Lakshimi Raave Maa Intiki Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రజాధరణతో దూసుకుపోతున్న లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్‌లో ఈరోజు ట్విస్ట్‌లపై ట్విస్టులతో అదిరిపోయింది. రౌడీల నుంచి తప్పించుకున్న ప్రియంవద భర్త పారిపోతూ నర్సును చూసి ఆగిపోతాడు. అతని నుంచి తప్పించుకుని ప్రియంవద ఇంటికి వస్తుంది నర్సు...ఆవిడను గుర్తుపట్టిన శ్రీలక్ష్మీ పెద్దయ్యకు విషయం చెప్పడంతో అతను నర్సును నిలదీయడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా మారుతుంది.
నిజం చెప్పిన అభి
శ్రీలక్ష్మీ తన తల్లిదండ్రులు గురించి నిజం చెప్పి బాధపడటంతో ఇంట్లో అందరూ ఆమెకు అండగా నిలుస్తారు. నువ్వు బాధపడొద్దని నీకు మేం ఉన్నామని భరోసా ఇస్తారు. ఐష్‌తోపాటు అభికూడా మేం కూడా ఉన్నాం వదిన అని అంటాడు. నువ్వు ఎప్పుడు వదిన పార్టీలో చేరావురా అని ఐష్ అభిని అడుగుతుంది. వెంటనే అభి తన తప్పు తెలుసుకుని వాళ్ల తాతయ్యకు నిజం చెప్పేస్తాడు. లక్ష్మీ చెబుతున్నా వినకుండా సూర్యనారాయణకు నిజం మొత్తం చెప్పేస్తాడు. నేను క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డానని...పెద్దఎత్తున అప్పులు చేశానని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ తింటారు. ఆ అప్పు తీర్చడం కోసం.. ప్రియంవద అత్తయ్య నాయనమ్మ కోసం తెచ్చిన నెక్లెస్‌ కొట్టేసి మా ఫ్రెండ్‌కు ఇచ్చానని చెబుతాడు. ఈవిషయం తెలుసుకున్న వదిన అతనికి నచ్చజెప్పి ఆ నెక్లెస్ వెనక్కి తిరిగి తెచ్చిందని చెప్పడంతో వాళ్లనాన్న అజయ్‌ కొడుకు చెంపపగులగొడతాడు. సూర్యనారాయణ అతన్ని ఆపి వాడిని చెప్పనివ్వమని అంటాడు. ఈవిషయం తెలియక ప్రియంవద అత్తయ్య వదినను అవమానించిందని అంటాడు. తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి మళ్లీ అలాంటి తప్పు చేయడని పెద్దయ్య కొడుకుకు చెబుతాడు. చూశావు కదా ప్రియంవద...ఆరోజు మేం ఎంత చెబుతున్నా వినకుండా గోపి,లక్ష్మీని అవమానించావని..కానీ అభికోసం నింద తనపై వేసినా లక్ష్మీ నోరుమెదపలేదని అది ఆమె సంస్కారమని కూతురికి క్లాస్‌ పీకుతాడు
ప్రియంవద ఇంటికి వచ్చిన నర్సు
రౌడీల నుంచి తప్పించుకున్న ప్రియంవద భర్త దారిలో నర్సును చూసిగ గుర్తుపడతాడు. మర్యాదగా నా కూతురు ఎక్కడ ఉందో చెప్పమని బెదిరిస్తాడు.ఇంతలో రౌడీలు రావడం చూసి ఆమెను వదిలేయగానే నర్సు పారిపోయి ప్రియంవదకు ఫోన్ చేసి విషయం చెబుతుంది.నీ భర్త నన్ను గుర్తుపట్టి బెదిరించాడని చెబుతుండగానే మళ్లీ వచ్చిన అతను నా కూతురు ఎక్కడ ఉందో చెప్పకపోతే మీ ఇంటికి వచ్చి నిన్ను తగలబెట్టేస్తానంటూ బెదిరిస్తాడు.ఈలోగా రౌడీలు వచ్చి మళ్లీ అతన్ని వెనక్కి తీసుకెళ్తారు. ఇంతలో నర్సు పరుగెత్తుకుంటూ సూర్యనారాయణ ఇంటికి వచ్చేస్తుంది.ప్రియంవద అమ్మగారు మీరే నన్ను కాపాడాలంటూ అరుస్తూ వస్తుంది. ఎవరమ్మా నువ్వు ఏంటి నీ సమస్య అని అడగ్గా....తన కూతురు ఆస్పత్రిలో ఉంది నాన్న సాయం కోసం వచ్చిందని ప్రియంవద చెప్పి తనను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
నర్సును గుర్తుపట్టిన లక్ష్మీ
నర్సును గుర్తుపట్టిన లక్ష్మీ నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావని అుగుతుంది.ఈ నర్సు నీకు ముందే తెలుసా అని పెద్దయ్య ప్రశ్నించగా...రెండు,మూడుసార్లు మన ఇంటి ముందు ప్రియంవద అమ్మగారిని కలిసి డబ్బులు తీసుకోవడం చూశానని అంటుంది.చెప్పాను కదా నాన్నగారు...వాళ్ల అమ్మాయి ఆపరేషన్ కోసం ఇచ్చానని అంటుంది. కానీ మీరు సాయం చేసినట్లు ఇవ్వలేదని...భయంతో ఇచ్చినట్లు అనిపించిందని లక్ష్మీ అంటుంది. పైగా ఈ విషయం నేను ఈమెను రోడ్డుపై కలిసి అడిగితే చెప్పకుండా పారిపోయిందని అంటుంది.రెండోసారి పట్టుకుని నిలదీసినా చెప్పలేదని...పోలీసులు పేరు చెప్పగానే ఏదో చిన్న పాప అని మాత్రమే చెప్పి తప్పించుకుందని అంటుంది. నాకు తెలిసినంత వరకు ప్రియవద అమ్మగారికి, ఈ నర్సుకు మధ్య చిన్న పాప విషయంలో ఏదో జరిగిందని చెబుతుంది. అలాంటిదేమీ లేదని ప్రియంవద చెప్పగా....నువ్వు చెబుతున్నది అబద్ధమని అర్థమవుతుందని సూర్యనారాయణ అంటాడు. మర్యాదగా నువ్వు నిజం చెప్పకపోతే నేనే పోలీసులను పిలిపిస్తానని సూర్యనారాయణ నర్సును బెదిరిస్తాడు.