Lakshimi Raave Maa Intiki Serial Today Episode:ఐశ్వర్య పెళ్లికి ఇప్పుడప్పుడే మంచి ముహూర్తాలు లేవనిచెప్పి పంతులుగారు వెళ్లిపోవడంతో సూర్యనారాయణ కూడా హాల్‌లో నుంచి గదిలోకి వెళ్లిపోతాడు.‌అప్పుడు శ్రీలక్ష్మీ రేపు నేను,మధుబాబు పర్యావరణ దినోత్సవం సందర్భంగా అడవికి వెళ్తున్నామని...కాలేజీ నుంచి చాలామంది విద్యార్థులు కూడా వెళ్తున్నారని ఇందరకు చెబుతుంది. వెంటనే కలుగజేసుకున్న ప్రియంవద...మీరు వెళ్లడానికి వీల్లేదని అంటుంది.అయినా అడవి మనిషివి నువ్వు వెళితే వెళ్లని...కానీ మ్యాడీని తీసుకెళ్లడానికి కుదరదని చెబుతుంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది రెస్పాన్స్‌ అని అంటుంది.

Also Read: ఆధార్ భద్రతకు మూడు సూత్రాలు! సైబర్ మోసాలకు చెక్ పెట్టే టిప్స్‌!

ఇప్పటికే ఒకసారి వాడిని పాము కరిచి చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడని ఇప్పుడు మళ్లీ ఈ అడవుల చుట్టూ తిరగడం అవసరమా అని అంటుంది. అయినా ఎవరిని అడిగి ఈ పిచ్చిపనులు చేస్తున్నావని నిలదీస్తుంది.ఇప్పటికే సమాజ సేవ అంటూ ఎవడినో కాపాడి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నావని....అడవిలో నీకు ఎదైనా జరిగితే వాడిని ఎవరు చూసుకుంటారని అడుగుతుంది.అతని గురించి మీరు ఏమీ భయపడాల్సిన పనిలేదని...డబ్బులు మొత్తం కట్టేశాం కాబట్టి ట్రీట్‌మెంట్ సాగుతోందని....త్వరలోనే అతను మామూలు మనిషి అయిపోతాడని చెబుతుంది.ఇంతలో అక్కడికి వచ్చిన సూర్యనారాయణ ఏం జరుగుతోందని అడుగుతాడు. మేమిద్దరం రేపు అడవికి వెళ్తున్నామని చెప్పగా...సంతోషంగావెళ్లి రమ్మని చెబుతాడు. మ్యాడీ అమ్మ చాలా భయపడగా...వాడి ప్రాణాలు కాపాడిన లక్ష్మీ పక్కనే ఉండగా ఇక వాడి గురించి దిగులు ఎందుకని అంటాడు.

Also Read: స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI

లాయర్‌ దగ్గర సంతకం పెట్టకుండా బయటకు వచ్చిన గోపీపై సింధూ మండిపడుతుంది. ఆరోజు విడాకులు ఇస్తానని ఇప్పుడు మాటమారుస్తున్నావేంటని నిలదీస్తుంది. నీలో ఏదో దురుద్దేశం ఉందని అంటుంది.నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీలేవని..కాకపోతే నేను సంతకం పెట్టలేకపోతున్నానని అంటాడు.ఇప్పుడు మీకు విడాకులు ఇస్తే ఊరిలో మా పరువు ఏం అవుతుందని...మా అమ్మ తలఎత్తుకుని ఎలా తిరుగుతుందని అంటాడు. విడాకులు అనేవి మన ఇద్దరికి సంబంధించినవి కావని...రెండు కుటుంబాలకు సంబంధించినవిఅని అంటాడు. మా అమ్మకు, మీ తాతయ్యకు నేను ఏం సమాధానం చెప్పాలని అంటాడు. అందుకే ఒకసారి కూర్చుని ఆలోచించుకుని దీనిపై నిర్ణయం తీసుుందామని చెబుతాడు.లాయర్‌ దగ్గరకు వెళ్లి ఇదే విషయం చెప్పి మేం మళ్లీ వస్తామని చెప్పి కాగితాలు తీసుకుని అక్కడి నుంచి బయటపడతాడు.

Also Read: మీ ఆధార్ కార్డు మీరే వాడుతున్నారా? ఇంకా ఎవరైనా వాడుతున్నారా? తక్షణమే ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి!

ఉదయమే అడవికి వెళ్లడానికి శ్రీలక్ష్మీ బట్టలు సర్దుకుంటుండగా...సూర్యనారాయణ ఆమె గదిలోకి వస్తాడు. మధుసూధన్ ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు.ఆయన తన రూమ్‌లో ఉన్నాడని చెప్పడంతో సూర్యనారాయణకు ఆగ్రహం వస్తుంది. అంటే మీరిద్దరూ ఒకే గదిలో ఉండటం లేదా అని నిలదీస్తాడు.లేదని శ్రీలక్ష్మీ చెబుతుంది.దీంతో సూర్యనారాయణ కేకలు వేసి అందరినీ పిలుస్తాడు.వీళ్లద్దరూ సంతోషంగా కలిసి ఉండటం లేదని...ఉన్నట్లు నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.ఇంతలో అక్కడికి వచ్చిన మ్యాడీని ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావని నిలదీస్తాడు. అయినా మీరిద్దరూ ఒకే రూమ్‌లో ఎందుకు ఉండటం లేదని అంటాడు. లేదని మేమిద్దరం ఇదే రూమ్‌లో ఉంటున్నామని చెప్పగా....శ్రీలక్ష్మీ అబద్ధాలు చెప్పదని అనడంతో నిజం తెలిసిపోయిందని అనుకుంటాడు. ఈరోజు నుంచి నువ్వు ఇదే గదిలో శ్రీలక్ష్మీతోపాటు కలిసి ఉండాలని,..లేకపోతే నేను ఏం చేస్తానో కూడా తెలియదని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. తాతయ్య వెళ్లిపోయిన తర్వాత మ్యాడీ లక్ష్మీపై మండిపడతాడు.తాతయ్యకు ఎందుకు చెప్పావని నిలదీస్తాడు. నేను ఏం చెప్పలేదని....ఆయనే వచ్చి చూసి అడిగారని చెబుతుంది.