన వెంటనే సింధూను వాళ్ల అమ్మకొట్టడం చూసి గోపీ పెద్ద సాహసమే చేస్తాడు.అసలు తాను సంసారానికి పనికిరానని అందుకే నన్ను కాపాడటం కోసం సింధూ అబద్ధం చెప్పిందని చెప్పడంతో ఇంట్లో అందరూ గోపాల్‌ను కొడుతుంటే చూసి తట్టుకోలేక సింధూ నిజం చెప్పడంతో ఈరోజు ఏపిసోడ్‌ రసవత్తరంగా సాగుతుంది.

నిజం చెప్పిన సింధూ

ఇంట్లో అందరూ పదేపదే ఆస్పత్రికి వెళ్దామని అంటుంటే కోపంతో సింధూ తాను అసలు గర్భవతిని కానని చెబుతుంది. తనకు కడుపే రాలేదని అంటుంది. దీంతో ఇంట్లో అందరూ షాక్ తింటారు. కోపంతో హైమావతి సింధూ చెంపలు పగులుగొడుతుంది. నీకు అసలు కడుపు రానప్పుడు ఈనాటకం అంతా దేనికోసమని....మమ్మల్ని ఇలా పిచ్చివాళ్లను చేయడం ఎందుకని అని నిలదీస్తుంది. కూతురుని ఇష్టం వచ్చినట్లు కొడుతుంది.

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1

నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా..

2

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇంటి పెద్ద సత్యం అసలు పేరు

3

బుల్లితెరపై రాణిస్తున్న అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

4

గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్ గ్రౌండ్ తెలుసా!

5

ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

పెద్ద సాహసం చేసిన గోపి

సింధూను వాళ్ల అమ్మ కొడుతుంటే అడ్డుకున్నగోపీ...అసలు సింధూజాక్షి తనకోసమే ఈ అబద్ధం చెప్పిందని చెప్పగానే సింధూ షాక్‌ తింటుంది.ఇందులో తన తప్పు ఏమీలేదని అంటాడు. ఇప్పుడు కూడా ఆస్పత్రికి వెళ్తే నిజం ఎక్కడ భయటపడిపోతుందోనని నన్ను కాపాడటానికే ఇలా చేస్తుందని అంటాడు. దీంతో అసలు నిజం ఎంటో చెప్పండని అనగా...తాను సంసారానికి పనికిరానని అంటాడు. ఇప్పటి వరకు తాను అసలు సింధూను ముట్టుకోను కూడా ముట్టుకోలేదని చెబుతాడు. ఆ విషయం తెలిసిన రోజే సింధూ మందుతాగిందని చెబుతాడు. ఆ మాటలు వినగానే సింధూ తండ్రి గోపి చెంపలు పగులగొడతాడు.బంగారంలాంటి నాకూతురు జీవితాన్ని నాశనం చేశావు కదరా అని కొడతాడు.వాళ్ల తమ్ముడు కూడా గోపీని పిచ్చిపిచ్చిగా కొడతాడు. దీంతో అతనికి నోటి నుంచి రక్తం కారుతుంది. ఇది చూసిన సింధూ చలించిపోతుంది.నా వల్ల అనవసరంగా గోపీ దెబ్బలు తింటున్నాడని బాధపడుతుంది.

మానాన్న నువ్వు యోగ్యుడివి అని చెబితే మారుమాట్లాడకుండా పెళ్లి చేశామని అన్నదమ్ములు ఇద్దరూ గోపీని చితకబాదుతారు. ఊళ్లో వాళ్లంతా నువ్వు వీరుడు,సూరుడు అని చెబుతుంటే....నీలో ఉన్న లోపం గురించి నువ్వు అయినా చెప్పాలి కదా అని కొడుతుంటారు.ఇంతలో ప్రియంవద కల్పించుకుని మేం ఆరోజే చెప్పామని ఆ పల్లెటూరు సంబంధం వద్దని అయినా వినకుండా పెళ్లి చేశారని ఇప్పుడు సిందూ జీవితం నాశనం అయ్యిందని అంటుంది. మీ అన్నయ్య గురించి నువ్వైనా చెప్పాలి కదా అని లక్ష్మీపై మండిపడుతుంది. నీకు మాత్రం మా మ్యాడీ కావాలి...మా సింధూకు మాత్రం ఇలాంటి వాడిని కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మ్యాడీ వచ్చి వీడిని నా కళ్లముందు నుంచి తీసుకెళ్లండని లేకుంటే నేనే చంపేస్తానని అనడంతో వాళ్ల నాన్న,బాబాయి ఇంకా బాగా కొడతారు.అది చూసి సింధూ తట్టుకోలేకపోవడం చూసిన ప్రియంవద నువ్వు కామ్‌గా లోపలికి వెళ్లిపొమ్మని చెబుతుంది.

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1

'నిండు మనసులు' సీరియల్ సిద్ధు గురించి ఈ విషయాలు తెలుసా?

2

'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ చిన్నోడు.. నితిన్ అద్వి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

3

కార్తీక దీపం 2 విలన్ రోల్ జ్యోత్స్న.. హోస్ట్, సీరియల్స్.. ఇంకా మరెన్నో!

4

పెద్దికి 'పొదరిల్లు' సీరియల్‌లో పెళ్లికాలేదు కానీ రియల్ వైఫ్ ఫొటోస్ చూశారా!

5

'పొదరిల్లు' సీరియల్ సూర్యప్రతాప్ ( ఆనంద్) ఏ ఏ సినిమాల్లో నటించారు, రోజుకి ఆయన రెమ్యునరేష్ ఎంతో తెలుసా?

నిజం ఒప్పుకున్న సింధూ

గోపీని కొట్టడం చూసి తట్టుకోలేకపోయిన సింధూ వచ్చి వాళ్ల నాన్ను అడ్డుకుంటుంది. తప్పు మొత్తం నాదేనని అంటుంది. నాకు ఇష్టంలేకుండా పెళ్లిచేశారని నేనే గోపి ప్రేమను అర్థం చేసుకోలేదని...కనీసం తనను దగ్గరకు రానివ్వలేదని వాళ్ల తాతయ్యకు చెబుతుంది. ఇప్పుడు కూడా నామీద ప్రేమతోనే గోపీ ఇలాంటి సాహసం చేశాడని చెబుతుంది. నామీద ప్రేమతోనే నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడని అంటుంది. నాకోసం ఏ భర్త చేయని పనులు కూడా ఇంటివద్ద చేశాడని చెబుతుంది. ఆరోజు మేం హైదరాబాద్‌ వచ్చింది కూడా హనీమూన్ కోసం కాదని...విడాకులు కోసం లాయర్‌ను కలవడానికే వచ్చామని అంటుంది. విడాకులు ఇవ్వకపోతే చచ్చిపోతానని బెదిరించడానికే నేను పురుగులు మందు తాగినట్లు నటించానని వాళ్ల తాతయ్యతో చెప్పి ఏడుస్తుంది.దీంతో సూర్యనారాయణ మనవరాలి చెంపపగులగొట్టడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.